'కంగనా రనౌత్' అంటే ఆ మాత్రం ఉంటది!.. కళ్ళు చెదిరే కార్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే..

సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకున్న బాలీవుడ్ నటి 'కంగనా రనౌత్' లోక్‌సభ ఎన్నికల్లో అరంగేట్రం చేసిన విషయం విదితమే. హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఈమె ప్రత్యర్థులను చిత్తూ చేసి భారీ విజయంతో గెలిచింది. మొదటి ప్రయత్నంలో ఈమె 74755 ఓట్ల మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కంగనా 537022 ఓట్లను పొందగా.. సమీప ప్రత్యర్థి విక్రమాదిత్య సింగ్ 462267 ఓట్లను పొందారు. సినీ నటి నుంచి ఎంపీగా ఎన్నికైన కంగనా ఎలాంటి కార్లను ఉపయోగిస్తోంది? వాటి వివరాలు ఏంటి అనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

నటి నుంచి ఎంపీగా మారిన కంగనా రనౌత్ ఖరీదైన అన్యదేశ్య కార్లను కలిగి ఉంది. ఈమె తన గ్యారేజిలో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్680, బీఎండబ్ల్యూ 730 LD, మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350డీ మరియు ఆడి క్యూ3 వంటి మరిన్ని లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ గతంలోనే కొనుగోలు చేసి ఉపయోగిస్తోంది. ఈ కార్లు చూడటానికి చాలా ఆకర్షణీయంగా మాత్రమే కాకుండా.. మంచి పర్ఫామెన్స్ అందిస్తాయి.

kangana-ranaut-mercedes-maybach-s680

మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ ఎస్680

కంగనా రనౌత్ ఉపయోగించే ఖరీదైన కార్లలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'మేబ్యాక్ ఎస్680' ఒకటి. దీని ధర రూ. 3.43 కోట్లు (ఎక్స్ షోరూమ్). అద్భుతమైన డిజైన్ కలిగిన మెర్సిడెస్ బెంజ్ కారు 5980 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 603.46 బీహెచ్‌పీ పవర్ మరియు 900 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 9 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది.

బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఎల్డీ

జర్మన్ బ్రాండ్ అయిన బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన 7 సిరీస్ LD కూడా కంగనా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ.1.45 కోట్లు (ఎక్స్-షోరూమ్). ఇది 3.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి 262 బీహెచ్‌పీ పవర్ మరియు 620 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఎల్డీ కొంత మంది సెలబ్రిటీలతో కంగనా ఒకరు.

kangana-ranaut-mercedes-benz-gle

మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350డీ

కంగనా గ్యారేజిలోని మరో లగ్జరీ కారు 'మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 350డీ'. పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో లభించే ఈ కారు రూ.96.65 లక్షల నుంచి రూ.1.10 కోట్ల (ఎక్స్ షోరూమ్) ధర మధ్యలో ఉంటుంది. ఇది 300డీ, 450డీ, 450 అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. 350డీ 3.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ కలిగి 255 Bhp పవర్ మరియు 620 Nm టార్క్ అందిస్తుంది.

ఆడి క్యూ3

భారతదేశంలో ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన కార్లలో ఒకటిగా ఉన్న ఆడి క్యూ3 కూడా కంగనా గ్యారేజిలో ఉంది. దీని ధర రూ.44.89 లక్షల నుంచి రూ.50.39 లక్షల(ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. ఈ లగ్జరీ కారు 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ కలిగి 188 Bhp పవర్ మరియు 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరును అందిస్తుంది.

audi-q3

బాలీవుడ్ చిత్ర సీమలో అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో కంగనా రనౌత్ ఒకరు. నిజానికి ఈమె 2006లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి అంచెలంచెలుగా ఎదిగారు. ఈమె తెలుగులో కూడా డార్లింగ్ ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించి అలరించింది. కాగా ఇప్పుడు సినీ పరిశ్రమ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. మొదటి ప్రయత్నంలోనే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపై బహుశా సినిమాల్లో నటించకపోవచ్చు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Saturday, June 8, 2024, 9:00 [IST]
English summary
Famous actress and mp kangana ranaut car collection
Read more on: #off beat
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+