కొత్త కారు కొన్న ప్రముఖ నటుడు 'హర్షవర్ధన్ రాణే'- నెట్టింట్లో ఫోటోలు వైరల్
భారతదేశంలో అత్యంత ప్రజాదర పొందిన టయోటా కంపెనీకి చెందిన 'ఇన్నోవా హైక్రాస్' సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా సెలబ్రిటీలను కూడా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో భాగంగానే ఈ MPVని నటుడు 'హర్షవర్ధన్ రాణే' కొనుగోలు చేశారు. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
సనమ్ తేరీ కసమ్ అనే హిందీ చిత్రంతో చిత్రసీమలో అడుగుపెట్టిన 'హర్షవర్ధన్ రాణే' తెలుగు వారికి కూడా సుపరిచయమే. ఎందుకంటే ఈయన తెలుగులో కూడా మాయ, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి మొదలైన చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఇప్పుడు టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పీవీని కొనుగోలు చేసి ట్రెండింగ్‌లో నిలిచాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ ఎమ్‌పీవీకి సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ.. నా నెక్స్ట్ సినిమా షూటింగ్ మే లేదా జూన్ 2024లో ఉంటుంది. నేను ఆ సమయంలో మధ్యప్రదేశ్ మరియు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంది. విమానంలో కాదు, ఈ కారులోనే ప్రయాణిస్తాను అన్నట్టు పేర్కొన్నారు. కారు కొన్న సమయంలో అభిమానులతో ఫోటోలకు ఫోజులిచ్చారు.
నటుడు హర్షవర్ధన్ రాణే కొత్త కారును కొన్న సందర్భంలో డీలర్‌షిప్‌లో హిందూ ఆచారాలను నిర్వహించడం కూడా చూడవచ్చు. ఆ తరువాత అక్కడ ఉన్న మహిళా ఉద్యోగులతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. పలువురు నెటిజన్లు కొత్త కారు కొన్న హర్షవర్ధన్ రాణేకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే ఈ ఫోటోలకు వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి.

టయోటా ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross)
నటుడు హర్షవర్ధన్ రాణే కొనుగోలు చేసిన ఇన్నోవా హైక్రాస్ టాప్ వేరియంట్ అయిన 'జెడ్ఎక్స్' హైబ్రిడ్ అనే తెలుస్తోంది. ఈ మోడల్ అద్భుతమైన డిజైన్ మరియు అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ హైబ్రిడ్ కారు ఫ్లోటింగ్ 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు లెదర్ అపోల్స్ట్రే వంటి వాటిని పొందుతుంది.
పైన పేర్కొన్న ఫీచర్స్ మాత్రమే కాకుండా.. ఇందులో ఫ్రంట్ ఎండ్ సీట్లు, యాంబియంట్ లైటింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ ఇన్నోవా హైక్రాస్ మోడల్ సేఫ్టీకి కూడా పెద్ద పీట వేస్తుంది. కాబట్టి ఇది ప్రయాణికుల భద్రతను నిర్థారిస్తుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ రెండు పవర్‌ట్రెయిన్ ఎంపికలతో వస్తుంది. ఒకటి 173 bhp పవర్ మరియు 209 Nm టార్క్ అందించే 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్. మరొకటి హైబ్రిడ్ సెటప్‌తో కూడిన 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 184 bhp పవర్ మరియు 188 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ CVT ట్రాన్స్‌మిషన్‌తో లభిస్తుంది. స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్ e-CVT గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.
నటుడు హర్షవర్ధన్ రాణే టయోటా ఇన్నోవా హైక్రాస్ మాత్రమే కాకుండా.. కస్టమ్ బిల్డ్ ఫోర్స్ క్యాంపర్‌వాన్‌ను కలిగి ఉన్నారు. ఇది ప్రత్యేకమైన క్యాంపర్ మాట్ బ్లూ మరియు బ్లాక్ పెయింట్ స్కీమ్ పొందుతుంది. లోపలి భాగం ఎక్కువ వుడ్ వర్క్ పొంది ఉండటం గమనించవచ్చు. సోఫా స్టైల్ సీటింగ్ సెటప్, గ్యాస్ స్టవ్, మంచం మొదలైనవన్నీ ఇందులో ఉన్నాయి. లాంగ్ డ్రైవ్ వెళ్ళడానికి హర్షవర్ధన్ ఈ కారును ఉపయోగిస్తారు.
హర్షవర్ధన్ రాణే వద్ద బీఎండబ్ల్యూ మోటొరాడ్ కంపెనీకి చెందిన 'ఆర్ నైన్ టీ స్క్రాంబ్లర్' (BMW R Nine T Scrambler) బైక్ కూడా ఉంది. ఈ బైక్ ధర రూ.17.25 లక్షలు. ఇది 1170 సీసీ బాక్సర్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 108 పీఎస్ పవర్ మరియు 116 న్యూటన్ ,మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైకులో హైడ్రాలిక్‌గా పనిచేసే క్లచ్‌తో 6-స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








