ప్రముఖ నటుడి మనసు దోచిన కారు ఇదే!.. దీని వివరాలు ఇక్కడ చూడండి

సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తుంటారని విషయం అందరికి తెలుసు. ఇందులో భాగంగానే ఇటీవ ప్రముఖ మలయాళీ హాస్య నటుడు 'హరీష్ కనరన్' ఓ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.

హరీష్ కనరన్ కొనుగోలు చేసిన కొత్త కారు స్కోడా కంపెనీకి చెందిన స్లావియా అని తెలుస్తోంది. భారతీయ మార్కెట్లో ఈ కారు అతి తక్కువ కాలంలోనే మంచి అమ్మకాలను పొందగలిగింది. కేవలం సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా సెలబ్రిటీలను కూడా ఆకర్శించడంలో ఈ వెహికల్స్ సక్సెస్ సాధిస్తోంది. దీనికి ప్రధాన కారణం మంచి డిజైన్ మరియు అత్యాధునిక ఫీచర్స్ ఇందులో ఉండటమే అని తెలుస్తోంది.

Malayalam Actor Hareesh Kanaran Skoda Slavia

స్కోడా స్లావియా కారును కొనుగోలు చేసిన తరువాత కేరళలోని కంపెనీ డీలర్షిప్ వద్ద డెలివరీ తీసుకుంటారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో హరీష్ కనరన్ మాత్రమే కాకుండా.. అయన భార్య, పిల్లలు కూడా ఉండటం చూడవచ్చు. హరీష్ కనరన్ కొనుగోలు చేసిన కారు ఎరుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉండటం గమనించవచ్చు.

ఇక స్కోడా స్లావియా విషయానికి వస్తే.. ఇది కంపెనీ యొక్క 2.0 ప్రాజెక్ట్ ప్రారంభించబడిన రెండో మోడల్. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందటమే కాకుండా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉండటానికి పారిమాణం రీత్యా కూడా అద్భుతంగా ఉంటుంది. దీని పొడవు 4541 మిమీ, వెడల్పు 1752 మిమీ, ఎత్తు 2651 మిమీ మరియు బూట్ స్పేస్ 560 లీటర్ల వరకు ఉంటుంది.

Malayalam Actor Hareesh Kanaran Skoda Slavia

స్కోడా స్లావియా టోర్నాట్ రెడ్, క్రిస్టల్ బ్లూ, క్యాండీ వైట్, రిఫ్లెక్స్ సిల్వర్ మరియు కార్బన్ స్టీల్ అనే కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. ఈ కారు డిజైన్ విషయానికి వస్తే.. ఇది సిగ్నేచర్ బటర్‌ఫ్లై గ్రిల్, స్లీక్ హెడ్‌ల్యాంప్, ఎల్ షేప్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్ స్ట్రిప్, స్పోర్టీ ఫ్రంట్ బంపర్, ఫాగ్ ల్యాంప్ హౌసింగ్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ వంటివి పొందుతుంది. ఇవన్నీ కారును ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తాయి.

ఇంటీరియర్ విషయానికి వస్తే.. స్కోడా స్లావియా 10 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, 8 ఇంచెస్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ వంటి వాటితో పాటు వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, ఆటో డిమ్మింగ్ రియర్ వ్యూ మిర్రర్ వంటి మరెన్నో ఫీచర్స్ ఇందులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందించడంలో ఉపయోగపడతాయి.

Skoda Slavia Style Editon

స్కోడా స్లావియా 1.0 లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 115 హార్స్ పవర్ మరియు 178 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ కారులో సేఫ్టీ కోసం మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, హిల్ హోల్డ్ అసిస్ట్, రియర్ పార్కింగ్ కెమెరా, మల్టి కొలిజన్ బ్రేక్ మొదలైనవి ఉన్నాయి.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.

More from DriveSpark

Article Published On: Tuesday, May 21, 2024, 9:06 [IST]
English summary
Famous malayalam actor hareesh kanaran buys skoda slavia
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+