అభిషేక్ బచ్చన్ కొత్త కారు ఇదే.. ధర తెలిస్తే షాకవుతారండోయ్!

సెలబ్రిటీలు లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని అందరికీ తెలుసు. ఇందులో భాగంగానే ఖరీదైన బైకులు, కార్లు ఉపయోగిస్తుంటారు. ఇటీవల పలువురు సినీ ప్రముఖులు ఖరీదైన కార్లను కొనుగోలు చేశారు. ఇందులో అమితాబ్ బచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలోనే ఈయన టయోటా కంపెనీ యొక్క వెల్‌ఫైర్ ఎంపీవీ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారును అభిషేక్ స్వయంగా డ్రైవ్ చేయడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ప్రముఖ బాలీవుడ్ స్టార్ అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేసిన టయోటా వెల్‌ఫైర్ ధర రూ. 1.5 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. ఇక్కడ కనిపించే కారు ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్. కాబట్టి ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో పెరిగిన ఫ్రంట్ గ్రిల్, సొగసైన హెడ్‌ల్యాంప్‌ వంటివి కనిపిస్తాయి. పరిమాణం పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుందని స్పష్టంగా అర్థమవుతోంది.

Abhishek Bachchan Toyota Vellfire Luxury MPV

టయోటా వెల్‌ఫైర్ పొడవు 4995 మిమీ, వెడల్పు 1850 మిమీ, ఎత్తు 1950 మరియు వీల్‌బేస్ 3000 మిమీ వరకు ఉంటుంది. అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ కారు బ్లాక్ పిల్లర్స్ మరియు క్రోమ్ గార్నిష్ వంటి వాటిని పొందుతుంది. ఇది 19 ఇంచెస్ డ్యూయెల్ ఛానల్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ఇది ఎల్ఈడీ బార్‌తో రీడిజైన్ చేయబడిన ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్‌లను పొందుతుంది.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ అండ్ హీటెడ్ సీట్లు, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్, రూఫ్ మౌంటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్, రెండు సీట్లలో ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ అండ్ రిక్లైనింగ్ ఫంక్షన్, 360 డిగ్రీ కెమెరా మరియు ఏడీఏఎస్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

Abhishek Bachchan Toyota Vellfire Luxury MPV

టయోటా వెల్‌ఫైర్ కారులో 2.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది స్ట్రాంగ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది 193 పీఎస్ పవర్ మరియు 240 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ ఈ-సీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది. ఇది హాయ్ మరియు వీఐపీ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది.

టయోటా వెల్‌ఫైర్ హాయ్ వేరియంట్ ధర రూ. 1.20 కోట్లు, వీఐపీ విత్ ఎగ్జిక్యూటివ్ లాంజ్ ప్యాకేజీ వేరియంట్ ధర రూ. 1.30 కోట్లు (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్). అయితే అభిషేక్ బచ్చన్ కొనుగోలు చేసిన కారు ఏ వేరియంట్ అనేది స్పష్టంగా తెలియదు. మొత్తం మీద ఈ కారు ఆధునిక డిజైన్ కలిగి.. అధునాతన ఫీచర్లతో చాలా హుందాగా కనిపిస్తుంది.

అభిషేక్ బచ్చన్ మాత్రమే కాకుండా.. టయోటా వెల్‌ఫైర్ కారును బాలీవుడ్‌లో భూమి పెడ్నేకర్, అనిల్ కపూర్, అజయ్ దేవగన్, అమీర్ ఖాన్, మలయాళ నటులు మోహన్ లాల్ మరియు ఫహద్ ఫాసిల్ వంటి వారు కూడా ఉపయోగిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే సినీ ప్రముఖులు ఈ కారును ఎంతగా ఇష్టపడుతున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. ఇది ప్రస్తుతం భారతదేశంలో ఎంతోమందికి ఇష్టమైన ఎంపీవీ కూడా.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 31, 2024, 9:00 [IST]
English summary
Famous actor abhishek bachchan driving toyota vellfire luxury mpv
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+