టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయ ప్రముఖులు: రితేష్‌ దేశ్‌ముఖ్‌ నుంచి ముఖేష్ అంబానీ వరకు..

టెస్లా కార్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. ఈ కారణంగానే చాలా మంది ప్రముఖులు ఈ కార్లను వినియోగించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. టెస్లా కంపెనీ భారతదేశానికి వచ్చే అవకాశం ఉందని గతంలోనే మనం చెప్పుకున్నాము. అయితే ఈ కంపెనీ మనదేశానికి ఎప్పుడు వస్తుంది అనేది మాత్రం ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది.

ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ టెస్లా కార్లను కలిగి ఉన్న ప్రముఖుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయలు: రితేష్‌ దేశ్‌ముఖ్‌ నుంచి ముఖేష్ అంబానీ వరకు..

రితేష్‌ దేశ్‌ముఖ్‌:

ప్రముఖ బాలీవుడ్ స్టార్ మరియు బాలీవుడ్ నటి జెనీలియా డిసౌజా భర్త 'రితేష్‌ దేశ్‌ముఖ్‌' దాదాపు చాలామందికి తెలుసు. రితేష్‌ దేశ్‌ముఖ్‌ గ్యారేజిలో ఉన్న కార్లలో టెస్లా కంపెనీకి చెందిన 'మోడల్ ఎక్స్' ఒకటి. ఈ కారుని రితేష్‌ దేశ్‌ముఖ్‌ పుట్టిన రోజు సందర్భంగా జెనీలియా గిఫ్ట్ గా ఇచ్చింది.

టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయలు: రితేష్‌ దేశ్‌ముఖ్‌ నుంచి ముఖేష్ అంబానీ వరకు..

టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయ ప్రముఖులలో రితేష్‌ దేశ్‌ముఖ్‌ ఒకరుగా ఉన్నారు. రితేష్‌ దేశ్‌ముఖ్‌ యొక్క టెస్లా మోడల్ ఎక్స్ రెడ్ కలర్ లో చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇది భారతదేశంలో లేదని సమాచారం. ఇది లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ కలిగి ఉంది. అంటే ఇది ఖచ్చితంగా విదేశాల్లో వినియోగించడానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే భారతదేశంలో ఉపయోగించే దాదాపు అన్ని కార్లు రైట్ హ్యాండ్ డ్రైవ్ కాన్ఫిగరేషన్ లో ఉంటాయి.

టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయలు: రితేష్‌ దేశ్‌ముఖ్‌ నుంచి ముఖేష్ అంబానీ వరకు..

పూజా బాత్రా:

టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయుల జాబితాలో మరొకటి 'పూజా బాత్రా'. పూజా బాత్రా గ్యారేజిలో టెస్లా మోడల్ 3 ఉంది. ఇది టెస్లా కంపెనీ యొక్క లైనప్ లో సరసమైన మరియు అత్యధిక ప్రజాదరణ పొందిన కారు. ఈ కారు ప్రస్తుతం ముంబైలో వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. పూజా బాత్రా వినియోగించే టెస్లా మోడల్ 3 బ్లాక్ కలర్ లో ఉంది.

టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయలు: రితేష్‌ దేశ్‌ముఖ్‌ నుంచి ముఖేష్ అంబానీ వరకు..

ప్రశాంత్ రుయా:

ఎస్సార్ క్యాపిటల్ (Essar Capital) డైరెక్టర్ 'ప్రశాంత్ రుయా' కూడా టెస్లా కారు కలిగి ఉన్న భారతీయులలో ఒకరు. ప్రశాంత్ రుయా వద్ద ఉన్న టెస్లా కారు 'టెస్లా మోడల్ ఎక్స్'. ఇది బ్లూ కలర్ లో చూడటానికి ఆకర్షణీయంగా ఉంది. దీనిని రుయా 2017 లో దిగుమతి చేసుకున్నారు. ఈ కారులో ముంబై రోడ్ల మీద అనేక సార్లు కనిపించినట్లు తెలిసింది.

టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయలు: రితేష్‌ దేశ్‌ముఖ్‌ నుంచి ముఖేష్ అంబానీ వరకు..

ముఖేష్ అంబానీ:

భారతదేశంలో అత్యంత సంపన్నుడు మరియు పేరుమోసిన వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఈ జాబితాలో చెప్పుకోదగ్గ వ్యక్తి. ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఖరీదైన కార్లు లెక్కకు మించి ఉన్నాయి. ఇందులో ఒకటి 'టెస్లా మోడల్ ఎస్'. బ్లూ కలర్ లో కనిపించే ఈ 'టెస్లా మోడల్ ఎస్ 100 డి' ని చాలా రోజులకు ముందే దిగుమతి చేసుకున్నారు.

టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయలు: రితేష్‌ దేశ్‌ముఖ్‌ నుంచి ముఖేష్ అంబానీ వరకు..

టెస్లా మోడల్ ఎస్ 100 డి అనేది కంపెనీ యొక్క హై-పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో ఒకటి. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ 100 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఫుల్ ఛార్జ్ తో 504 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సెడాన్ గంటకు 250 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది 483 బిహెచ్‌పి పవర్ మరియు 660 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది.

టెస్లా కార్లను కలిగి ఉన్న భారతీయలు: రితేష్‌ దేశ్‌ముఖ్‌ నుంచి ముఖేష్ అంబానీ వరకు..

ముఖేష్ అంబానీ గ్యారేజిలో ఉన్న మరో టెస్లా కారు 'మోడల్ ఎక్స్'. ఇది కూడా హై-పెర్ఫార్మెన్స్ వేరియంట్లలో ఒకటి. ఇది పవర్ పుల్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఎక్కువ పరిధిని అందిస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోడల్స్ ఇది ఒకటి. కేవలం పైన తెలిపిన ప్రముఖులు మాత్రమే కాకుండా భారతదేశంలో ఇంకా కొంతమంది టెస్లా కార్లను కలిగి ఉన్నారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల గురించి తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Famous indians who own a tesla details in telugu
Story first published: Sunday, January 22, 2023, 8:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X