యూట్యూబ్‌ వీడియోలు చేస్తూ అంత సంపాదించవచ్చా? 24 ఏళ్ల కుర్రాడి జీవితం మొత్తం మారిపోయింది!

ప్రస్తుతం ప్రపంచంలో ఇంటర్‌నెట్‌ యుగం నడుస్తోంది. పని వేళలు పూర్తి చేసుకున్న అనంతరం ఎక్కువ మంది నేడు ఫోన్‌లో గడుపుతున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కొత్త వీడియో క్రియేటర్స్‌ పుట్టుకొస్తున్నారు. ఇలాంట్‌ క్రియేటర్స్‌ వీడియోల్లో సబ్జెక్ట్‌ లేదా ఎంటర్‌టైన్‌మెంట్‌ సరిగ్గా ఉంటే వారు వెనక్కు తిరిగి చూడాల్సిన పని లేదు. అందులోనే రాణిస్తూ భారీగా సంపాదిస్తున్నారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎక్కువ సమయం ఇంటర్నెట్ గుప్పిట్లో ఉందంటే అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రతిరోజూ సోషల్ మీడియాలో గంటల తరబడి గడుపుతున్నారని గణాంకాలు కూడా చెబుతున్నాయి. దీని ద్వారా సోషల్ మీడియాలో చాలా మంది పాపులర్ అవుతున్నారు.

సినీ నటులు, నటీమణుల కంటే కొందరు సోషల్ మీడియాలో సొంతంగా ఫ్యాన్‌ బేస్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. దీంతో వాళ్లు క్షణాల్లో పాపులర్ అవుతున్నారు. పాపులారిటీతో పాటు భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. భారీ సంపాదనతో చాలామంది ఇప్పటికే కొత్త కార్లు, బైకులు కొంటున్నారు. ఈ వార్తలు చాలానే మనం చూశాము. తాజాగా ఓ వ్యక్తి యూట్యూబ్‌ ద్వారా పెద్ద కారుని కొని ఫేమస్‌ అయ్యాడు. ఆ వివరాలు మీ కోసం..

Youtuber-Thoppi-Buys-Toyota-Fortunar

కేరళలో కుర్రాళ్లకు సూపర్ హీరో పిలుచుకునే మహమ్మద్‌ నిహాద్‌ అనే 24 ఏళ్ల యువకుడు టయోటా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేశాడు. అతను కొనుగోలు చేసిన ఫార్చ్యూనర్ కారులో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా యూట్యూబ్‌లో (Mrz Thoppi) ఛానల్‌లో వీడియోలు చేస్తూ కారుని కొనుగోలు చేయడంతో అతను మరోసారి వైరల్‌ అయ్యాడు.

మిస్టర్ హ్యాట్ పేరుతో ఆన్‌లైన్‌ గేమ్ వీడియోలను యూట్యూబ్‌లో కామెంటరీతో పోస్ట్‌ చేసి పాపులర్ అయ్యాడు. ముఖ్యంగా మలయాళీ కుర్రాళ్లు, యువకులు ఆయన వీడియోలను ఆసక్తిగా చూస్తారు. దీంతో చాలా మంది అతడి అసలు పేరు తెలియక యూట్యూబ్ ఛానల్ తొప్పి పేరుతో పిలుస్తుంటారు. విదేశీ యూట్యూబర్ల మాదిరిగానే ఆటకు సంబంధించిన వీడియోలను ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయడంతో ఇతను ఫేమస్‌ అయ్యాడు.

Youtuber-Thoppi-Toyota-Fortuner

దీనివల్ల అతడు ప్రత్యేకంగా యూత్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించాడు. యూట్యూబ్ సెన్సేషన్ మహ్మద్ నిహాద్‌ కొత్త టయోటా ఫార్చ్యూనర్ కారును కొనుగోలు చేశారు. భారతదేశంలో ఫార్చ్యూనర్ కార్లు చాలా ప్రాచుర్యం పొందాయి. చాలా మంది ఫార్చ్యూనర్ షోరూమ్‌ కారుని కొనాలనుకుంటారు. అయితే ఇతను సరికొత్త కారుని కొనుగోలు చేయలేదు. సెకండ్ హ్యాండ్ కొనుగోలు చేశారు.

మహమ్మద్ నిహాద్‌ తన యూట్యూబ్ ఛానల్‌లో ఈ ఫార్చ్యూనర్ కొనుగోలు చేసిన వీడియోను పోస్ట్ చేశాడు. ఈ కారును ఆయన ఎంతకు కొన్నారనే దానిపై ఎలాంటి సమాచారం లేదు. ఈ యూట్యూబర్ తొప్పికి ఇప్పటికే టాటా నానో కారు ఉంది. సెకండ్ హ్యాండ్ టయోటా ఫార్చ్యూనర్ అతని గ్యారేజీలో చేరిన రెండవ కారుగా ఉంది. మాకు అందిన సమాచారం ప్రకారం ఫార్చ్యూనర్ కారును 2009 నుంచి 2012 వరకు ఉపయోగించారు.

గత 12 సంవత్సరాలుగా ఈ కారును ఎందుకు ఉపయోగించలేదు? లేక ఈ కారు వేరొకరి చేతుల్లోకి వెళ్లిందా? అనే వివరాలు లేవు. 2009 మరియు 2012 మధ్య వచ్చిన టయోటా ఫార్చ్యూనర్ 3.0-లీటర్ టర్బోఛార్జ్డ్, ఇంటర్ కూల్డ్, నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్ 168bhp పవర్ మరియు 343nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

ఆ సమయంలో టయోటా ఫార్చ్యూనర్ ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.20 లక్షలుగా ఉంది. ఆ సమయంలో ఫోర్డ్ ఎండీవర్ ఫార్చ్యూనర్‌కి గట్టి పోటీగా ఉంది. అయితే కొన్నేళ్ల క్రితం ఫోర్డ్ ఇండియాను విడిచిపెట్టడంతో ఎండీవర్ ఇప్పుడు అమ్మకానికి లేదు. ప్రస్తుతం ఈ విభాగంలో టయోటా ఫార్చ్యూనర్‌ కింగ్ మేకర్‌గా ఉంది. మార్కెట్‌లో ప్రీమియం కార్లు ఉన్నప్పటికీ దీనిని ఢీకొట్టలేక పోతున్నాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, July 17, 2024, 14:05 [IST]
English summary
Famous youtuber in kerala thoppi buys toyota fortuner video gone viral
Read more on: #off beat #fortuner #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+