రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

సాధారణంగా రైతులంటే ట్రాక్టర్లు, జేసీబీలు వంటివి కొనటం సహజం. కానీ మహారాష్ట్రలోని భివాండికి చెందిన ఒక రైతు ఏకంగా హెలికాప్టర్ కొనుగోలు చేసి సంచలనం సృష్టించాడు. ఇంతకీ ఆ రైతు హెలికాఫ్టర్ ఎందుకు కొన్నాడు, దాని వెనుక ఉన్న అసలు సంగతేంటో మనం ఈ ఆర్టికల్ లో చూద్దాం..

రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

మహారాష్ట్రలోని భివాండికి చెందిన జనార్థన్ బోయిర్ వ్యవసాయంతో పాటు అనేక వ్యాపారాలను నడుపుతున్నాడు. అతడు ఇటీవల పాడి పరిశ్రమలోకి ప్రవేశించారు. ఈ కారణంగా జనార్దన్ పాల వ్యాపారం కోసం దేశ వ్యాప్తంగా పర్యటించాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగా అతడు హెలికాప్టర్ కొన్నారు.

రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

జనార్దన్ బోయెర్ వ్యాపార నిమిత్తం భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లాలి. ఈ నేపథ్యంలో అతడు 30 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్‌ను కొనుగోలు చేశారు. పాడి పరిశ్రమ కారణంగా, వారు పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాలకు తరచూ ప్రయాణించాల్సి ఉంటుంది.

MOST READ:భగ్గు మంటున్న పెట్రోల్; వరుసగా 8వ రోజు పెరిగిన ధరలు

రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

చాలా నగరాల్లో విమానాశ్రయాలు లేనందున మరియు అతను ఎక్కువ దూరం ప్రయాణించవలసి ఉన్నందున జనార్థన్ బోయర్ సొంతంగా హెలికాప్టర్ కొనాలని నిర్ణయించుకున్నాడు. దీని గురించి అతని స్నేహితులలో ఒకరు అతనికి సలహా ఇచ్చారని చెప్పాడు.

రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

జనార్ధన్ భోయిర్ తన 2.5 ఎకరాల భూమిలో, హెలికాప్టర్ కోసం హెలిప్యాడ్, పైలట్‌కు, టెక్నీషియన్‌కు ఓ గదిని నిర్మించారు. మార్చి 15న అతడి ఇంటికి హెలికాప్టర్ వస్తుంది. జనార్దన్ బోయిర్ దాదాపు 100 కోట్ల రూపాయలు కలిగి ఉండటం గమనార్హం. జనార్దన్ బోయిర్ వ్యవసాయం మరియు పాడి పరిశ్రమతో పాటు రియల్ ఎస్టేట్‌ రంగంలో కూడా బాగా రాణించాడు.

MOST READ:ఇకపై వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్ లేకుంటే ఏమవుతుందో తెలుసా ?

రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

భివాండి ప్రాంతంలో ఇతనికి పెద్ద కంపెనీల గిడ్డంగులు ఉన్నాయి. ఆ గిడ్డంగులను అద్దెకు తీసుకునే వారికి పెద్ద కంపెనీల నుండి ఎక్కువ అద్దె లభిస్తుంది. మెర్సిడెస్, ఫార్చ్యూనర్, బిఎమ్‌డబ్ల్యూ, రేంజర్ రోవర్ వంటి హై రేంజ్ కార్లు గ్రామీణ ప్రాంతాల్లోకూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. జనార్ధన్ భోయిర్‌ ఇప్పుడు కొత్తగా పాల వ్యాపారం కూడా మొదలు పెట్టాడు. పాలు అమ్మేందుకు హెలికాప్టర్ కొని వార్తల్లో నిలిచాడు.

రూ. 30 కోట్లతో హెలికాఫ్టర్ కొన్న రైతు.. ఎందుకో తెలుసా ?

30 కోట్లు ఖర్చుపెట్టి హెలికాఫ్టర్ కొన్న జనార్దన్ ఈ 30 కోట్లు ఒక ఏడాదిలోపే సంపాదిస్తానని గట్టిగా చెబుతున్నాడు. జనార్దన్ సూత్రం ప్రకారం కష్టపడితే డబ్బులు వస్తాయి. కావున ఈ 30 కోట్లు తనకి పెద్ద సమస్య కాదని తెలిపాడు.

MOST READ:భారత మార్కెట్లో ఉన్న టాప్ సేఫ్టీ హ్యాచ్‌బ్యాక్ కార్లు : వివరాలు

Most Read Articles

English summary
Farmer From Maharashtra Buys Helicopter Worth Rs 30 Crore. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X