ఖరీదైన బైకులన్నీ ఒకే చోట!.. జాన్ అబ్రహం అక్కడ.. తగ్గేదేలే..
సాధారణ ప్రజలకంటే సెలబ్రిటీలకు బైకులు,కార్ల మీద ఎక్కువ మక్కువ ఉంటుందని అందరికి తెలుసు. ఇందులో భాగంగానే వారు ఎప్పటికప్పుడు తమ గ్యారేజిలో ఖరీదైన వాహనాలను యాడ్ చేస్తుంటారు. ఈ కథనంలో బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం గ్యారేజిలోని బైకుల గురించి తెలుసుకుందాం.
సుజుకి హయబుసా
భారతదేశంలో అత్యంత ఖరీదైన బైకులతో ఒకటైన సుజుకి కంపెనీకి చెందిన హయబుసా జాన్ అబ్రహం గ్యారేజిలో ఉంది. ఈ బైక్ ధర రూ. 16.41 లక్షలు కావడం విశేషం. ఈ బైక్ చూడటానికి మంచి డిజైన్ కలిగి అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ బైకులో 1340 సీసీ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 190 పీఎస్ పవర్, 150 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

యమహా వీ-మ్యాక్స్ 60వ యానివెర్సరీ
యమహా కంపెనీకి చెందిన 60వ యానివెర్సరీ ఎడిషన్ వీ-మ్యాక్స్ కూడా జాన్ అబ్రహం గ్యారేజిలో ఉంది. ఇది జాన్ అబ్రహంకు ఇష్టమైన బైక్. పసుపు, నలుపు రంగులలో కనిపించే ఈ బైక్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ 1.7 లీటర్ వీ4 ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 200 పీఎస్ పవర్ మరియు 169 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది.
కవాసకి జెడ్ఎక్స్-14ఆర్
దేశీయ మార్కెట్లో అధిక ప్రజాదరణ పొందిన కవాసకి బ్రాండ్ యొక్క జెడ్ఎక్స్-14ఆర్ బైక్ కూడా జాన్ అబ్రహం గ్యారేజిలో ఉంది. బ్లాక్ కలర్ పొందిన ఈ బైకును రైడ్ చేయడం తనకు చాలా ఇష్టమని జాన్ వెల్లడించారు. ఈ బైక్ 1441 సీసీ 4 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. డిజైన్ మాత్రమే కాకుండా ఇది అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుందని జాన్ పేర్కొన్నారు.

హోండా సీబీఆర్ 1000ఆర్ఆర్
హోండా మోటార్‌సైకిల్ కంపెనీకి చెందిన 'సీబీఆర్ 1000ఆర్ఆర్' బైకు కూడా జాన్ గ్యారేజిలో ఉంది. దీనిని ఫైర్‌బ్లేడ్ అని పిలుస్తారు. ఈ బైక్ 999 సీసీ ఇన్ లైన్ ఫోర్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ 16 వాల్వ్ డీఓహెచ్సీ ఇంజిన్ పొందుతుంది. ఈ ఇంజిన్ 14500 rpm వద్ద 215 bhp పవర్ మరియు 12500 rpm వద్ద 113 టార్క్ అందిస్తుంది.
ఎప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 ఆర్ఎఫ్
జాన్ అబ్రహం గ్యారేజిలోని బైకులలో ఒకటి 'ఎప్రిలియా ఆర్‌ఎస్‌వీ4 ఆర్ఎఫ్'. ఇది ఇటాలియన్ మోటార్‌సైకిల్. ప్రత్యేకమైన రెవ్ సౌండ్ కలిగిన ఈ బైకుని రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది 1078 సీసీ 4 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. మంచి డిజైన్ కలిగిన ఈ బైకు భారతదేశంలో ఎక్కువమంది బైక్ ప్రేమికులను ఆకర్శించడంలో విజయం పొందింది.
యమహా వైజెడ్ఎఫ్-ఆర్1
2006లో జాన్ అబ్రహం యమహా బ్రాండ్ అంబాసిడర్‌గా సైన్ చేసిన తరువాత.. అతనికి కంపెనీ ఈ 'వైజెడ్ఎఫ్-ఆర్1' బైక్ గిఫ్ట్‌గా లభించింది. జాన్ అబ్రహంకు ఇష్టమైన బైకులతో ఇదొకటి. దీనికి బ్లాక్ రావెన్ అని పేరు పెట్టుకున్నారు. అయితే ఈ బైకుని 2008లో మన్సుఖానీకి గిఫ్ట్‌గా ఇచ్చేసారు. ఇది 998 సీసీ ఫోర్ సిలిండర్ ఇంజిన్ కలిగి 200 పీఎస్ పవర్ మరియు 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.
డుకాటీ పానిగేల్ వీ4
ఎప్రిలియా తరువాత తన రెడ్ కలర్ డుకాటీ పానిగేల్ వీ4 బైకుని జాన్ చూపించారు. ఈ బైక్ గ్లోబల్ మార్కెట్లో అత్యంత ఆదరణ పొందింది. చూడగానే ఆకర్శించబడే ఈ ఇటాలియన్ బైక్ 998 సీసీ ఫోర్ సిలిండర్ పొందుతుంది. ఇది 221 పీఎస్ పవర్ మరియు 112 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఈ బైక్ చాలా అద్భుతంగా ఉంటుంది.

జాన్ అబ్రహం గ్యారేజిలో ఇతర బైకులు, కార్లు
జాన్ అబ్రహం గ్యారేజిలో ఉన్న ఇతర బైకులలో ఎమ్‌వి అగస్టా ఎఫ్3 800, కెటిఎమ్, సుజుకి జీఎస్ఎక్స్-ఆర్100, డుకాటీ డయావెల్, కవాసకి జెడ్ఎక్స్11-డీ12 ఉన్నాయి. కార్ల విషయానికి వస్తే.. జాన్ గ్యారేజిలో లంబోర్ఘిని గల్లార్డో, నిస్సాన్ జీటీ-ఆర్ బ్లాక్ ఎడిషన్, ఆడి క్యూఆర్, ఇసుజు డీ-మాక్స్ వీ-క్రాస్ మరియు మారుతి సుజుకి వంటి అనేక ఇతర కార్లు ఉన్నాయి.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








