Just In
- 30 min ago
సుజుకి జిమ్నీ 5-డోర్ స్పెసిఫికేషన్లు లీక్
- 41 min ago
భారతదేశ పటిష్టత కోసం ఎయిర్ ఫోర్స్‌లో చేరిన లైట్ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్; వివరాలు
- 49 min ago
అలెర్ట్.. అలెర్ట్.. హోండా కార్లలో ఫ్యూయెల్ పంప్ సమస్య; 77,954 కార్లు రీకాల్!
- 1 hr ago
రూ. 9 కోట్ల విలువైన కారు కొన్న కుమార మంగళం బిర్లా; పూర్తి వివరాలు
Don't Miss
- News
నవీన్ పట్నాయక్ అపాయింట్మెంట్ కోరిన జగన్-తొలిసారి- ఎందుకో తెలుసా ?
- Movies
RIP Vivek Sir వివేక్ మృతితో శోక సంద్రంలో సినీ తారలు.. అనుభూతులను గుర్తు చేసుకొంటూ ఎమోషనల్
- Lifestyle
Ugadi Rashi Phalalu 2021: కొత్త ఏడాదిలో కన్య రాశి వారి భవిష్యత్తు ఎలా ఉంటుందంటే...!
- Finance
బిట్ కాయిన్ కంటే... బంగారంపై 15% పెట్టుబడి మంచిది!
- Sports
IPL 2021: టఫ్ ఫైట్: ఎదురుగా ఉన్నది ఏనుగు..సన్‌రైజర్స్ పరిస్థితేంటీ? ప్రిడిక్షన్స్ ఇవీ
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు
గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కరోనా మహమ్మరి చాలామంది జీవితాలను ప్రభావితం చేసింది. ఈ కరోనా వైరస్ కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. కరోనా మహమ్మరి నివారణలో భాగంగా లాక్ డౌన్ విధించారు. ఈ సమయంలో అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది ఇంటివద్ద ఉంటూ కాలక్షేపం చేస్తే, ఇంకొంతమంది వారిలో ఉన్న నైపుణ్యాన్ని బయటకు తీశారు.

కరోనా లాక్ డౌన్ లో వెలువడిన చాలా అద్భుతమైన విషయాలను గురించి ఇదివరకటి కథనాలతో చర్చించాం. ఇప్పుడే అదే రీతిలో ఒక రైతు ఏకంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేసాడు.

ఎంత కష్టకాలం వచ్చినా నిరంతరం పనిచేసే వాడు ఒక్క రైతు మాత్రమే, లాక్ డౌన్ సమయంలో ఒడిషాలోని మయూర్భంగ్ జిల్లా, కరంజియా సబ్ డివిజన్‌కు చెందిన సుశీల్ అగర్వాల్ అనే రైతు పెట్రోల్ మరియు డీజిల్ అవసరం లేని ఒక వాహనాన్ని తయారుచేసాడు. ఈ వాహనం సోలార్ ద్వారా నడుస్తుంది.
MOST READ:ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

వాహనాన్ని సోలార్ ప్యానెల్ మరియు ఛార్జింగ్ పాయింట్ ద్వారా కూడా ఛార్జ్ చేయవచ్చు. లాక్ డౌన్ సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు యూట్యూబ్ మరియు పుస్తకాలలో లభించే సమాచారం ఆధారంగా ఈ వాహనం అభివృద్ధి చేయబడిందని ఆ రైతు చెప్పాడు.

సుశీల్ అగర్వాల్ ఉండే ప్రాంతంలో న్యూ ఐడియాస్ ఇన్వెన్షన్‌పై వర్క్‌షాప్ జరిగింది. అందులో పాల్గొన్న అతడు, అక్కడ పరిచయమైన మెకానిక్స్ సాయంతో వెహికల్ తయారుచేయడం మొదలుపెట్టాడు. 850 వాట్ల మోటార్‌తో పాటు 54 వోల్ట్‌ల బ్యాటరీ, ఇతర పార్ట్స్ ఒక్కొక్కటిగా అసెంబుల్ చేస్తూ వచ్చాడు. మొత్తం 8 నెలల పాటు శ్రమించి ఎట్టకేలకు వెహికల్ రూపొందించాడు.
MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్

బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత వాహనం 300 కిలోమీటర్ల దూరం నడుస్తుందని అతడు తెలిపాడు. దీని బ్యాటరీని పూర్తిగా రీఛార్జ్ చేయడానికి 8.30 గంటలు పడుతుందని తెలిపాడు. మన్నికైన బ్యాటరీ ఈ వాహనంలో చాలా కాలంగా ఉపయోగించబడింది. బ్యాటరీ 10 సంవత్సరాలు ఉంటుందని ఆయన అన్నారు.

ఈ వాహనానికి అవసరమైన ఉపకరణాలు కూడా వారే రూపొందించారు. అతను అన్ని రకాల పెయింటింగ్, ఎలక్ట్రికల్ ఫిట్టింగులు మరియు ఇతర ముఖ్యమైన వాటిని కూడా వారే తయారుచేసుకున్న. ఈ వాహనాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వారు రైతు మాత్రమే కాదు, చురుకైన వ్యక్తి కూడా అని నిరూపించారు.
MOST READ:పార్కింగ్ సమయంలో కంట్రోల్ తప్పిన పోర్స్చే మాకాన్ ; తృటిలో తప్పిన ప్రమాదం

ఒక రైతు చేసిన ఈ అద్భుతమైన వాహనాన్ని చూసిన, ఆర్టీఓ అధికారులు వారి ఆవిష్కరణను చూసి ఆశ్చర్యపోయారు. నిజంగా యీతని సృష్టి అనన్య సామాన్యం. దీనిపై ఆర్టీఓ అధికారి మయూరభంజ్ గోపాల్ కృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుత కాలానికి పర్యావరణ అనుకూలమైన వాహనాలు అవసరం కావున, ఇది చాలాబాగా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. ANI న్యూస్ ఛానల్ కి ఆ రైతు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దీని సంబంధించిన మొత్తం సమాచారం ఉంది.
NOTE : ఇక్కడ ఉపయోగించిన కొన్ని ఫోటోలు రిఫరెన్స్ కోసం మాత్రమే