జర్మన్ బ్రాండ్ కారు కొన్న ఇండియన్ యాక్టర్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్
ప్రముఖ నటుడు వసిష్ఠ సింహ ఇటీవల జర్మన్ లగ్జరీ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈయన కొన్న కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
వసిష్ఠ సింహ కేవలం కన్నడ సినిమాల్లో మాత్రమే కాకుండా.. తెలుగు, తమిళ సినిమాల్లో కూడా నటించారు. 2011లో ఐటీ ఫీల్డ్ వదిలి సినీ పరిశ్రమలో అడుగుపెట్టి ఆ తరువాత అతి తక్కువ కాలంలోనే గొప్ప పేరు తెచ్చుకున్నారు. గతేడాది నటి హరిప్రియను వివాహం చేసుకున్నారు. పెళ్లి తరువాత ఈ జంటను అభిమానులు సింహప్రియ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

సింహప్రియ జంట కొనుగోలు చేసిన కారు 'మెర్సిడెస్ బెంజ్' (Mercedes Benz) కంపెనీకి చెందిన 'జీఎల్ఈ 450డీ 4మ్యాటిక్' (GLE 450d 4Matic). ఈ లగ్జరీ కారు ఎక్స్షోరూమ్ ధర రూ. 1.15 కోట్లు. కారు కొనుగోలు చేసిన తరువాత, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో శుభాకాంక్షలు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో వసిష్ఠ సింహ మరియు హరిప్రియ ఇద్దరూ డీలర్షిప్ వద్దకు రావడం, అక్కడ కారు కొనుగోలుకు సంబంధించిన కొన్ని వర్క్స్ పూర్తి చేసి.. కారును డెలివరీ తీసుకుంటారు. కారు మీద ఉన్న గుడ్డను తొలగించడం, కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం వంటివి కూడా వీడియోలో చూడవచ్చు. కారు లోపలి భాగాన్ని కూడా ఈ వీడియోలో చూడవచ్చు.

ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్ల జాబితాలో ఒకటైన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450డీ మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు 3 లీటర్ 6 సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్ పొందుతుంది. ఇది 367 పీఎస్ పవర్ మరియు 750 న్యూట మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది.
ఆల్ వీల్ డ్రైవ్ (AWD) టెక్నాలజీ కలిగిన ఈ కారు గరిష్ట వేగం గంటకు 230 కిమీ. ఇందులో సులభంగా ఐదుమంది వ్యక్తులు కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ కారు బూట్ స్పేస్ ఏకంగా 630 లీటర్లు. కాబట్టి ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి ఇది అనుమతిస్తుంది. సుదూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇది చాలా ఉపయోగకరంగా ఉండటమే కాకుండా.. వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
చూడగానే ఆకర్శించే డిజైన్ కలిగిన మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 450డీ ఉత్తమ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంటేషన్ క్లస్టర్ కోసం 12.3 లీటర్ డ్యూయెల్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్ ఆప్ డిస్‌ప్లే మరియు 13 స్పీకర్ బర్మెస్టర్ సౌండ్ సిస్టం వంటి ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
డిజైన్ మరియు ఫీచర్స్ కాకుండా ఈ కారు అధునాతన సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇందులో 9 ఎయిర్‌బ్యాగ్‌లు, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) వంటి మరెన్నో ఫీచర్స్ ఇందులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఈ కారు బీఎండబ్ల్యూ ఎక్స్5, ఆడి క్యూ7 మరియు వోల్వో XC90 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. అయినప్పటికీ ఎక్కువమంది కస్టమర్లను ఆకర్శించడంలో విజయం సాధించింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








