Electric Cars దేశంలోని ప్రముఖులకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు.. ధోని, మహేశ్ బాబు కార్లు ఇవే..!
భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని కంపెనీలు అందుబాటు ధరలో ఎలక్ట్రిక్ వాహనాలను అందిస్తున్నాయి. వీటిలో టాటా కంపెనీ నుంచి తక్కువ ధరలో కార్లు మార్కెట్ లో లభిస్తున్నాయి. అలానే మెర్సిడెస్ వంటి ఖరీదైన కార్ల తయారీదారులు కూడా మార్కెట్లో తమ వెర్షన్లను విడుదల చేశాయి.
ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా డిమాండ్ పెరుగుతుంది. దీంతో ఎలక్ట్రిక్ కార్లను కొందరు ప్రముఖులు కూడా కొనుగోలు చేశారు. తమ గ్యారేజీలో ఇవి కొత్తగా చేరాయి. వీటిలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అనేక మంది ప్రముఖ భారతీయులు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉన్నారు. వారిలో కొంతమంది జాబితా మీకోసం..

భారత క్రికెట్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇటీవల కొరియా కార్ల తయారీ సంస్థ కియా ప్లగ్‌షిప్ ఎలక్ట్రిక్ వాహనాన్ని భారతదేశంలో కొనుగోలు చేశాడు. కియా ఈవీ6 కొన్ని నెలల క్రితం మార్కెట్లోకి రూ.59.95 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో విడుదలైంది. ఈవీ 6 సీబీయూగా అందించబడుతుంది. ఇది ధోని తన గ్యారేజీలో మొదటి ఎలక్ట్రిక్ కారుగా నిలిచింది. ధోని గ్యారేజీలో అనేక క్లాసిక్ కార్లు, మోటార్ సైకిళ్లను కలిగి ఉన్నారు.
భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి ఇటీవల కొత్త బీఎండబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీతో కనిపించారు. బీఎండబ్ల్యూ ఏడాది క్రితం ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవని ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.1.16 కోట్ల వద్ద భారతదేశంలో విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 425 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని కలిగి ఉంది. ఈ కారును గడ్కరీకి బీఎండబ్ల్యూ ఇండియా అందించింది.

ప్రముఖ బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ అతని భార్య ఈ సంవత్సరం తమ కార్ల సేకరణలో రెడ్ బిఎమ్ డబ్ల్యూ ఐఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని కొనుగోలు చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న టెస్లా మోడల్ ఎక్స్ కారును రితేష్ కు ఆయన భార్య జెనీలియా బహుమతిగా ఇచ్చారు.
భారతీయ నటి, మాజీ మిస్ ఇండియా పసిఫిక్ పూజా బాత్రా ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్నారు. టెస్లా నుంచి ఎంట్రీ లెవల్ సెడాన్ అయిన టెస్లా మోడల్ 3 సెడాన్ ను ఆమె కలిగి ఉన్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టెస్లా భారతదేశంలో లాంఛ్ చేయాలని ప్లాన్ చేసిన మోడల్ ఇదే కావడం విశేషం.
ఈ సంవత్సరం ప్రారంభంలో, ప్రఖ్యాత నటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్ నేనే తమ మొదటి ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ ఈవీ డార్క్ ఎడిషన్ కొనుగోలు చేశారు. ఇది ప్రస్తుతం దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది. 2020లో టాటా సన్స్, టాటా మోటార్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కూడా తన నెక్సాన్ ఈవీని కలిగి ఉన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల తన మొదటి ఎలక్ట్రిక్ ఎస్ యూవీ ఆడి ఇ-ట్రాన్ ను కొనుగోలు చేశారు. సరికొత్త వాహనంతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో ఆయన షేర్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ 402bhp వద్ద 664 nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 484 కిలోమీటర్ల రేంజ్ ని కలిగి ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.1.18 కోట్లుగా ఉంది.
మలయాళంలో ప్రముఖ నటి మంజు వారియర్ ఈ ఏడాది ప్రారంభంలో కస్టమైజ్డ్ మినీ కూపర్ ఎస్ఈ ఎలక్ట్రిక్ హ్యచ్ బ్యాక్ ని కొనుగోలు చేశారు. ఇది ఫిబ్రవరిలో భారత మార్కెట్లో విడుదలైంది. సీబీయూగా విక్రయిస్తున్న ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ.47.20 లక్షలుగా ఉంది.


Click it and Unblock the Notifications








