పాపం సన్నీ లియోన్.. కారులో నుంచి దిగటానికి ఎంత కష్టపడిందో (వీడియో)
ప్రముఖ నటి సన్నీ లియోన్ గురించి ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. సినిమాల్లో నటిస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈమె ఖరీదైన కార్లను ఉపయోగిస్తుందనే విషయం కూడా అందరికి తెలుసు. సన్నీ లియోన్ ఉపయోగించే కార్లలో ఎక్కువగా మసెరటి కార్లు ఉన్నాయి. కాగా ఇటీవల ఈమె ఓ టయోటా ఫార్చ్యూనర్ కారులో కనిపించారు. అయితే ఈ కారులో నుంచి కింది దిగటానికి ఎంత ఇబ్బంది పడ్డారో ఇక్కడ వీడియోలో చూడవచ్చు. ఇంతకీ ఈమె ఇబ్బంది పడటానికి కారణం ఏమిటి? దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
ఫ్యాషన్ సెన్స్‌కు ప్రసిద్ధి చెందింది సన్నీలియోన్.. ఖరీదైన కార్లలో కనిపించిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో సన్నీ లియోన్ కారులో నుంచి కిందికి దిగటానికి చాలా ఇబ్బంది పడింది. దీనికి కారణం ఆమె వేసుకున్న టైట్ డ్రెస్ అని స్పష్టంగా తెలుస్తోంది. ఈ వీడియోను సన్నీ లియోన్ స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు.

టయోటా ఫార్చ్యూనర్ కారులోని వెనుక సీటులో సన్నీ లియోన్ ఉండటం చూడవచ్చు. అయితే బయటకు దిగే సమయంలో ఏ మాత్రం వంగకుండా కాళ్ళను చాచి జారుతూ దిగటం చూడవచ్చు. నిజానికి డ్రెస్ డ్యామేజ్ అవుతుందని కాళ్లు వంచలేదని అర్థమవుతోంది. వీడియో షేర్ చేస్తూ.. కారులోకి వెళ్లడం అంట ఈజీ కాదు అని సన్నీ లియోన్ వెల్లడించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.
కస్టపడి కారులో నుంచి కింది దిగిన తరువాత కూడా కొంత ఇబ్బంది పడటం చూడవచ్చు. కారు నుంచి దిగిన తరువాత డ్రెస్ కొంచెం పైకెత్తి పట్టుకుంటుంది. డ్రెస్ కారణంగా వంగటానికి కొంచెం ఇబ్బందిగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఈ వీడియో చూస్తే సెలబ్రిటీలు అందంగా కనిపించాలంటే ఎన్ని అవాంతరాలను ఎదుర్కోవాలో స్పష్టంగా అర్థమైపోతోంది. కారులోకి వెళ్ళడానికి కూడా తానూ ఎంత ఇబ్బంది పడ్డారో ఆమె రీల్ వీడియో చూస్తే అర్థమవుతుంది.

కారులోకి వెళ్ళేటప్పుడు ఒక సహాయకుడు కారులోకి లాగాల్సి వచ్చింది. ఆ తరువాత వీడియో రికార్డ్ చేస్తున్న వ్యక్తిని కారు డోర్ క్లోజ్ చేయమని చెబుతుంది. మొత్తం మీద సన్నీ లియోన్ కారులోకి వెళ్ళడానికి, బయటకు రావడానికి ఎంత ఇబ్బంది పడ్డారో ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటర్నెట్‌లో ఇలాంటి వీడియో చూడడం బహుశా ఇదే మొదటిసారి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ కూడా చేస్తున్నారు.
ముంబైలో వర్షాల వల్ల తానూ ఇప్పటికే రెండు మూడు కార్లను పోగొట్టుకున్నట్లు ఓ ఇంటర్యూలో వెల్లడించినట్లు సమాచారం. కాగా ఈమె గతంలో ఎంజీ మోటార్స్ యొక్క గ్లోస్టర్ కారును కొనుగోలు చేశారు. దీనిని సన్నీ లియోన్ ఇండియన్ ట్రక్ అని పిలుస్తుంది. అయితే ఈమె పోగొట్టుకున్న కార్ల గురించి వెల్లడించలేదు. బహుశా అందులో బీఎండబ్ల్యూ 7 సిరీస్ ఒకటి ఉండొచ్చని పలువురు చెబుతున్నారు.
నటి సన్నీ లియోన్ ఉపయోగించే కార్ల జాబితాలో ఎంజీ గ్లోస్టర్ మాత్రమే కాకుండా.. ఆడి ఏ6, మసెరటి గిబ్లీ, మసెరటి క్వాట్రోపోర్టే, మెర్సిడెస్ బెంజ్ జీఎల్350డీ మొదలైనవి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే సన్నీ లియోన్‌కు కార్ల మీద ఎంత ఆసక్తి ఉందో తెలుస్తోంది. మొత్తం మీద ఖరీదైన కార్లను ఉపయోగించే సెలబ్రిటీల జాబితాలో సన్నీ లియోన్ కూడా ఒకరని స్పష్టంగా అర్థమవుతోంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








