మొన్న కార్తీక్ ఆర్యన్.. నేడు హృతిక్ రోషన్ - సెలబ్రిటీల మనసు దోచేస్తున్న కారు ఇదే!

ఆధునిక కాలంలో కొత్త కార్లను కొనుగోలు చేసే సెలబ్రిటీల సంఖ్య బాగా పెరిగింది. ఇప్పటికే అనేక ఖరీదైన కార్లను కలిగి ఉన్న బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తాజాగా మరో కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

నటుడు హృతిక్ రోషన్ కొనుగోలు చేసిన కొత్త కారు రేంజ్ రోవర్ అని తెలుస్తోంది. ఇటీవల ఈ SUVలో డైరెక్టర్ 'ఫరా ఖాన్' పార్టీకి రావడం కనిపించిది. హృతిక్ రోషన్ ఈ రేంజ్ రోవర్ కారులో పార్టీకి వచ్చిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ముంబైలో జరిగిన పార్టీకి హృతిక్ రోషన్.. తన కొడుకు మరియు స్నేహితురాలు 'సబా ఆజాద్'లతో కలిసి వచ్చారు.

Hrithik Roshan Range Rover Autobiography LWB

హృతిక్ రోషన్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారు 3.0 ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ (లాంగ్ వీల్ బేస్) వేరియంట్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 3.1 కోట్లు (ఎక్స్ షోరూమ్). నటుడు హృతిక్ రోషన్ ట్యాన్ లెదర్ ఇంటీరియర్‌తో కూడిన క్లాసీ శాంటోరిని బ్లాక్ షేడ్ ఎంచుకున్నారు. అయితే ఈ కారుకు సంబంధించిన చాలా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

హృతిక్ రోషన్ రేంజ్ రోవర్ 3.0 ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబీ మోడల్ 3.0 లీటర్ హైబ్రిడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది గరిష్టంగా 346 Bhp పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ మరియు ఆల్ వీల్ డ్రైవ్ (AWD) సిస్టం పొందుతుంది. ఇది 48వీ మైల్డ్ హైబ్రిడ్ సిస్టం పొందుతుంది. డిజైన్ మరియు ఫీచర్స్ చాలా అద్భుతంగా ఉంటాయి.

Hrithik Roshan Range Rover Autobiography LWB

నటుడు హృతిక్ రోషన్ కేవలం రేంజ్ రోవర్ మాత్రమే కాకుండా లంబోర్ఘిని ఉరుస్ కూడా కలిగి ఉన్నారు. దీనిని ఈయన 2022లో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కారు ప్రత్యేకమైన మోనోసెరస్ షేడ్‌లో కనిపిస్తుంది. చూడటానికి చాలా అద్భుతంగా ఉండే.. ఈ కారు పనితీరు పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం. లంబోర్ఘిని సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే కార్లలో ఒకటి.

హృతిక్ రోషన్ లంబోర్ఘిని 4.0 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ వీ8 ఇంజిన్ పొందుతుంది. ఇది గరిష్టంగా 850 న్యూటన్ మీటర్ టార్క్ మరియు 650 పీఎస్ పవర్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది. పవర్ డెలివరీ అన్ని చక్రాలకు సమానంగా పంపిణీ చేయబడుతుంది. దీంతో వినియోగదారుడు తప్పకుండా మంచి డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు.

కార్తీక్ ఆర్యన్ రేంజ్ రోవర్

హృతిక్ రోషన్ మాత్రమే కాకుండా ఇటీవల నటుడు కార్తీక్ ఆర్యన్ కూడా ఓ రేంజ్ రోవర్ కారుని కొనుగోలు చేశారు. ఇతడు కొనుగోలు చేసిన కొత్త రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ టాప్ స్పెక్ ధర రూ. 4.47 కోట్లు. ఇది 4.4 లీటర్ ట్విన్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇంజిన్ 523 Bhp పవర్ మరియు 750 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, March 22, 2024, 14:00 [IST]
English summary
Famous actor hrithik roshan buys range rover autobiography lwb
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+