21 ఏళ్ల కుర్రాడు.. క్రికెట్‌ బెట్టింగ్‌తో కోట్లు విలువ చేసే కార్లు కొంటున్నాడు

ప్రస్తుతం దేశంలో ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమింగ్‌ అనేది లీగల్‌ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఒడిశా, అస్సాం, సిక్కిం, నాగాలాండ్‌ రాష్ట్రాలకు చెందిన వారు ఈ ఫాంటసీ గేమ్స్‌ ఆడుకునే అవకాశం లేదు. ముఖ్యంగా డ్రీమ్‌11, విజిన్‌11, మై టీమ్‌11, మై సర్కిల్‌11, బ్యాట్‌బాల్‌11 అనే ఫాంటసీ యాప్స్‌ దేశంలో బాగా ప్రాచూర్యం పొందాయి. ఇలాంటి యాప్స్‌ దేశంలో 100 వరకు ఉన్నాయి. 'దిమాక్‌ సే ఖేలో' ఆటలో యువత నుంచి పెద్దల వరకు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. క్రికెట్‌ ఫాంటసీ ప్రిడిక్షన్స్‌ కోసం చాలామంది ఎక్స్‌పర్ట్స్‌ య్యూట్యూబ్‌, ఇతర సామాజిక మాధ్యామాల్లో అంచనాలను అందిస్తున్నారు. వీరిచ్చే ప్రిడిక్షన్‌తో చాలామంది బెట్టింగ్‌ పెడుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫాంటసీ క్రికెట్ నిపుణుల్లో ఉత్తరప్రదేశ్‌కి చెందిన అనురాగ్ ద్వివేది ఒకరు. ఈ కుర్రాడి వయసు కేవలం 21 ఏళ్లు మాత్రమే. ఫాంటసీ బెట్టింగ్‌ ప్రిడిక్షన్స్‌ ఇస్తూ కోట్లలో సంపాదించాడు. తాజాగా రూ.5 కోట్ల విలువ చేసే లంబోర్ఘిని ఉరుస్ ఎస్ కారును కొనుగోలు చేసి వార్తలో నిలిచాడు. అంతే కాకుండా ఇతని వద్ద భారీ మొత్తంలో ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి.

Anurag-Dwivedi-Fantasy-Expert

అనురాగ్ ద్వివేది కొత్తగా కొనుగోలు చేసిన సరికొత్త లంబోర్ఘిని ఉరుస్ ఎస్ సూపర్ ఎస్‌యూవీని డెలివరీ తీసుకుంటున్న పోస్ట్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అవుతోంది. ఈ అల్ట్రా ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీని తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి డెలివరీ చేస్తున్న వీడియోను అతను షేర్ చేశారు. దేశంలోని కొందరు ప్రముఖుల వద్ద మాత్రమే ఈ కారు ఉంది. ఆ జాబితాలో ఈ యువకుడు చేరాడు.

ఈ ఉరుస్ ఎస్ వేరియంట్ 4.0-లీటర్ ట్విన్-టర్బోఛార్జ్డ్‌ వి8 ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ మోటారు గరిష్టంగా 666 PS పవర్‌ మరియు 850 NM గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్‌ లంబోర్ఘిని ఉరుస్ ఎస్ కేవలం 3.5 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ ద్వారా శక్తిని నాలుగు చక్రాలకు శక్తిని అందిస్తుంది.

Anurag-Dwivedi-Lamborghini-Urus-S

ఉరుస్ S తో పాటు లంబోర్ఘిని భారతదేశంలో ఉరుస్ పెర్ఫాంటేను కూడా అందిస్తుంది. ఇది ఉరుస్ యొక్క స్పోర్టియర్ వెర్షన్‌గా ఉంది. లంబోర్ఘిని ఉరుస్ S మరియు పెర్ఫాంటే మధ్య ప్రధాన తేడా సస్పెన్షన్ సెటప్‌ అని చెప్పవచ్చు. ఉరుస్ S ఎయిర్ సస్పెన్షన్ సెటప్‌ని కలిగి ఉంది. పెర్ఫార్మాంటే తక్కువ, ఫిక్స్డ్-కాయిల్ సెటప్‌ని కలిగి ఉంది. మూడు విభిన్న ఆఫ్-రోడ్ మోడ్స్‌ని ఈ కారు కలిగి ఉంది.

లంబోర్ఘిని ఉరుస్ ఎస్ కారుతో పాటు అనురాగ్ ద్వివేది వద్ద అనేక ఇతర ఖరీదైన కార్లు ఉన్నాయి. ఉరుస్ S కంటే ముందు వైట్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 130ను కొనుగోలు చేశాడు. దీని ధర సుమారు రూ .1.41 కోట్లుగా ఉంది. BMW జెడ్ 4 ధర రూ.5 కోట్లు, మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్ ధర రూ .80 లక్షలుగా ఉంది. అన్ని ఎక్స్-షోరూమ్‌ ధరలు.

వీటితో పాటు ఆయన BMW 7-సిరీస్ కారుని కలిగి ఉన్నాడు. దీనిని అనురాగ్ ద్వివేది పాపులర్ అయిన తర్వాత కొనుగోలు చేశాడు. వీటితో పాటు ఫోర్డ్ ఎండీవర్‌, మహీంద్రా థార్, మారుతి సుజుకి డిజైర్ కారుతో పాటు సామాన్యులు వినియోగించే సొంత సైకిల్‌ని కూడా కలిగి ఉన్నాడు. మరిన్నీ కార్లు కొనుగోలు చేస్తానని ద్వివేది చెప్పుకొచ్చాడు.

డ్రైవ్స్‌పార్క్‌ ఒపీనియన్: ఫాంటసీ గేమింగ్‌ అనేది ఆయ కంపెనీల నియమాలకు లోబడి ఉంటాయి. వీటిలో పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు తెలుసుకుని ఇన్వెస్ట్‌ చేయాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వీటికి అనుమతి లేదు. అయితే కొందరు ఇతర రాష్ట్రాల స్నేహితుల సహకారంతో బెట్టింగ్‌ ఆడుతున్నారు. ఫాంటసీ అనేది ఒక విధంగా జూదం అనే చెప్పాలి. కొందరికి ఇది కలిసి వస్తే మరికొందరిని అప్పులపాలు చేసే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, June 18, 2024, 18:42 [IST]
English summary
Fantasy cricket expert anurag dwivedi buys lamborghini urus and his cars collection
Read more on: #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+