డబుల్ ఇస్మార్ట్ నటుడి కొత్త కారు.. ధర ఎన్ని కొట్లో తెలుసా?
పండగలకు, పబ్బాలకు.. పుట్టిన రోజులకు, పెళ్లిరోజులకు ఇలా ఏదో ఒక అకేషన్ పేరుతో ఖరీదైన వాహనాలను కొనుగోలు చేయడం సెలబ్రిటీలకు పరిపాటే. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ స్టార్ 'సంజయ్ దత్' (Sanjay Dutt) తన పుట్టినరోజు నాడు ఏకంగా రూ. 5 కోట్లు విలువైన ఓ రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సంజయ్ దత్ కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారు గురించి, ఇతర సెలబ్రిటీలు ఎవరైనా ఈ బ్రాండ్ కారును కొనుగోలు చేశారా? అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల కొనుగోలు చేసిన కారు రేంజ్ రోవర్ ఎస్వీ ఆటోబయోగ్రఫీ అని తెలుస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. కారును హోమ్ డెలివరీ చేయడం చూడవచ్చు. ఇటీవల కాలంలో చాలామంది సెలబ్రిటీలు కార్లను కొనుగోలు చేసి హోమ్ డెలివరీ చేసుకుంటున్నారు. సంజయ్ దత్ కూడా ఈ విధానాన్నే ఎంచుకున్నారు. కారును వీడియో స్పష్టంగా చూడవచ్చు.

కారును హోమ్ డెలివరీ చేసే సమయంలో ఫ్యాన్స్ సందడి చేయడం కూడా గమనించవచ్చు. అంతే కాకుండా ఫోటో గ్రాఫర్లు ఫోటోలు తీయడం కూడా చూడవచ్చు. సంజయ్ దత్ కొనుగోలు చేసిన కారు చాలా ఆకర్షణీయమైన ఆకుపచ్చ రంగులో ఉండటం చూడవచ్చు. ఈ కారు డిజైన్ పరంగా గానీ, ఫీచర్స్ పరంగా గానీ చాలా అద్భుతంగా ఉంది. దీని పర్ఫామెన్స్ కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని తెలుస్తోంది.
సంజయ్ దత్ కొనుగోలు చేసిన ఈ రేంజ్ రోవర్ కారు 24 వే హీటెడ్ అండ్ కూల్డ్ ఎగ్జిక్యూటివ్ రియర్ సీట్లను పొందుతుంది. ఇందులో 13.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 13.1 ఇంచెస్ రియర్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లు, మెరిడియన్ 3డీ సరౌండ్ సౌండ్ సిస్టం, ప్రీమియం లెదర్ అప్‌హోల్‌స్టరీ మరియు మల్టి ఫంక్షన్ స్టీరింగ్ వీల్స్ వంటి మరెన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.

రేంజ్ రోవర్ ఎస్వీ కారు 4.4 లీటర్ ట్విన్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 523 Bhp పవర్ మరియు 750 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి.. నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారు ధర రూ. 2.75 కోట్ల నుంచి రూ. 4.80 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది.
నటుడు సంజయ్ దత్ రేంజ్ రోవర్ కారును మాత్రమే కాకుండా.. ఆడి క్యూ7, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఫెరారీ 599 జీటీబీ, రోల్స్ రాయిస్ ఘోస్ట్, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 మరియు మెర్సిడెస్ మేబ్యాచ్ ఎస్580 వంటి మరెన్నో అన్యదేశ్య మరియు ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. ఇప్పుడు తాజాగా రూ. 5 కోట్ల రేంజ్ రోవర్ కొనుగోలు చేశారు. ఈ కారు చాలా ఆకర్షణీయంగా ఉంది.
భారతదేశంలో చాలామంది సెలబ్రిటీలు ఎక్కువగా ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో రేంజ్ రోవర్ కూడా ఒకటి. సంజయ్ దత్ మాత్రమే కాకుండా.. ల్యాండ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో పూజ హెగ్డే, సోనమ్ కపూర్, అలియా భట్ & రణబీర్ కపూర్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ మొదలైన వారు ఉన్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








