రీల్స్ చేస్తూ లక్షల ఖరీదైన కారు కొనేసింది!.. ఫోటోలు చూసారా?
పెద్ద పెద్ద సెలబ్రిటీలు, క్రికెటర్లు మరియు పారిశ్రామిక వేత్తలు మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన వారు కూడా తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి సన్నివేశాల గురించి గతంలో చాలా తెలుసుకున్నాము. మల్లీ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో (ఇన్‌స్టాగ్రామ్) ఫేమస్ అయినా ఓ యువతి ఇటీవల లక్షల విలువ చేసే కారును కొనుగోలు చేసింది. ఇంతకీ ఆ యువతి ఏ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
అమలా షాజీ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్. తమిళనాడుకు చెందిన ఈ అమ్మాయికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కేవలం రీల్స్ చేస్తూ ఎంతోమంది అభిమానులను కలిగిన ఈ యువతి ఇటీవల హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఎక్స్‌టర్ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో అమలా షాజీ కారు పక్కన ఉండటం చూడవచ్చు.

రీల్స్ చేస్తూ ఓ సెలబ్రిటీల మారిన ఈమెకు ఫ్యాన్స్ పాలోయింగ్ కూడా భారీగా ఉంది. నిజానికి ఈమె సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడమే మాత్రమే కాకుండా ఎన్నో అవార్డులను సైతం దక్కించుకున్నట్లు సమాచారం. ఇప్పుడు తాజాగా హ్యుందాయ్ ఎక్స్‌టర్ కొనుగోలు చేసింది. ఈ కారును డెలివరీ చేసుకోవడానికి వారి కుటుంబంతో డీలర్షిప్ చేరుకున్నట్లు, సిబ్బంది వారికి కారును డెలివరీ చేయడం వంటివి చూడవచ్చు.
ఇక హ్యుందాయ్ ఎక్స్‌టర్ విషయానికి వస్తే.. ఈ కారు భారతీయ మార్కెట్లో విడుదలైన అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందగలిగింది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ SUV 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 81.8 Bhp పవర్ మరియు 113.8 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.

ఈ కారు CNG వెర్షన్లో కూడా లభిస్తుంది. కాబట్టి హ్యుందాయ్ ఎక్స్‌టర్ CNG మోడల్ 67.7 Bhp పవర్ మరియు 95.2 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఎక్స్‌టర్19.2 కిమీ/లీ నుంచి 19.4 కిమీ/లీ మైలేజ్ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. అదే సమయంలో CNG వెర్షన్ గరిష్టంగా 27.1 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుంది.
భారతదేశంలో రూ.6.13-రూ.10.28 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ధరలో లభించే ఈ కారు అద్భుతమైన డిజైన్, అంతకు మించిన అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉండటం వల్ల లాంగ్ డ్రైవ్ వెళ్లాలనుకునే వారికి కూడా ఇది ఉత్తమ ఎంపిక అనే చెప్పాలి. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది కొంత గ్రాండ్ ఐ 10 నియోస్ మరియు ఆరా వంటి వాటికి కొంత సారూప్యతను కలిగి ఉంటుంది.
భారతదేశంలో సెలబ్రిటీలు కొత్త కార్లను కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు, గతంలో చాలామంది చాలా సందర్భాల్లో ఖరీదైన కార్లను కొనుగోలు చేసిన రోజులు ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే కార్ల మీద సాధారణ ప్రజలకంటే సెలబ్రిటీలకు ఎక్కువ మక్కువ అని తెలుస్తోంది. ఇందులో భాగంగానే వారికి నచ్చిన కార్లను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








