మీ అదృష్టానికి ఓ పరీక్ష.. ఉచితంగా టెస్లా కారు గెలుచుకునే అవకాశం
ఆధునిక కాలంలో యూట్యూబ్ ద్వారా సంపాదిస్తున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. అయితే ఇందులో చెప్పుకోదగ్గ వ్యక్తి మిస్టర్ బీస్ట్ (MrBeast) పేరుతో పాపులర్ అయిన జిమ్మీ డొనాల్డ్‌సన్. ఇతడు తన పుట్టినరోజు సందర్భంగా 'టెస్లా' (Tesla) కార్లను గిఫ్ట్‌గా ఇస్తామని ప్రకటించారు.
అత్యధిక ప్రజాదరణ పొందిన యూట్యూబర్ మరియు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ జిమ్మీ డొనాల్డ్‌సన్ (మిస్టర్ బీస్ట్) మే 7న తన పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు టెస్లా కార్లను గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే దీనికోసం ఏం చేయాలో కూడా చెప్పారు అంటూ కొన్ని షరతులను కూడా విధించారు. దీనికి సంబంధించిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.

అమెరికన్ యూట్యూబర్ జిమ్మీ డొనాల్డ్‌సన్ ప్రకటన ప్రకారం ఫ్రీ టెస్లా కారు పొందాలంటే.. మొదట ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ చేసి అందులో మిస్టర్ బెస్ట్ పేజీలోని పోస్తును లైక్ చేయాలి. అంతే కాకుండా.. ఇద్దరు స్నేహితులను ట్యాగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకరే డమ్మీ అకౌంట్స్ క్రియేట్ చేసి ఇలా చేస్తే వారిని రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. రీపోస్టు కూడా వర్తించవచ్చు. ఈ షరతులను తప్పకుండా పాటించాలి.
జిమ్మీ డొనాల్డ్‌సన్ షరతులను పాటిస్తూ లైక్ చేసిన అభిమానులలో 26 మందిని ఎంపిక చేసి వారికి టెస్లా కార్లను అందిస్తారు. అయితే విజేతలను మే 11న ప్రకటిస్తారు. వీరిని లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనే డైరెక్ట్ మెసేజ్ డ్వ్రా తెలియజేస్తారు. కాబట్టి దీనికోసం ఎదురు చూస్తున్న ఖాతాదారులు గెలిచారా? లేదా అని తెలుసుకోవడానికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చేసుకోవాలి.

మిస్టర్ బీస్ట్ నికర విలువ 500 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 4175 కోట్లు. ఇతని యూట్యూబ్ ఛానల్ ఇప్పటికి 256 మిలియన్ సబ్‌స్క్రైబర్లు కలిగి ఉంది. నిజానికి ఇతడు 2012లో మొదటి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ రియాక్ట్, మిస్టర్ బీస్ట్ గేమింగ్ మరియు మిస్టర్ బీస్ట్ 2 అనే యూట్యూబ్ ఛానల్ కలిగి ఉన్నారు.
జిమ్మీ డొనాల్డ్‌సన్ (Jimmy Donaldson) ఇవ్వనున్న 26 టెస్లా కార్లలో ఒక టెస్లా సైబర్ ట్రక్ కూడా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా మిస్టర్ బీస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. వీటిని అందించడానికి విజేతలను త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ కార్లను సొంతం చేసుకునే అదృష్టవంతులు ఎవరో త్వరలోనే తెలిసిపోతుంది. ఫ్రీ టెస్లా కారు కావాలనుకునే వారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు.
ఇక టెస్లా కార్ల విషయానికి వస్తే.. ప్రపంచ మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన కార్ బ్రాండ్లలో టెస్లా ఒకటి. ఈ కార్లను ఎక్కువమంది కొనుగోలు చేస్తుంటారు. టెస్లా (Tesla) కంపెనీ త్వరలోనే భారతదేశంలో ప్రవేశించడానికి సన్నద్ధమవుతోంది. దీనికోసం ఇప్పటికే పలుమార్లు కేంద్రంతో చర్చించింది. గుజరాత్ వద్ద తయారీ కర్మాగారాన్ని కూడా ఏర్పాటు చేయడానికి సన్నద్దవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








