దేవి సినిమా నటుడు గుర్తున్నాడా? ఇప్పుడు కొత్త కారు కొన్నాడు (వీడియో)

సెలబ్రిటీలు, ప్రముఖులు మరియు పారిశ్రామికవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త కార్లను, బైకులను కొనుగోలు చేస్తూ ఉంటారు. గతంలో మనం చాలా కథనాల్లో సెలబ్రిటీలు కొనుగోలు చేసిన ఖరీదైన వాహనాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా మరో సినీ నటుడు తన గ్యారేజిలో టయోటా బ్రాండ్ కారును చేర్చారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ కొత్త కారు కొనుగోలు చేసే ప్రముఖుడు ఎవరు? ఆయన కొనుగోలు చేసిన కారు ఏది? దాని ధర ఎంత?.. అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం..

ఇటీవల కారు కొన్న ప్రముఖ నటుడు షిజు అబ్దుల్ రషీద్. ఈయన మలయాళీ సినిమాల్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా నటించారు. దేవీ, త్రినేత్రం వంటి సినిమాల్లో తనదైన రీతిలో నటించి అభిమానుల మనసు దోచారు. ఈయన ఇటీవల టయోటా కంపెనీకి చెందిన టైసర్ (Taisor) కారును కొనుగోలు చేశారు. ఈ కారు కొనుగోలుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Shiju Abdul Rasheed Toyota Urban Cruiser Taisor

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్‌ విషయానికి వస్తే.. ఇది దేశీయ మార్కెట్లో అత్యుత్తమ అమ్మకాలు పొందుతున్న బ్రాండ్ కార్లలో ఒకటి. ఇది టయోటా ఇండియా మారుతి ఫ్రాంక్స్ ఆధారిత క్రాస్ఓవర్. దీని ధరలు రూ. 7.73 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతాయి. ధర పరంగా ఇది మారుతి ఫ్రాంక్స్ కంటే ఎక్కువని తెలుస్తోంది. మారుతి ఫ్రాంక్స్ ధర రూ. 7.51 లక్షలు మాత్రమే.

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్‌ అనేది మారుతి ఫ్రాంక్స్‌పై ఆధారపడి ఉన్నప్పటికీ కొంత అప్డేటెడ్ డిజైన్ మరియు ఫీచర్స్ చూడవచ్చు. కాబట్టి ఇందులో అప్‌డేట్ ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్‌ కనిపిస్తుంది. ఇందులో రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, ట్వీక్డ్ బంపర్‌లు, కొత్తగా స్టైల్ చేసిన ఎల్ఈడీ డీఆర్ఎల్ మరియు రీడిజైన్ చేసిన అల్లాయ్ వీల్స్ వంటి విజువల్ ఎలిమెంట్‌లు ఉన్నాయి.

Shiju Abdul Rasheed Toyota Urban Cruiser Taisor

ఇంటీరియర్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త సీట్ అప్హోల్స్ట్రేతో లేటెస్ట్ థీమ్‌ కనిపిస్తుంది. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీతో కూడిన పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 360 డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు ఒక హెడ్-అప్ డిస్ప్లే వంటివి ఇందులో ఉన్నాయి.

టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్‌ 1.2 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (88 Bhp పవర్/113 న్యూటన్ మీటర్ టార్క్). 1.0 లీటర్ టర్బో పెట్రోల్ (99 Bhp పవర్/148 న్యూటన్ మీటర్ టార్క్) పొందుతుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్ లేదా 5 స్పీడ్ ఆటోమాటిక్ గేర్బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.

నిజానికి సెలబ్రెయితీలు లేదా సినీతారలు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. వెండితెర నటులు, నటీమణులు.. బుల్లితెర నటులు ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తూనే ఉన్నారు. సాధారణ ప్రజల మాదిరిగానే సెలబ్రిటీలు కూడా కార్లను, బైకులను కొనుగోలు చేయడం సర్వ సాధారణం అయిపోయింది. కొందరు కోట్లు విలువ చేసే కార్లను కొనుగోలు చేస్తే.. మరికొందరు లక్షల విలువ చేసే కార్లను కొనుగోలు చేస్తున్నారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 10, 2024, 10:05 [IST]
English summary
Famous actor shiju abdul rasheed buys new toyota urban cruiser taisor
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+