సీరియల్స్ చేస్తూ లక్షల ఖరీదైన కారు కొనేసింది!.. ఎవరో తెలుసా?

ఇటీవల కాలంలో సినీ ప్రముఖులు మాత్రమే కాకుండా.. బుల్లి తెర నటులు కూడా ఖరీదైన కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ కన్నడ సీరియల్ నటి 'సుష్మారావు' హ్యుందాయ్ కంపెనీకి చెందిన పాపులర్ కారు 'క్రెటా' (Hyundai Creta) ను కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈమె కొన్న కారు ధర ఎంత? దీని ఫీచర్స్ ఏంటి? గతంలో ఈమె ఏమైనా కార్లను కొనుగోలు చేశారా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.. రండి.

ఎస్ నారాయణ్ దర్శకత్వం వహించిన భాగీరధి సీరియల్‌లో 'వీణ' పాత్ర ద్వారా బుల్లితెర అరంగేట్రం చేసిన ఈమె ఇప్పుడు భాగ్యలక్ష్మి అనే సీరియల్ చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఈమె పుట్టిన రోజును భాగ్యలక్ష్మి సెట్‌లో జరుపుకున్నారు. స్నేహితులు, అభిమానులు ఈమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో వంటివి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

Actress Sushma Rao Buys Hyundai Creta

ఇక నటి సుష్మా రావు కొనుగోలు చేసిన కొత్త హ్యుందాయ్ క్రెటా విషయానికి వస్తే.. ఈమె వేరియంట్ కొనుగోలు చేసిందనే విషయం స్పష్టంగా తెలియడం లేదు. మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ఈ, ఈఎక్స్, ఎస్, ఎస్ (ఓ), ఎస్ఎక్స్, ఎస్ఎక్స్ టెక్ మరియు ఎస్ఎక్స్ (ఓ) అనే ఏడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఇవన్నీ చూడటానికి ఒకే మాదిరిగా ఉంటాయి.

దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా ధరలు రూ. 11 లక్షల నుంచి రూ. 20.15 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ క్రెటా 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్లను పొందుతుంది . ఇవి 6 సోది మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమాటిక్, సీవీటీ మరియు 7 స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్‌లను పొందుతుంది.

Actress Sushma Rao Buys Hyundai Creta

ఆధునిక డిజైన్ కలిగిన హ్యుందాయ్ క్రెటా కారు అట్లాస్ వైట్, అబిస్ బ్లాక్, టైటాన్ గ్రే, రేంజర్ ఖాకీ వంటి వివిధ రంగులలో అందుబాటులో ఉంది. ఇందులో సులభంగా ఐదు మంది వ్యక్తులు ప్రయాణించవచ్చు. ఈ కారులోని బూట్ స్పేస్ 433 లీటర్లు వరకు ఉంటుంది. కాబట్టి సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి అనుమతిస్తుంది. ఈ కారు అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుంది.

సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరికి ఇష్టమైన హ్యుందాయ్ క్రెటా యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది 10.25 ఇంచెస్ డ్యూయల్ డిస్‌ప్లే (ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), డ్యూయల్ జోన్ ఏసీ, 8 స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఆధునిక డిజైన్ మరియు అధునాతన ఫీచర్స్ కలిగిన హ్యుందాయ్ క్రెటాలో అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ మొదలైనవన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Thursday, July 11, 2024, 15:58 [IST]
English summary
Famous actress sushma rao buys hyundai creta car details
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+