కామెంట్స్ పట్టించుకోలేదు, అనుకున్నదే చేస్తున్నారు.. లక్షల ఖరీదైన కారు కొనేశారు
సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయి బాగా డబ్బు సంపాదిస్తూ విలాసవంతమైన జీవితాలు గడుపుతున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. నెలకు లక్షల కొద్దీ డబ్బు సంపాదిస్తూ ఖరీదైన కార్లు కొన్నవారు కూడా గతంలో చాలామంది వెలుగులోకి వచ్చారు. అయితే ఇటీవల 'టీటీ ఫ్యామిలీ' పేరుతో సోషల్ మీడియాలో లక్షల మంది సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్లను కలిగిన షెమీ, షెఫీ అనే ఓ జంట ఇటీవల లక్షల ఖరీదు చేసే కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వీరు కొన్న కారు ఏది? దాని ధర ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలతో బాగా ఫేమస్ అయిన ఈ జంటపై కొందరు కొంతకాలంగా భీభత్సంగా ట్రోలింగ్ చేస్తున్నారు. వయసు ఎక్కువగా ఉన్న మహిళను పెళ్లి చేసుకున్నావని తీవ్రంగా విమర్శిస్తున్నప్పటికీ.. అవేమీ పట్టించుకోకుండా.. దృఢ సంకల్పంగా ఈ జంట తమపని తాము చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు. సోషల్ మీడియాలో బాగా గుర్తింపు పొందారు. బాగా డబ్బు కూడా సంపాదిస్తున్నారు.

సోషల్ మీడియాలో వీడియోస్ చేయడం మాత్రమే కాకుండా.. షేమీ కేరళలోని కోజికోడ్ జిల్లా కొడువల్లిలో బట్టల దుకాణాన్ని నడుపుతున్నట్లు సమాచారం. అయితే ఇటీవల వీరు మారుతి సుజుకి కంపెనీకి చెందిన బాలెనొ కారును కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు మరియు వీడియో వంటివి నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇందులో షెమీ, షెఫీ మాత్రమే కాకుండా వారి కుమార్తె ఉండటం కూడా చూడవచ్చు.
షెమీ మరియు షెఫీ ఇద్దరూ కలిసి కారు మారుతి డీలర్‌షిప్‌కు చేరుకుని అక్కడ డీలర్‌షిప్ సిబ్బంధి నుంచి కారు కీ(తాళం) తీసుకున్నారు. వీరు కోన్ మారుతి సుజుకి బాలెనొ అనేది టాప్ స్పెక్ వేరియంట్ అని తెలుస్తోంది. దీని ధర రూ.9.88 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని సమాచారం. అయితే బేస్ మోడల్ ధర రూ.6.66 లక్షలు మాత్రమే. ప్రస్తుతం వీరు కారు కొన్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

షెమీ మరియు షెఫీ జంట కొత్త కారు కొన్న సందర్భంగా కొందరు నెటిజన్లు అభినందనలు చెబుతున్నారు. మరి కొందరు వీరిని విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ ఫోటో లక్షల లైక్స్ పొందింది. నిజానికి భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి కార్లలో బాలెనొ ఒకటి. ఇప్పటికే ఈ కారు దేశీయ మార్కెట్లో అధిక సంఖ్యలో విక్రయించబడింది. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.
భారతీయ మార్కెట్లో టయోటా గ్లాంజా, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ వంటి వాటికి ప్రత్యక్ష ప్రత్యర్థిగా ఉన్న మారుతి సుజుకి బాలెనొ 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్ మరియు కీలెస్ ఎంట్రీ వంటి అనేక ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.
మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, హిల్ హోల్డ్ అసిస్ట్, 360 డిగ్రీ కెమెరా వంటి అనేక సేఫ్టీ ఫెచర్స్ మారుతి బాలెనొ కారులో ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి. ఈ కారులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 90 పీఎస్ పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








