అటల్ సేతుపై ప్రయాణించిన 'రష్మిక మందన్న'.. వంతెన గురించి ఏమన్నారో తెలుసా?

ప్రముఖ నటి 'రష్మిక మందన్న' (Rashmika Mandanna) ఇటీవల 'అటల్ సేతు' (Atal Setu) మీద ప్రయాణించారు. ప్రయాణ అనుభూతిని, దేశం యొక్క అభివృద్ధిని గురించి రష్మిక ఓ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

ఈ ఏడాది ప్రారంభంలో దేశప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన అటల్ సేతు ముంబై ట్రాఫిక్‌ను అధిగమించడానికి ఒక వరం అని రష్మిక మందన్న అన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెనగా పేరుగాంచిన ఈ బ్రిడ్జ్ పొడవు 22 కిలోమీటర్లు. ఈ వంతెన ద్వారా సెవ్రి మరియు నవా సెవా ప్రాంతాలకు కేవలం 20 నిముషాల్లో చేరుకోవచ్చు. గతంలో ఈ ఈ ప్రయాణం రెండు గంటలు కావడం గమనార్హం.

Rashmika Mandanna

ఈ వంతెన గురించి రష్మిక మందన్న చాలా గొప్పగా మాట్లాడుతూ.. అంతా అద్భుతంగా ఉందని అన్నారు. ఇలాంటి వంతెన భారతదేశంలో ఒకటి నిర్మించబడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఇకపై భారతదేశానికి సాధ్యం కానిదంటూ ఏదీ లేదని అందరికీ అర్థమవుతోంది. గత 10 సంవత్సరాలలో భారతదేశంలో మౌలిక సదుపాయాలు చాలా అభివృద్ధి చెందాయని దేశ ప్రధాని నరేంద్ర మోదీ గురించి కూడా గొప్పగా మాట్లాడారు.

బ్రిడ్జ్ గురించి మాట్లాడుతూనే.. యువ భారతీయలకు బాగా అవగాహన ఉంది. ఎవరికి ఓటు వేయాలో మీరే నిర్ణయించుకోండి. వికాస్ మరియు అభివృద్ధికి ఓటు వేయండి అంటి పేర్కొన్నారు. పలు దశల్లో జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు అందరూ వెళ్లి తప్పకుండా ఓటు వేయాలని రష్మిక కోరారు. దేశంలో లోక్‌సభ ఎన్నికలు ఇంకా మూడు దశల్లో జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడవుతాయి.

Atal Setu Bridge Mumbai

అటల్ సేతు

ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL)గా పిలువబడే అటల్ సేతు (Atal Setu) వంతెన 2024 జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సుమారు రూ. 17.84 కోట్లతో నిర్మించబడిన ఈ బ్రిడ్జ్ పొడవు ఏకంగా 22 కిలోమీటర్లు. ఇందులో 16.50 కిమీ బ్రిడ్జి నిర్మాణం సముద్రం మీద, మిగిలిన 5.50 కిమీ బ్రిడ్జి భూమి మీద నిర్మించారు. ప్రారంభం రోజునే ఈ వంతెనను మోదీ జాతికి అంకితమిచ్చారు.

ఆరు లేన్ల అటల్ సేతు వంతెన ముంబై అభివృద్ధికి మరో మార్గమైంది. ఈ బ్రిడ్జి ప్రారంభం మరియు చివర్లలో కార్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు మొదలైనవన్నీ కేవలం 40 కిమీ / గంట వేగంతో ప్రయాణించాలి. బ్రిడ్జి మధ్య భాగంలో 100 కిమీ/గం వేగంతో వెళ్లొచ్చని సమాచారం. ఇది భూకంపాల భారీ నుంచి కూడా తట్టుకుని టెక్నాలజీతో నిర్మించబడింది.

అటల్ సేతుపైన ప్రమాదాలను నివారించడానికి బైకులు, ఆటో రిక్షాలు వంటివి పూర్తిగా నిషిద్ధం. అంతే కాకుండా ఈ వంతెన మీదుగా రోజుకి 70000 కంటే ఎక్కువ వాహనాల రాకపోకలు జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. సముద్రం మీద నిర్మితమైన ఈ వంతెన వల్ల సముద్ర జీవులకు ఎటువంటి హాని కలగకుండా ఉండేందుకు అవసరమైన టెక్నాలజీ కూడా ఇందులో ఉపయోగించారు.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, May 16, 2024, 10:13 [IST]
English summary
Famous actress rashmika mandanna speak about atal setu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+