రూ.32 లక్షల బైక్ రైడ్ చేస్తూ కనిపించిన జాన్ అబ్రహం - వీడియో

కార్లు, బైకులంటే దాదాపు అందరికి ఇష్టమే.. అయితే ఈ ఇష్టం కాస్త సెలబ్రిటీలకు ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగానే వారు ఎప్పటికప్పుడు ఖరీదైన బైకులను మరియు కార్లను కొనుగోలు చేస్తూ.. ఉపయోగిస్తూ ఉంటారు. ఇటీవల సూపర్‌బైక్‌లపై ఎక్కువ ఆసక్తి కలిగిన బాలీవుడ్‌ జాన్‌ అబ్రహమ్‌ ఇటీవలే ఏప్రిలియా ఆర్ఎస్457 మోటార్‌సైకిల్‌ కొనుగోలు చేశారు. కాగా ఇప్పుడు రూ. 32 లక్షల ఖరీదైన 'ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 1100 ఫ్యాక్టరీ అల్ట్రా డార్క్‌' బైక్ రైడ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

నటుడు జాన్ అబ్రహం తన ఏప్రిలియా సూపర్‌బైక్‌ను రైడ్ చేస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసాయబడింది. ఇందులో నటుడు ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 1100 ఫ్యాక్టరీ అల్ట్రా డార్క్‌ రైడ్ చేస్తూ రావడం చూడవచ్చు. తన ఆఫీసుకు జాన్ అబ్రహం బైకుపై వచ్చినట్లు ఇక్కడ తెలుస్తోంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియో ఎంతోమంది అభిమానులను ఫిదా చేస్తోంది.

John Abraham Ride Aprilia RSV4

జాన్ అబ్రహం రైడ్ చేస్తూ కనిపించిన బైక్ ఇటీవలే కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇది మాట్ బ్లాక్ కలర్, గోల్డ్ అల్లాయ్ వీల్స్ మరియు గోల్డ్ యాక్సెంట్‌లతో ఉండటం చూడవచ్చు. ఇది అల్ట్రా గోల్డ్, టైమ్ అటాక్ మరియు స్పీడ్ వైట్ రంగులలో కూడా లభిస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఉత్తమంగా ఉండే ఈ బైక్ అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

ఇటాలియన్ సూపర్ బైక్ తయారీదారు ఏప్రిలియా 2024 ఏప్రిల్‌లో తన ఆర్‌ఎస్‌వీ4 1100 ఫ్యాక్టరీని విడుదల చేసింది. దీని ధర రూ. 31.26 లక్షలు. ఈ బైక్ 1099 సీసీ లాంగిట్యూడినల్ వీ4 ఇంజిన్ పొందుతుంది. ఇది 13000 ఆర్‌పిఎమ్ వద్ద 214 బిహెచ్‌పి పవర్ మరియు 10550 ఆర్‌పిఎమ్ వద్ద 125 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. కాబట్టి రైడర్ మంచి రైడింగ్ అనుభూతిని పొందవచ్చు.

John Abraham Ride Aprilia RSV4

కొత్త ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 1100 ఫ్యాక్టరీ సస్పెన్షన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో 125 మిమీ ట్రావెల్‌తో కూడిన 43 మిమీ ఫుల్లీ అడ్జస్టబుల్ ఓహ్లిన్స్ యుఎస్‌డి ఫోర్క్‌లను పొందుతుంది. వెనుక భాగంలో ఫుల్లీ అడ్జస్టబుల్ 115 మీమీ ఓహ్లిన్స్ ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ మోనోషాక్‌ను పొందుతుంది. ఇది సాక్స్ స్టీరింగ్ డంపర్‌ని కూడా పొందుతుంది. మంచి బ్రేకింగ్ సిస్టం ఇందులో లభిస్తుంది.

ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 1100 ఫ్యాక్టరీ బైక్ సీటు ఎత్తు 851 మిమీ కాగా.. ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 17.9-లీటర్ వరకు ఉంటుంది. ఈ బైక్ మొత్తం బరువు 202 కేజీల వరకు ఉంటుంది. ఈ బైకులో ట్రాక్షన్-కంట్రోల్, లాంచ్ కంట్రోల్, స్పీడ్ లిమిటర్ మరియు క్రూయిజ్ కంట్రోల్‌ వంటి ఫీచర్స్ ఉంటాయి. ఈ బైకులో 5-ఇంచెస్ TFT కన్సోల్ ఉంటుంది. ఇది బైక్ గురించి కావాల్సిన వివరాలను రైడర్లకు అందిస్తుంది.

నటుడు జాన్ అబ్రహం.. ఏప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 1100 బైక్ మాత్రమే కాకుండా, అనేక అన్యదేశ్య బైకులను మరియు కార్లను కలిగి ఉన్నారు. జాన్ అబ్రహం గ్యారేజిలో కవాసకి నింజా జెడ్ఎక్స్ 14 ఆర్, యమహా వీ-మ్యాక్స్, హోండా సీబీఆర్1000ఆర్ఆర్-ఆర్, యమహా వైజెడ్ఎఫ్-ఆర్1, డుకాటీ పానిగేల్, కెటిఎమ్ 390 డ్యూక్, డుకాటి డయావెల్, సుజుకి జీఎస్ఎక్స్ 1000ఆర్ మరియు హయబుసా వంటి బైకులు ఉన్నాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Friday, May 31, 2024, 16:26 [IST]
English summary
Famous actor john abraham ride rs 32 lakh aprilia rsv4 bike
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+