రూ. కోట్లు విలువ చేసే కారు కొన్న యూట్యూబర్.. ఫిదా చేస్తున్న వీడియో

భారతదేశంలో అత్యంత ఖరీదైన కార్లలో ఒకటైన 'టయోటా ల్యాండ్ క్రూయిజర్' (Toyota Land Cruiser) కారును ఇటీవల ఓ యూట్యూబర్ కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

యూట్యూబ్ ఛానెల్‌లో అప్లోడ్ చేయబడిన ఈ వీడియోలో మీరు గమనించినట్లయితే.. యూట్యూబ్ ప్రయాణం ఎలా మొదలైందో.. ఈ స్థాయికి చేరటానికి అతడు ఎలా కష్టపడ్డాడో వివరించడం తెలుస్తుంది. ఇందులో అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు సమావేశమై కారును ఆవిష్కరించడం చూడవచ్చు. ఇప్పటికి తాను కొనుగోలు చేసిన 11వ కారు ఇదని తెలుస్తోంది. ఇప్పటికే టయోటా ఫార్చ్యూనర్, మహీంద్రా థార్, బీఎండబ్ల్యూ ఎం340ఐ వంటివి కొనుగోలు చేసినట్లు సమాచారం.

Famous Youtuber Buys Toyota Land Cruiser LC300

ఇక్కడ కనిపించే టయోటా ల్యాండ్ క్రూయిజర్ కొత్తదేనా.. లేక ఉపయోగించిన కారును కొన్నారా అనేది స్పష్టంగా వెల్లడికాలేదు. బహుశా ఇది ఇది కొత్తది కాదేమో అని తెలుస్తోంది. కాబట్టి ఈ కారును ఎంత ధరకు కొనుగోలు చేశారనే విషయం కూడా స్పష్టంగా తెలియడం లేదు. అయితే కారు చూడటానికి చాలా అద్భుతంగా ఉండటం గమనించవచ్చు. వీడియోలో యూట్యూబర్ ఫ్రెండ్స్ మొత్తం సందడి చేయడం గమనించవచ్చు.

నిజానికి టయోటా కంపెనీ యొక్క కొన్ని ఇతర మోడల్స్ మాదిరిగానే.. టయోటా LC300 భారతదేశంలో తయారు కాదు. కాబట్టి ఇది సీబీయు (కంప్లీట్ బిల్డ్ యూనిట్) మార్గం ద్వారా మనదేశానికి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఈ కారణంగానే ల్యాండ్ క్రూయిజర్ ధర చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కారు టయోటా యొక్క అత్యుత్తమ లగ్జరీ కారు అని చెప్పవచ్చు. డిజైన్ మరియు ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి.

Famous Youtuber Buys Toyota Land Cruiser LC300

టయోటా ల్యాండ్ క్రూయిజర్ జీఏ-ఎఫ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 12.3 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, లెదర్ అపోల్స్ట్రే మరియు 14 స్పీకర్ జేబీఎల్ ఆడియో సిస్టం వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి. ఇది ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారణంగానే చాలామంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు.

గ్లోబల్ మార్కెట్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను పొందుతుంది. అయితే భారతదేశంలో ఈ కారు కేవలం డీజిల్ ఇంజిన్ ఆప్షన్ మాత్రమే పొందుతుంది. ఇందులో 3.3 లీటర్ వీ6 టర్బో డీజిల్ ఇంజిన్ గరిష్టంగా 309 పీఎస్ పవర్ మరియు 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 10 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడి ఉంటుంది.

భారతీయ మార్కెట్లో పెట్రోల్ వెర్షన్ లభించినప్పటికీ.. పెట్రోల్ వెర్షన్ 3.5 లీటర్ ట్విన్ టర్బో ఛార్జ్డ్. ఇది 415 పీఎస్ పవర్ మరియు 650 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా మంచి పనితీరుని అందిస్తుంది. మన దేశంలో టయోటా కంపెనీ గత ఏడాది తన ప్రస్తుత ల్యాండ్ క్రూయిజర్ SUV లాంచ్ చేసింది. దీని ధర రూ. 2.10 కోట్లు (ఎక్స్ షోరూమ్).

మన దేశంలో చాలామంది ప్రముఖులు టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లను కలిగి ఉన్నారు. ఇందులో ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్, పంజాబీ సింగర్ గురుదాస్ మాన్, తమిళనాడుకు చెందిన రాజకీయా నాయకుడు కేఎన్ నెహ్రూ, మరియు ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ థాక్రే మొదలైన వారు ఉన్నారు. ఈ జాబితాలోకి తాజాగా యూట్యూబర్ వికాస్ దయాల్ కూడా చేరిపోయారు.

More from DriveSpark

Article Published On: Wednesday, March 13, 2024, 12:27 [IST]
English summary
Famous youtuber buys toyota land cruiser lc300 viral video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+