ఒక్క చూపుతూనే ఫిదా చేస్తున్న బైక్.. 'దుల్కర్ సల్మాన్' ఇన్‌స్టా ఫొటోస్ వైరల్

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఆల్ట్రావయొలెట్ ఆటోమోటివ్ ఇటీవలే 'ఎఫ్77 మ్యాక్ 2' బైక్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ బైకుతో నటుడు 'దుల్కర్ సల్మాన్' కనిపించారు. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

నటుడు 'దుల్కర్ సల్మాన్' (Dulquer Salmaan) ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసిన ఫోటోలలో గమనించినట్లయితే.. కొత్త అల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్ 2 ఎలక్ట్రిక్ బైక్ చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఏకంగా 15 లక్షల కంటే ఎక్కువ లైక్ పొందాయి. కాగా పలువురు అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

Dulquer Salmaan With New Ultraviolette F77 Mach 2

ఇక ఆల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్ 2 బైక్ విషయానికి వస్తే.. ఇది ఒరిజినల్ మరియు రీకాన్ అనే రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 2.99 మరియు రూ. 3.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇవి రెండూ చూడటానికి ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ బ్యాటరీ మరియు రేంజ్ వంటి విషయాల్లో భిన్నంగా ఉంటాయి. ఫీచర్స్ మాత్రం దాదాపు ఒకేలా ఉంటాయి.

కంపెనీ ఇప్పటికే ఈ బైక్ కోసం రూ. 5000 టోకెన్ మొత్తంతో బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. అయితే సంస్థ పేర్కొన్న ధరలు మొదటి 1000 మంచి కస్టమర్లకు మాత్రమే వర్తిసాయి. ఆ తరువాత ధరలు పెరిగి ఉండే అవకాశం ఉంటుంది. ఎంత పెరుగుతుందనేది తెలియాల్సి ఉంది. కాగా బుక్ చేసుకొన్నా వారికి మే నెలలో డెలివరీలు ప్రారంభమవుతాయి.

Dulquer Salmaan With New Ultraviolette F77 Mach 2

అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ బైక్ 7.1 కిలోవాట్ బ్యాటరీ (ఒరిజినల్ వేరియంట్) కలిగి ఒక ఫుల్ చార్జితో 211 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక టాప్ వేరియంట్ రీకాన్ వేరియంట్ మాత్రం 10.3 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఒక ఫుల్ చార్జితో 323 కిమీ రేంజ్ అందిస్తుంది. దీన్ని బట్టి చూస్తే డిజైన్ పరంగా రెండూ ఒకే మాదిరిగా ఉన్నప్పటికీ.. రేంజ్ విషయంలో చాలా వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది.

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే కొత్త అల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్ 2 బైక్.. దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. హెడ్ లైట్ మరియు టెయిల్ లైట్ డిజైన్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ బైక్ వివిధ రంగులలో లభిస్తుండం వల్ల కస్టమర్లు ఇందులో తమకు నచ్చిన కలర్ ఆప్షన్ పొందుతుంది. మొత్తం మీదే ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ పొందుతుంది.

అల్ట్రావయొలెట్ ఎఫ్77 మ్యాక్ 2 ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 5 ఇంచెస్ TFT స్క్రీన్ ఉంటుంది. ఇది బైక్ గురించి చాలా సమాచారాన్ని అందిస్తుంది. అంతే కాకూండా ఇందులో ఆటో డిమ్మింగ్ లాంప్, హిల్ హోల్డ్, ఎబీఎస్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. తద్వారా మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, April 30, 2024, 16:35 [IST]
English summary
Famous actor dulquer salmaan with new ultraviolette f77 mach 2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+