జగ్గు దాదా మనసుదోచిన యమహా బైక్ ఇదే - తరాలు మారినా.. అస్సలు తగ్గని ఆసక్తి
సాధారణంగా సెలబ్రిటీలకు బైకులు, కార్ల మీద మక్కువ ఎక్కువని అందరికి తెలుసు. ఇందులో భాగంగానే వారు ఎప్పటికప్పుడు కొత్త బైకులు కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల బాలీవుడ్ స్టార్ 'జాకీ ష్రాఫ్' ఓ పాతకాలపు 'యమహా' (Yamaha) బైకుపై దర్శనమిచ్చారు.
నిజానికి సినీ తారలందరూ కొత్త బైకులపై కనిపిస్తుంటే.. జాకీ ష్రాఫ్ మాత్రం ఎందుకు ఈ పాతకాలపు బైకుపై ఉన్నారని కొంతమందికి డౌట్ రావొచ్చు. కానీ ఫొటోలో కనిపించే బైక్ అప్పటికి.. ఇప్పటికీ.. ఎప్పటికీ వాహన ప్రియుల మనసు దోచే యమహా కంపెనీ యొక్క 'రాజ్‌దూత్' (ఆర్‌డి350) అని మరచిపోకండి. ఇప్పటికి కూడా ఈ బైక్ అక్కడక్కడా రోడ్ల మీద కనిపిస్తూనే ఉంటుంది.

జాకీ ష్రాఫ్ గ్యారేజిలో ఖరీదైన అన్యదేశ్య కార్లు మరియు బైకులు ఎన్ని ఉన్నప్పటికీ ఈ యమహా RD350 బైకుకి మాత్రం ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది. 1973లో మార్కెట్లో అడుగుపెట్టిన ఈ బైకును ఆర్‌డి350 లేదా 'యమహాషా' అని పిలిచేవారు. ఇది దేశీయ విఫణిలో అడుగుపెట్టినప్పటి నుంచి ఎంతోమంది బైక్ ప్రేమికులను ఆకర్శించడంలో విజయం పొందింది. దీంతో విపరీతమైన అమ్మకాలు కూడా పొందగలిగింది.
యమహా RD350 బైక్ 347 సీసీ ఇంజిన్ కలిగి 35 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తూ.. అద్భుతమైన పనితీరుని అందించేది. ఈ కారణంగానే ఈ బైక్ అధిక ప్రజాదరణ పొంది ఎక్కువ మందిని ఆకర్శించింది. యమహా ఆర్‌డి350 బైకుని ఇష్టపడ్డ సెలబ్రిటీల్లో జాకీ ష్రాఫ్ కూడా ఒకరు. దీంతో ఈయన కూడా ఈ యమహా బైక్ కొనుగోలు చేసారు. తాజాగా ఆ బైకుపై కనిపించారు.
ఖరీదైన కార్లలో కనిపించాల్సిన ష్రాఫ్ ఈ పాతకాలపు యమహా బైకుపై కనిపించారంటే.. దాని మీద ఆయకున్న మక్కువ ఎలాంటిదో అర్థమైపోతుంది. వైరల్ అవుతున్న ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు బ్లాక్ అండ్ రెడ్ రెండు విధాలుగా ఉండటం చూడవచ్చు. అంటే ఈ బైక్ పాతకాలంలో మాత్రమే కాదు ఇప్పటికి కూడా అనుకూలంగా ఉందని చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ బైకు మీద జాకీ ష్రాఫ్ ఆటోగ్రాఫ్ కూడా కనిపిస్తోంది.
ఎన్ని ఖరీదైన బైకులున్నా.. జాకీ ష్రాఫ్ మాత్రం ఎక్కువగా ఉపయోగించే బైకు ఈ యమహా RD350 అని తెలుస్తోంది. ష్రాఫ్ కేవలం బైకులను ఇష్టపడే వ్యక్తి మాత్రమే కాదు మంచి రైడర్ కూడా. ఈయన వద్ద రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield) కంపెనీకి చెందిన కాంటినెంటల్ జీటీ 650 కూడా ఉంది. అప్పుడప్పుడు ఈయన ఆ బైకు మీద కూడా కనిపిస్తూ ఉంటారు.
జాకీ ష్రాఫ్ గ్యారేజిలో కేవలం బైకులు మాత్రమే కాకుండా ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. ఇందులో చెప్పుకోదగ్గది 1939 నాటి జాగ్వార్ ఎస్ఎస్100. ఇది ఒక వింటేజ్ కారు. దీంతో పాటు బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఎమ్5, బెంట్లీ కంపెనీకి చెందిన కాంటినెంటల్ జీటీ, టయోటా యొక్క ఫార్చ్యునర్, టయోటా ఇన్నోవా మొదలైన కార్లు ఈయన గ్యారేజిలో ఉన్నట్లు తెలుస్తోంది.
సెలబ్రిటీలు, క్రికెటర్లు, ఇతర పారిశ్రామిక వేత్తలు ఖరీదైన కార్లను మాత్రమే కాకుండా పాతకాలపు కార్లను కలిగి ఉంటారు. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని గ్యారేజిలో పాతకాలపు వింటేజ్ కార్లు, పాతకాలపు బైకులు చాలానే ఉన్నాయి. వాహనాల మీద వారికి ఉన్న ఆసక్తే.. ఎక్కువ బైకులు మరియు కార్లను సేకరించేలా చేస్తుంది. వీరందరూ అప్పుడప్పుడు తమకు నచ్చిన బైకులు లేదా కార్ల మీద రోడ్ల మీదకు వస్తూ ఉంటారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








