టమాటాలు అమ్మి రూ. 25 లక్షలు కారు కొనుగోలు చేసిన రైతు.. తనతో పెళ్లికి నిరాకరించిన అమ్మాయికి దిమ్మ తిరిగే షాక్..
గత కొద్ది రోజులుగా జోరుగా వినిపిస్తున్న మాట టమాటాల రేట్లు. గతంలో ఎప్పుడు లేనంతగా టమాటా ధరలు కొండెక్కి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కానీ టమాటా పండించిన రైతులకు మాత్రం లక్షల్లో సిరులు కురిపిస్తున్నాయి. పంట దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో డిమాండ్ పెరిగి కిలో టమాటా రూ. 120 నుంచి రూ. 200 వరకు పెరిగిపోయింది.
దీంతో ఆరుగాలం శ్రమించి టమాటా సాగు చేసిన రైతులు రోజుల వ్యవధిలోనే కోటీశ్వరులుగా మారిపోయారు. పంట లాభాలు చేతికి రావడంతో టమాటా రైతు కుటుంబాలు ఆనందంలో మునిగి తేలిపోతున్నాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల టమాటా రైతులు ఊహించని రీతిలో లక్షలు, కోట్లు సంపాదించారు. ఆ డబ్బుతో లగ్జరీ ఇళ్లు, వాహనాలను సొంతం చేసుకుంటున్నారు. పూర్తి సమాచారం ఈ కథనంలో చదవండి.

సాధారణంగా వ్యవసాయం చేసే రైతులు లగ్జరీ కార్లు, ఇళ్లు కొనడం చాలా తక్కువ. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి సంపాదిస్తే ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట పెట్టుబడి పోగా వారికి చేతికొచ్చేది చాలా తక్కువ. కానీ టమాటా పంట వారి పాలిట కల్పవృక్షంగా మారింది. ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ రైతు టమాటా పంటలో వచ్చిన లాభంతో లగ్జరీ కారు కొనుగోలు చేశారు.
కర్ణాటక చామరాజనగర్‌లోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు రాజేష్ తనకున్న 12 ఎకరాల్లో టమాట సాగు చేశారు. ధరలు విపరీతంగా పెరగడంతో ఆరు నెలల్లో కోటి రూపాయలు సంపాదించారు. దీంతో ఆ డబ్బుతో తమ ఖర్చులన్నీ పోగా ఓ విలాసవంతమైన కారు కొనుగోలు చేశారు. తన సంపాదనలో రూ. 25 లక్షలు వెచ్చించి లగ్జరీ ఎక్స్‌యూవీ మహీంద్రా 700 కారును బుక్ చేసుకున్నారు.
తక్కువ బడ్జెట్‌లో కారు కొనుగోలు చేయవచ్చు కదా.. ఇంత ఖరీదు పెట్టి ఇంత విలాసవంతమైన కారు కొనుగోలు చేయడం అవసరమా అనే మీకు సందేహం రావచ్చు. కానీ రాజేష్ ఈ కారు కొనుగోలు చేయడం వెనుక అతని ఆత్మగౌరవానికి సంబంధించిన కథ ఉంది. అదేంటంటే..
గత కొంతకాలంగా రాజేష్ వ్యవసాయం చేస్తున్నాడు అనే ఒకే ఒక్క కారణంతో అతనికి అమ్మాయిని ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అదే వ్యవసాయం చేస్తూ లగ్జరీ కారు కొనుగోలు చేశారు ఆ రైతు. టమాటా పంటతో వచ్చిన లాభంతో డబ్బును వృథా చేయకుండా వారికి తనేంటే నిరూపించడానికి ఈ కారు కొన్నారు.
ఈ రైతు గత ఆరు, ఏడేళ్లుగా రాజేష్ తన పొలంలో టమాట సాగు చేస్తున్నారు. గత రెండేళ్లుగా రాజేష్ కుటుంబసభ్యులు అతనికి పెళ్లి చేయడం అమ్మాయిని వెతికే పనిలో పడ్డారు. అయితే ఈరోజుల్లో అమ్మాయిలు చదువుకున్న, ఉద్యోగంలో బాగా సెటిల్ అయిన అబ్బాయి కావాలని డిమాండింగ్ ఉండటంతో అతడికి అమ్మాయి దొరకడం కష్టంగా మారింది.
దీంతో రాజేష్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అమ్మాయిని చూడ్డానికి వెళ్లిన ప్రతి ఇంట్లోనూ ఇదే అనుభవం ఎదురైంది. దీంతో ఎలాగైనా భవిష్యత్తులో ఎదగాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. తన 12 ఎకరాల పొలంలో పండించిన టమాటాకు బంపర్ ధర పలికింది. గత ఆరు నెలల్లో క్రమంగా టమాటా వ్యాపారం కారణంగా అతనికి రూ. కోటి ఆదాయం అందింది.
వ్యక్తిగత రుణాలు, బ్యాంకు రుణాలు, ఖర్చులు అన్నీ పోగా మిగిలిన సొమ్ములో కొంత పొదుపు చేసుకున్నారు. రూ. 25 లక్షలతో మహీంద్రా ఎక్స్‌యూవీ 700 కారును కొనుగోలు చేశారు. దీంతో వ్యవసాయం చేసే వారికి పిల్లను ఇవ్వబోం అనే వారికి గట్టి సమాధానం చెప్పాలని అనుకున్న రాజేష్ సంకల్పం ఫలించడంతో అతను ఆనందలో మునిగి తేలుతున్నాడు.


Click it and Unblock the Notifications








