ప్రముఖ నటి మనసు దోచిన మహీంద్రా కారు ఇదే!.. ఫిదా చేస్తున్న వీడియో

సినీ పరిశ్రమలో చాలా మందికి కార్ల మీద మక్కువ ఎక్కువని అందరికి తెలుసు. ఈ కారణంగానే సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి 'అనూషా రాయ్' మహీంద్రా యొక్క XUV700 కొనుగోలు చేసింది.

నాగకన్నికే మరియు రాజకుమారి వంటి సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన అనూష రాయ్.. కన్నడలో మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లో కూడా నటించింది. ప్రిన్సెస్ అనే సీరియర్ ద్వారా ఎంతోమంది అభిమానుల మనసుదోచుకున్న ఈ అమ్మడు ఇటీవల తన 27వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి ఇంట్లో జరుపుకుంది. పుట్టిన రోజు సందర్భంగా నటి మహీంద్రా ఎక్స్‌యూవీ700 (Mahindra XUV700) కారు కొనుగోలు చేసింది.

Anusha Rai Buys New Mahindra XUV700

మహీంద్రా కంపెనీ యొక్క XUV700 కారును కొనుగోలు చేసిన తరువాత దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అనూషా కారుకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఫిల్ చేయడం, ఆ తరువాత XUV700 కారును డెలివరీ తీసుకోవడం వంటి సన్నివేశాలను చూడవచ్చు. ఈమె XUV700 యొక్క AX7 వేరియంట్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇది చూడగానే ఆకర్శించే డిజైన్ పొందుతుంది.

మహీంద్రా XUV700 యొక్క AX7 వేరియంట్ ధర రూ. 21.29 లక్షలు వరకు ఉంది. నిజానికి XUV700 ఎమ్ఎక్స్, ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7 మరియు ఏఎక్స్7ఎల్ వేరియంట్లలో లభిస్తుంది. ఇవన్నీ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతాయి. XUV700 AX7L మరియు AX వేరియంట్లు కొత్త నాపోలి బ్లాక్ పెయింట్ స్కీమ్ పొందుతాయి. అంతే కాకుండా ఇవి ఆప్షనల్ డ్యూయెల్ టోన్ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తాయి.

Anusha Rai Buys New Mahindra XUV700

మహీంద్రా XUV700 పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలను పొందుతుంది. అవి 2.0 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్. ఇవి రెండు మంచి పనితీరును అందిస్తాయి. పవర్ మరియు టార్క్ గణాంకాలు దాని మునుపటి మోడల్స్‌లో మాదిరిగానే ఉంటాయి. కాబట్టి ఇవి వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

మహీంద్రా XUV700 మంచి డిజైన్ మాత్రమే కాకుండా అంతకు మించిన ఫీచర్స్ కూడా పొందుతుంది. కాబట్టి ఇందులో సెంట్రల్ కన్సోల్‌లో అప్‌డేట్ చేయబడిన క్యాబిన్, ఎయిర్ వెంట్స్ మరియు డార్క్ క్రోమ్ ఫినిషింగ్ చూడవచ్చు. ఏఎక్స్7ఎల్ వేరియంట్ కస్టమ్ సీట్ ప్రొఫైల్‌లకు లింక్ చేయబడిన ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మెమొరీ ఓఆర్వీఎం లతో కూడైన వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లను పొందుతుంది.

మహీంద్రా XUV700 అనేది ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు దూసుకెళ్తోంది. మహీంద్రా కంపెనీ ఈ కారులో ఆధునిక ఫీచర్స్ ప్రవేశపెట్టడం వల్ల ఎక్కువమంది ఈ కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్(ADAS) వంటి ఆధునిక ఫీచర్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈ కారు భారతీయ మార్కెట్లో ఎక్కివమందిని ఆకర్శించడంలో విజయం పొందింది. ఇప్పటికి కూడా దీనికున్న ఆదరణ ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Monday, May 6, 2024, 9:08 [IST]
English summary
Famous actress anusha rai buys new mahindra xuv700
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+