బాబీ డియోల్ కొత్త కారు.. బాలీవుడ్ స్టార్ అంటే ఆ మాత్రం ఉంటది (వీడియో)
సినీ తారలు, ఇతర ప్రముఖులు ఎప్పటికప్పుడు కొత్త వాహనాలు కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. మార్కెట్లో అందుబాటులో ఉన్న తమకు నచ్చిన కార్లను, బైకులను కొనుగోలు చేస్తూ వినియోగిస్తూ ఉంటారు. పలువురు సెలబ్రిటీలు గతంలో కూడా చాలామంది ఖరీదైన కార్లను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో బాలీవుడ్ యాక్టర్ రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ కారు గురించి, ఈ కారును కొనుగోలు చేసిన సెలబ్రిటీ గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రముఖ బాలీవుడ్ నటుడు 'బాబీ డియోల్' (Bobby Deol) ఇటీవల ఖరీదైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు. ఇది ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ ఆటో బయోగ్రఫీ అనే తెలుస్తోంది. వీడియోలో గమనిస్తే.. ఖరీదైన కారులో బాబీ డియోల్ విమానాశ్రయానికి రావడం చూడవచ్చు. ఇది తెలుపు రంగులో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటం చూడవచ్చు.

ల్యాండ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ ఆటో బయోగ్రఫీ దేశీయ విఫణిలో అత్యంత ప్రజాదరణ పొందిన పాపులర్ మోడల్. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఈ కారును కలిగి ఉన్నారు. బాబీ డియోల్ కొనుగోలు చేసిన ఈ కారు ధర రూ.3.06 కోట్లు అని వీడియోలో వెల్లడించారు. అయితే దీని ఎక్స్-షోరూమ్ ధర తక్కువగా ఉంటుంది. ఆన్ రోడ్ ధర మారుతూ ఉంటుంది. ఈ కారణంగా దీని ధర మూడు కోట్ల కంటే ఎక్కువ.
అన్ని రేంజ్ రోవర్ల మాదిరిగానే.. ఈ వేరియంట్ మంచి డిజైన్ మరియు విలాసవంతమైన ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఫ్లోటింగ్ కర్వ్డ్ 13.1 ఇంచెస్ టచ్ డిస్‌ప్లే, 13.7 ఇంచెస్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, హెడ్స్ అప్ డిస్‌ప్లే, ఫోర్ జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు 35 స్పీకర్లతో మెరిడియన్ సిగ్నేచర్ సౌండ్ సిస్టం వంటివి ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు అత్యుత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఈ కారు డీజిల్ మరియు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇందులోని 3.0 లీటర్ ఇన్‌లైన్ 6 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ 394 Bhp పవర్ మరియు 550 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. బాబీ డియోల్ ఈ వేరియంట్ ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి నాలుగు చక్రాలకు పవర్ డెలివరీ చేస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 2.60 కోట్లు.
ఇదిలా ఉండగా రేంజ్ రోవర్ కంపెనీ ఇటీవలే దేశీయ విఫణిలో తమ మోడళ్ల అసెంబ్లీని ప్రారంభించింది. కాబట్టి త్వరలో ఈ బ్రాండ్ కార్ల ధరలు గణనీయంగా తగ్గుతాయి. నిజానికి రేంజ్ రోవర్ పెట్రోల్ ఎల్‌డబ్ల్యుబి ఆటోబయోగ్రఫీ వేరియంట్ ధర ప్రారంభంలో రూ.3.16 కోట్లు. అయితే అసెంబ్లింగ్ భారతదేశంలో ప్రారంభమవ్వడం వల్ల దీని ధర రూ. 56 లక్షలు తగ్గింది. దీంతో దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.2.60 కోట్లు (ఎక్స్-షోరూమ్).
నటుడు బాబీ డియోల్ కేవలం రేంజ్ రోవర్ కారును మాత్రమే కాకుండా.. పోర్స్చే 911 కారెరా, పోర్స్చే కయెన్, పాత తరం రేంజ్ రోవర్ వోగ్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్, డబ్ల్యు221 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్, ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ వంటి కార్లను కూడా కలిగి ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే 'బాబీ డియోల్'కి కార్ల మీద ఎంత మక్కువ ఉందొ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు తాజాగా మరో ల్యాండ్ రోవర్ కారు ఈయన గ్యారేజిలో చేరింది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








