అడవి ఏనుగు దాడి! నేర్పుగా తప్పినందుకున్న రైతు - వీడియో చూడండి
పొలంలో ఉన్న రైతు మీదకు ఒక అడవి ఏనుగుగు దూసుకొచ్చింది. భారీగా ఉన్న ఏనుగును చూసి రైతు భయపడినప్పటికీ.. ఎంతో చాకచక్యంగా తప్పించుకోగలిగాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
నివేదికల ప్రకారం, ఈ సంఘటన కర్ణాటకలోని హసన్‌లో జరిగినట్లు తెలుస్తోంది. వీడియోలో గమనించినట్లయితే.. రైతు పొలంలో ఉన్న సమయంలో ఒక భారీ ఏనుగు హఠాత్తుగా అటువైపు వస్తుంది. దీనిని గమనించిన రైతు ఒక్క క్షణంలో దాని నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీశారు. పక్కనే ఉన్న ఇంటికి వెళ్లారు, కానీ ఇంటికి తలుపులు వేసి ఉండటం వల్ల, అక్కడే పార్కింగ్ చేసిన కారుకిందికి దూరాడు.

హఠాత్తుగా ఏనుగు రావడం, రైతు బయటపడి పరుగెత్తడం మొత్తం కూడా సీసీటీవీ కెమెరాల ద్వారా రికార్డ్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి ఏనుగు వేగంగా రైతు మీదికి వచ్చింది, ఆ సమయంలో అయన నేర్పుతో పక్కకు పరుగెత్తి తప్పించుకున్నారు. ఏనుగులు నేరుగా ఒక దిశవైపు మాత్రమే పరుగెత్తగలవు, వెంటనే వాటి దిశను మార్చుకోవడం సాధ్యం కాదు. బహుశా ఇది రైతుకు తెలిసి ఉండొచ్చని తెలుస్తోంది. మొత్తానికి రైతు ఏనుగు నుంచి తప్పించుకోగలిగాడు.
ఏనుగు నుంచి తప్పించుకుంటే.. తప్పించుకోగలిగాడు, వెంటనే సమీపంలో ఉన్న ఇంటిలోకి వెళ్లాలనుకున్నా కుదరలేదు. ఎందుకంటే ఆ ఇంటికి తాళం వేసినట్లు అనిపిస్తోంది. కానీ రైతు సమయస్ఫూర్తితో అక్కడే పార్కింగ్ చేసి ఉన్న కారు కిందికి దూరాడు. దీనికి సంబంధించిన మొత్తం సంఘటన కళ్ళకు కట్టినట్లు వీడియోలో కనిపిస్తుంది. చివరికి ఏనుగు రైతును వదిలిపెట్టి వెళ్లిపోయింది. వీడియోలో మరో వ్యక్తి కూడా అక్కడకు రావడం చూడవచ్చు.

చూడగానే భయం పుట్టించే ఈ సంఘటనలో ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. వీడియో ప్రారంభంలోనే రైతు ఏనుగుకు దొరికిపోయాడేమో అనిపిస్తుంది, కానీ ఊహకందని విధంగా రైతు తప్పించుకోగలిగాడు. నిజానికి వన్యప్రాణుల దాడి నుంచి తప్పించుకోవాలనుకున్నప్పుడు కార్ల కిందకి వెళ్లడం మంచిది కాదు, ఎందుకంటే జంతువులు వాసనపసి గట్టి దాడి చేయగలవు. కాబట్టి తప్పకుండా వీలైనంత దూరం తప్పించుకుని పారిపోవడం ఉత్తమం. అయితే ఇక్కడ రైతు సమయస్ఫూర్తి ప్రశంసనీయమే.
ఏనుగులు దాడి చేయడం ఇదే మొదటిసారి కాదు..
ఏనుగులు ప్రజల మీద, వాహనాల మీద దాడికి ప్రయత్నించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. గతంలో వెలుగులోకి వచ్చిన వీడియోలో ఒక ఏనుగు ఇద్దరు వ్యక్తులను, కారును వెంబడించడం చూడవచ్చు. ఆ ఇద్దరి వ్యక్తులలో ఒక వ్యక్తి అనుకోకుండా కిందికి పడిపోతాడు. అయినప్పటికీ ఏనుగు వారికి ఎటువంటి హాని తలపెట్టకుండా వెళ్లిపోయింది.
ఇక ఏనుగుల విషయానికి వస్తే.. జంతువులలోకెల్లా ఏనుగులు చాలా సూక్ష్మబుద్ది కలిగి ప్రవర్తిస్తాయి. అంతే కాకుండా ఇవి దాదాపు గుంపులుగా ఉండటానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి. అనుకోకుండా గుంపులో నుంచి తప్పించుకునే ఏనుగులు కొన్ని సార్లు భయపడి కనిపించే వ్యక్తుల మీద, వాహనాల మీద దాడి చేస్తాయి. అలంటి సమయంలో ప్రజలు కూడా చాలా జాగత్తగా వ్యవహరించాలి. లేకుంటే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది.
ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడంతో పాటు, దేశీయ మార్కెట్లో లాంచ్ అయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్' చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను మరియు సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. లేటెస్ట్ ఆటోమొబైల్ వార్తలు కోసం ఫేస్‌బుక్ (Facebook), ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మరియు యూట్యూబ్ (YouTube) ఛానల్స్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








