బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' కొత్త కారు చూసారా.. ధర ఎంతో తెలుసా?
సాధారణ ప్రజలతో పోలిస్తే.. సెలబ్రిటీలు ఎప్పటికప్పుడు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తూ ఉంటారన్న విషయం అందరికి తెలుసు. ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ కన్నడ బుల్లితెర నటి 'ప్రజ్ఞా భట్' ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ ప్లస్ కారును కొనుగోలు చేశారు.
నటి 'ప్రజ్ఞా భట్'(Prajna Bhat) కొనుగోలు చేసిన 'ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ ప్లస్' కారుకు సంబంధించిన ఫోటోలు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా షేర్ చేసింది. ఇందులో ఆమె, ఆమె భర్త నాగశ్రీత్ భట్ ఇద్దరూ కలిసి కారును డెలివరీ తీసుకోవడం చూడవచ్చు. నెట్టింట్లో ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. కొత్త కారు కొన్న నటికి నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే వేలసంఖ్యలో ఈ ఫోటోలు లైక్స్ పొందాయి.

ఇక వర్టస్ జీటీ ప్లస్ విషయానికి వస్తే.. ఇది ఫోక్స్‌వ్యాగన్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్. రూ. 7.60 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర కలిగిన ఈ కారు క్యాండీ వైట్, రిప్లెక్స్ సిల్వర్, డీప్ బ్లాక్ పెర్ల్ మరియు లావా బ్లూ వంటి ఎనిమిది కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించడం వల్ల ఈ కారును కస్టమర్ తనకు నచ్చిన కలర్ ఆప్షన్‌లో ఎంచుకోవచ్చు. డిజైన్ మరియు ఫీచర్స్ కూడా అద్భుతంగా ఉంటాయి.
డిజైన్ విషయానికి వస్తే.. ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ ప్లస్ మోడల్ చూడగానే ఆకర్శించే డిజైన్ పొందుతుంది. ఈ కారణంగానే ఎక్కువమంది ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేయడానికి ఎగబడుతున్నారు. ఇది కేవలం సాధారణ ప్రజలను మాత్రమే కాకుండా సెలబ్రిటీలను సైతం ఆకర్షిస్తోంది. ఐదు మంది ప్రయాణికులకు సరిపోయే ఈ కారు 521 లీటర్ల బూట్ స్పేస్ పొందుతుంది.

ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ జీటీ ప్లస్ సెడాన్ 10-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే వంటి ఫీచర్స్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఇందులో పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్, సింగిల్ పేన్ సన్‌రూఫ్, కనెక్టెడ్ కార్ టెక్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, రెయిన్ సెన్సార్లు, వైపర్లు మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ వంటి మరిన్ని ఫీచర్స్ ఇందులో లభిస్తాయి.
ఇంజిన్ విషయానికి వస్తే.. ఫోక్స్‌వ్యాగన్ యొక్క వర్టస్ జీటీ ప్లస్ సెడాన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 150 పీఎస్ పవర్ మరియు 250 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. కావున పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఈ సెడాన్ 18.67 కిమీ మైలేజ్ అందిస్తుంది.
ఇక చివరగా ఈ సెడాన్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది గ్లోబల్ ఎన్‌సీఏపీ క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు, పార్కింగ్ సెన్సార్లు మొదలైనవి ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఈ సెడాన్ మార్కెట్లో హ్యుందాయ్ వెర్నా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








