Just In
- 12 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 15 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 16 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
రఘురామ మళ్లీ కౌంటర్.. సీఎం జగన్ కూడా భాగస్వాములే.. హాట్ కామెంట్స్..
- Movies
చరిత్ర సృష్టించిన సుడిగాలి సుధీర్: వాళ్లందరిపై ఆధిపత్యం చూపిస్తూ.. ఊహించని రికార్డు సొంతం
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒంటె వల్ల మరణించిన ప్రముఖ బైక్ రైడర్.. ఎవరో తెలుసా!
చాలామంది బైక్ రైడర్స్ సుదూర ప్రాంతాలకు లాంగ్ డ్రైవ్ వెళ్లడానికి చాలా ఇష్టపడతారు. ఈ సందర్భాలలో రైడర్స్ దేశాలు మరియు ఖండాలు కూడా దాటిన సందర్బాలు చాలా ఉన్నాయి. ఈ లాంగ్ డ్రైవ్స్ సాహసోపేతం మాత్రమే కాదు ప్రమాదం కూడా, ఒక్కొక్కసారి ఈ లాంగ్ డ్రైవ్స్ ప్రాణాంతకం కూడా. ఈ విధంగా లాంగ్ డ్రైవ్స్ చేసే బెంగళూరుకు చెందిన శ్రీనివాసన్ ఇటీవల ప్రమాదంలో మరణించారు. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూద్దాం..

బెంగళూరుకి చెందిన ప్రసిద్ధ బైక్ రైడర్ కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ బుధవారం రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు శ్రీనివాసన్ బైక్ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.

కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ స్నేహితులతో బైక్ ట్రిప్ వెళ్ళాడు. జైసల్మేర్‌లో ప్రయాణిస్తున్నప్పుడు, శ్రీనివాసన్ ముందు వెళ్తుండగా, అతని మిగిలిన స్నేహితులు వెనుక వస్తున్నారు. అకస్మాత్తుగా తన బైక్ కి ఒంటె అడ్డు రావడంతో కింద పడిపోయారు. శ్రీనివాసన్ కిందపడటం వల్ల తలకు బలమైన గాయాలు అవ్వడంతో, వెంటనే అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.
MOST READ:కొత్త ఆడి ఎ4 ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. పూర్తి వివరాలు

శ్రీనివాసన్ తలకు దెబ్బతగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన మరణించినట్లు రాజస్థాన్ పోలీసు అధికారులు మీడియాకు తెలియజేశారు. శ్రీనివాసన్ పార్థివ మృతదేహాన్ని పోస్టుమార్టం తర్వాత రాజస్థాన్ పోలీసుల కుటుంబ సభ్యులకు అప్పగించారు.

రిచర్డ్ శ్రీనివాస్‌తో కలిసి బెంగళూరుకు చెందిన డాక్టర్ నారాయణ విజయ్, వేణుగోపాల్ ఈ లాంగ్ డ్రైవ్ లో పాల్గొన్నారు. వారి పర్యటన జనవరి 23 న బెంగళూరులో ముగియనున్నట్లు ఆయన తెలిపారు. కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ గతంలో బెంగళూరు నుండి ట్రయంఫ్ టైగర్ బైక్ మీద ప్రయాణించి ఆసియా, యూరప్, అమెరికా మరియు ఆస్టెలియా ఖండాల చుట్టూ పర్యటించారు.
MOST READ:బైక్ రైడర్‌కి రూ. 1 లక్షకు పైగా జరిమానా.. కారణం మాత్రం ఇదే

రిచర్డ్ శ్రీనివాస్ ఇటీవలే రైడ్ కోసం లగ్జరీ బిఎమ్‌డబ్ల్యూ జిఎస్ బైక్‌ను కూడా కొనుగోలు చేశాడు. ఎందుకంటే అతను ఈ రైడింగ్ ముగించిన తరువాత ఆఫ్రికాకు బైక్ యాత్ర చేయాలని కూడా అనుకున్నాడు.

ట్రయంఫ్ టైగర్ 800 బైక్ 800 సిసి, లిక్విడ్-కూల్డ్ ఇంజన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 9,500 ఆర్‌పిఎమ్ వద్ద 93.7 బిహెచ్పి శక్తిని, 8,050 ఆర్‌పిఎమ్ వద్ద 79 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ బైకులు లాంగ్ డ్రైవ్ లో వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.
MOST READ:షూటింగ్ స్పాట్‌కి 12 కి.మీ సైకిల్‌పై వెళ్లిన రకుల్ ప్రీత్ సింగ్.. ఎందుకో మరి

బైక్ రైడర్ రిచర్డ్ శ్రీనివాస్ భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బైకర్లలో ఒకరు. అత్యంత కష్టతరమైన రహదారులలో ప్రయాణించి దేశాలను శాతం చుట్టి వచ్చిన గొప్ప బైక్ రైడర్ కింగ్ రిచర్డ్ శ్రీనివాసన్ ఇప్పుడు బైక్ ప్రమాదంలో మరణించడం నిజంగా ఒక విషాదకరం.
Image Courtesy: King Richard/Instagram