మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్

ప్రముఖ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. క్రిప్టో కరెన్సీ మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే రూ. 97.79 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

ఈడీ జప్తు చేసుకున్న ఆస్తుల జాబితాలో రాజ్ కుంద్రాకు చెందిన ఖరీదైన కార్లైన పోర్స్చే కయెన్ మరియు బెంట్లీ ప్లయింగ్ స్పర్ సెడాన్లను కూడా స్వాధీనం చేసుకుంది. అంతే కాకుండా వీరికి సంబంధించిన జుహూ ప్లాట్ మరియు ఇతర ఆస్తులను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Raj-Kundra-Cars

నిజానికి 2017లో ప్రజలను నమ్మించిన క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే 10 శాతం లాభాలు వస్తాయని నమ్మించారు. దీంతో ప్రజల దగ్గర నుంచి సుమారు రూ. 6600 కోట్లు వసూలు చేశారు. అయితే లాభాలు వచ్చిన తరువాత రాజ్ కుంద్రా ప్రజలను మోసం చేసినట్లు తెలిసింది. దీనిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఈ కేసులో సంబంధం ఉన్న చాలామందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ బిట్ కాయిన్ల కేసులో ప్రధాన నిందితుడు భరద్వాజ్ అని తెలిసింది. అయితే 285 బిట్ కాయిన్లను స్వీకరించడం వల్ల రాజ్ కుంద్రా ఈ కేసులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. రాజ్ కుంద్రా ఆస్తులను సొంతం చేసుకున్న ఈడీ వాటిని రాబోయే రోజుల్లో వేలం వేయనున్నట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా రాజ్ కుంద్రా మీద అభియోగాలు తలెత్తాయి.

ఈడీ స్వాధీనం చేసుకున్న కార్లలో పోర్స్చే కయెన్ జీటీఎస్ మరియు బెంట్లీ కంపెనీకి చెందిన ప్లయింగ్ స్పర్ వంటివి ఉన్నాయని ప్రారంభంలోనే చెప్పుకున్నాం. బెంట్లీ ప్లయింగ్ స్పర్ ధర రూ.3.41 కోట్లు అని తెలుస్తోంది. ఇది 6.0-లీటర్ డబ్ల్యు12 పెట్రోల్ ఇంజిన్ కలిగి 626 Bhp పవర్ మరియు 900 Nm టార్క్ అందిస్తుంది. ఇది కేవలం 4.6-సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది.

శిల్పా శెట్టి గ్యారేజిలోని ఖరీదైన కార్లు: శిల్పా శెట్టి గ్యారేజిలోని ఇతర కార్ల విషయానికి వస్తే.. వీరి వద్ద బెంట్లీ కాంటినెంటల్ జీటీ, మెర్సిడెస్ మేబ్యాచ్ జీఎల్ఎస్600, మెర్సిడెస్ బెంజ్ జె63 AMG, బీఎండబ్ల్యూ ఎక్స్5, బీఎండబ్ల్యూ 7 సిరీస్, రేంజ్ రోవర్ వోగ్, మెర్సిడెస్ బెంజ్ వీ-క్లాస్ వంటి వాటితో పాటు లంబోర్ఘిని అవెంటడార్, లంబోర్ఘిని గల్లార్డో, బీఎండబ్ల్యూ ఐ8, పోర్స్చే కార్లు ఉన్నాయని తెలుస్తోంది.

Raj-Kundra-Cars

నిజానికి సినీ పరిశ్రమలో ఖరీదైన కార్లను ఉపయోగించే సెలబ్రిటీల జాబితాలో శిల్పా శెట్టి మరియు రాజ్ కుంద్రా కూడా ఉన్నారు. వీరి వద్ద అత్యంత ఖరీదైన అన్యదేశ్య కార్లు ఉన్నాయి. వీటిలో వీరిరువురు చాలా సార్లు కనిపించారు. సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన శిల్పా శెట్టి ఎక్కువ పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు కావడం గమనించదగ్గ విషయం.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Wednesday, April 24, 2024, 17:58 [IST]
English summary
Famous actress shilpa shetty husband raj kundra cars seize to ed
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+