ట్రెండింగ్‌లో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వీడియో.. సింప్లిసిటీకి ఫ్యాన్స్‌ ఫిదా

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌.. ఈ పేరు వింటనే ఫ్యాన్స్ అంతా పూనకాలతో ఊగిపోతారు. రజనీకాంత్‌ స్ట్రైల్‌, డైలాగ్‌ డెలివరీకి ఇండస్ట్రీలోనే ప్రత్యేక స్థానం ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఈ సూపర్‌స్టార్‌ నైజం. ప్రత్యేక సందర్భాల్లో మినహా ఎప్పుడు ఆయన అత్యంత సాదాసీదా జీవనం సాగిస్తుంటారు. ఈ నైజాన్నే ఆయన కోట్లాది మంది ఫ్యాన్స్ ఇష్టపడతారు. అయితే రజనీకాంత్‌ తాజా వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియోలో వైరల్‌ అవుతోంది.

తాజాగా సూపర్‌స్టార్‌ రజనీకాంత్ ముంబయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తూ కనిపించారు. అత్యంత భద్రత మధ్య అత్యంత సాదాసీదాగా కనిపించారు. ముంబయిలో జరుగుతున్న తన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్‌ చిత్రం "లాల్‌ సలామ్" షూటింగ్‌లో భాగంగా రజనీకాంత్‌ వచ్చినట్లు తెలుస్తోంది.

Rajinikanth

ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ నీలం రంగు టీ షర్ట్‌, గ్రే కలర్‌ ప్యాంట్‌ ధరించారు. మరియు చేతిలో ఓ బ్యాగ్‌ను స్వయంగా మోసుకెళ్తూ కనిపించారు. ముంబయి ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న సమయంలో అక్కడున్న ఫ్యాన్స్, మీడియా ప్రతినిధులకు అభివాదం చేస్తూ కనిపించారు. మరియు అత్యంత సాధారణ కారులో ఎయిర్‌పోర్ట్‌ నుంచి వెళ్లిపోయారు. అంత పెద్ద స్టార్‌ హోదా ఉండి కూడా సాధారణ హ్యాచ్‌బ్యాక్‌ కారులో ప్రయాణించడంపై సోషల్‌మీడియా వేదికగా సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిపిస్తున్నారు.

"సో డౌన్‌ టు ఎర్త్‌.. ఖరీదైన కారు లేదు.. ఈగో లేదు.." అంటూ ఓ అభిమాని కామెంట్‌ చేశారు. "తలైవా.. 72 సంవత్సరాల వయస్సులోనూ ఎంత యంగ్‌, స్పీడ్‌గా ఉన్నారో".. అంటూ మరొకొరు కామెంట్‌ చేశారు. మరో ఫ్యాన్‌ "బాస్‌" అంటూ కామెంట్స్‌లో రాసుకొచ్చారు.

లాల్‌ సలామ్ సినిమా షూటింగ్‌ కోసం రజినీకాంత్‌ ముంబయి వచ్చారు. ఈ సినిమాలో విక్రాంత్‌ హీరోకాగా.. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. లాల్‌ సలామ్ తొలి విడత షెడ్యూల్‌ షూటింగ్‌ గత నెలలోనే పూర్తయింది.

లాల్‌ సలాంలో రజినీ కాంత్‌ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ రెండు రోజుల క్రితమే విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది పోస్టర్‌ బాగుందంటే.. కొంత మంది మాత్రం పోస్టర్‌ నిరుత్సాహానికి గురిచేసిందంటూ కామెంట్లు చేస్తున్నారు. లాల్‌ సలామ్ సినిమా పోస్టర్‌పై పెద్దఎత్తున ట్రోలింగ్‌ చేస్తున్నారు.

అన్నాత్తే సినిమాలో రజినీకాంత్‌ ఆఖరిసారిగా కనిపించారు. ప్రస్తుతం లాల్‌ సలామ్‌ సినిమాతోపాటు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న జైలర్‌ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. జైలర్‌ సినిమాపై ఇండస్ట్రీలో భారీగా అంచనాలు ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Wednesday, May 10, 2023, 14:00 [IST]
English summary
Fans praises rajinikanth on his simplicity as he leaves mumbai airport in ordinary car
Read more on: #car
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+