లక్షల ఖరీదైన కారు కొన్న ఫేమస్ చైల్డ్ ఆర్టిస్ట్ - ఫోటోలు చూడండి
మలయాళీ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటించిన మల్లికాపురం మూవీ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో అందరికీ తెలుసు. ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా అందరిని మెప్పించిన దేవానంద గురించి కూడా ప్రత్యేకంగా పరిచయమే అవసరం లేదు. చిన్న వయసులోనే ఎంతోమందిని ఆకట్టుకున్న ఈ చిన్నది బాలనటిగా పలు సినిమాల్లో నటించింది. ఈ బాల నటి ఇటీవల ఓ ఖరీదైన కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దేవానంద కొనుగోలు చేసిన కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
బాలనటి దేవానంద కొనుగోలు చేసిన కారు టయోటా కంపెనీకి చెందిన ఇన్నోవా హైక్రాస్. దీనిని ఈ అమ్మాయి పుట్టిన రోజు సందర్భంగా కొనుగోలు చేసినట్లు సమాచారం. కారు కొనుగోలు చేసిన తరువాత, దీనికి డెలివరీలకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతలో షేర్ చేశారు. ఇందులో కారును డెలివరీ చేసుకోవడం వంటివి చూడవచ్చు. పలువురు అభిమానులు ఈమెకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

దేవానంద కొనుగోలు చేసిన టయోటా ఇన్నోవా హైక్రాస్ అనేది టాప్ ఎండ్ హైబ్రిడ్ మోడల్ అని తెలుస్తోంది. ఇది 7 సీటర్ మరియు 8 సీటర్ ఎంపికలలో అందుబాటులో ఉంది. మంచి డిజైన్ కలిగిన ఈ కారు సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, సిల్వర్ మెటాలిక్ వంటి మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇవన్నీ వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయు.
టయోటా ఇన్నోవా హైక్రాస్ 2.0 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0 లీటర్ 4 సిలిండర్ హైబ్రిడ్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. 2.0 లీ పెట్రోల్ ఇంజిన్ 172 Bhp పవర్ మరియు 205 Nm టార్క్ అందిస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. హైబ్రిడ్ ఇంజిన్ కూడా ఉత్తమ పనితీరును అందిస్తుంది.

హైక్రాస్ కారు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ మొబైల్ ఛార్జర్, సన్‌రూఫ్ మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, 360 డిగ్రీ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ (ఏడీఏఎస్) టెక్నాలజీ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల రక్షణకు పెద్ద పీట వేస్తాయి.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను గమనిస్తే.. చైల్డ్ ఆర్టిస్ట్ దేవానంద షోరూంలో కారును డెలివరీ చేసుకోవడం చూడవచ్చు. ఈమెతో పాటు ఈమె తల్లిదండ్రులు కూడా ఉన్నారు. షోరూమ్ సిబ్బంది వారికి కారు కీ (తాళం) అందించడం చూడవచ్చు. చిన్న వయసులోనే ఖరీదైన కారు కొనుగోలు చేసిన దేవానందను పలువురు అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇంకా గొప్ప స్థాయికి చేరాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








