మొన్న సునీల్ శెట్టి.. నేడు మీనాక్షి అనూప్ - ఈ కారుపైనే సెలబ్రిటీల చూపు
ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి నిదర్శనమే ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఇటువైపు తిరగటం. గత కొన్ని రోజులకు ముందు నటుడు సునీల్ శెట్టి, ఇప్పుడు నటి 'అనునయ అనూప్' ఈవీలను కొనేశారు. మరిన్ని వివరాలు ఇక్కడ చూసేద్దాం.
ప్రముఖ మలయాళీ సినీ నటి అనునయ అనూప్ (మీనాక్షి అనూప్) ఇటీవల 'ఎంజీ మోటార్స్' (MG Motors) యొక్క 'కామెట్ ఈవీ' (Comet EV) కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో నటి పసుపు రంగు కామెట్ ఈవీ పక్కన ఉండటం చూడవచ్చు. కేవలం 18 ఏళ్ల యువ నటి ఈ కారును కేరళలోని కంపెనీ డీలర్షిప్ వద్ద డెలివరీ తీసుకుంది.

మీనాక్షి అనూప్ కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ కారు ఎంజీ కామెట్ ఈవీ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ అని తెలుస్తోంది. పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్న ఈ కారు హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, హాలోజన్ టెయిల్‌లైట్స్, బ్రాండ్ లోగో మరియు వీల్ కవర్‌లతో కూడిన 12 ఇంచెస్ స్టీల్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా ORVMల మీద ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి.
ఎంజీ కామెట్ ఈవీ స్టార్‌లైట్ బ్లాక్ ఇంటీరియర్ థీమ్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ సెన్సార్‌లు వంటి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఈ కారు ముందు మరియు వెనుక సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టమ్ ఉంటుంది. మాన్యువల్ పార్కింగ్ బ్రేక్, స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్ ఫంక్షన్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి పొందుతుంది.
ఎంజీ కామెట్ ఎగ్జిక్యూటివ్ వేరియంట్ ఎల్ఈడీ రియర్ ఫాగ్ లైట్, 7 ఇంచెస్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రిమోట్ సెంట్రల్ లాకింగ్, క్రీప్ మోడ్, కీలెస్ ఎంట్రీ మరియు మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ వంటి వాటితో పాటు పవర్ అడ్జస్టబుల్ ఓఆర్వీఎం, రెండు స్పీకర్లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా ఇందులో లభిస్తుంది. కాబట్టి ఇది అన్ని విధాలా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.
ఎంజీ కామెట్ ఎలక్ట్రిక్ కారు 17.3 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది 42 పీఎస్ పవర్ మరియు 110 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుంది. కామెట్ ఈవీ హోమ్ ఛార్జర్ ద్వారా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి సుమారు 7 గంటల సమయం పడుతుంది.
సునీల్ శెట్టి ఎంజీ కామెట్
ఇప్పటికే పైన చెప్పుకున్నట్లు నటుడు సునీల్ శెట్టి కూడా ఎంజీ కామెట్ ఈవీ కొనుగోలు చేశారు. ఇది స్టార్రి బ్లాక్ కలర్‌లో చూడటానికి ఆకర్షణీయంగా ఉంది. ఇది టాప్ స్పెక్ వేరియంట్ అని తెలుస్తోంది. సునీల్ శెట్టి మాత్రమే కాకుండా నటుడు రోహిత్ రాయ్ కూడా ఎంజీ కామెట్ ఈవీ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా తాను స్వయంగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








