ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!

చాలామంది బైక్ రైడర్స్ సుదూర ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్ వెళ్లడానికి చాలా ఇష్టపడతారు. ఈ సందర్భాలలో రైడర్స్ దేశాలు మరియు ఖండాలు కూడా దాటిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఈ లాంగ్ డ్రైవ్స్ సాహసోపేతం మాత్రమే కాదు ప్రమాదం కూడా, ఒక్కొక్కసారి ఈ లాంగ్ డ్రైవ్స్ ప్రాణాంతకం కూడా. ఈ విధంగా లాంగ్ డ్రైవ్స్ చేసే బెంగళూరుకు చెందిన శ్రీనివాసన్ ఇటీవల ప్రమాదంలో మరణించారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..

ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎలా అనుకుంటున్నారా

బెంగళూరుకి చెందిన ప్రసిద్ధ బైక్ రైడర్ కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు శ్రీనివాసన్ బైక్‌ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.

ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎలా అనుకుంటున్నారా

కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ స్నేహితులతో బైక్ ట్రిప్ వెళ్ళాడు. జైసల్మేర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, శ్రీనివాసన్ ముందు వెళ్తుండగా, అతని మిగిలిన స్నేహితులు వెనుక వస్తున్నారు. అకస్మాత్తుగా తన బైక్ కి ఒంటె అడ్డు రావడంతో కింద పడిపోయారు. శ్రీనివాసన్ కిందపడటం వల్ల తలకు బలమైన గాయాలు అవ్వడంతో, వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.

MOST READ:కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు

ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎలా అనుకుంటున్నారా

శ్రీనివాసన్ తలకు దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన మరణించినట్లు రాజస్థాన్ పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు. శ్రీనివాసన్ పార్థివ మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత రాజస్థాన్ పోలీసుల కుటుంబ సభ్యులకు అప్పగించారు.

ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎలా అనుకుంటున్నారా

రిచర్డ్ శ్రీనివాస్‌తో కలిసి బెంగళూరుకు చెందిన డాక్టర్ నారాయణ విజయ్, వేణుగోపాల్ ఈ లాంగ్ డ్రైవ్ లో పాల్గొన్నారు. వారి పర్యటన జనవరి 23 న బెంగళూరులో ముగియనున్నట్లు ఆయన తెలిపారు. కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ గతంలో బెంగళూరు నుండి ట్రయంఫ్ టైగర్ బైక్ మీద ప్రయాణించి ఆసియా, యూరప్, అమెరికా మరియు ఆస్టెలియా ఖండాల చుట్టూ పర్యటించారు.

MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎలా అనుకుంటున్నారా

రిచర్డ్ శ్రీనివాస్ ఇటీవలే రైడ్ కోసం లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ జిఎస్ బైక్‌ను కూడా కొనుగోలు చేశాడు. ఎందుకంటే అతను ఈ రైడింగ్ ముగించిన తరువాత ఆఫ్రికాకు బైక్ యాత్ర చేయాలని కూడా అనుకున్నాడు.

ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎలా అనుకుంటున్నారా

ట్రయంఫ్ టైగర్ 800 బైక్ 800 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 93.7 బిహెచ్‌పి శక్తిని, 8,050 ఆర్‌పిఎమ్ వద్ద 79 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులు లాంగ్ డ్రైవ్ లో వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎలా అనుకుంటున్నారా

బైక్ రైడర్ రిచర్డ్ శ్రీనివాస్ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకర్లలో ఒకరు. అత్యంత కష్టతరమైన రహదారులలో ప్రయాణించి దేశాలను శాతం చుట్టి వచ్చిన గొప్ప బైక్ రైడర్ కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ ఇప్పుడు బైక్ ప్రమాదంలో మరణించడం నిజంగా ఒక విషాదకరం.

Image Courtesy: King Richard/Instagram

Most Read Articles

English summary
Famous Bengaluru Biker Dies After Crashing Into Camel. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X