అవమానించిన సేల్స్​మ్యాన్​కి చుక్కలు చూపించిన రైతు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

సాధారణంగా మనిషి యొక్క వేషాన్ని చూసి తక్కువ అంచనా వేయడం చాలా పొరపాటు. కొంతమంది సాదాసీదాగా కనిపించే వారిని హేళన చేస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటన ఇటీవల కర్ణాటక రాజధాని నగరం బెంగళూరులో జరిగింది. దీని గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. రండి.

అవమానించిన సేల్స్​మ్యాన్​కి చుక్కలు చూపించిన రైతు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

కర్ణాటకలో తుమకూరు ప్రాంతానికి చెందిన కెంపెగౌడ అనే రైతు తుమకూరులోని మహీంద్రా షోరూమ్‌కి తన స్నేహితులతో కలిసి బొలెరో పికప్ ట్రక్ కొనేందుకు వెళ్లాడు. అయితే వారి వేషాలను చూసిన అక్కడి షోరూమ్ లోని ఒక సేల్స్‌మేన్‌ వారిని ఎంతగానో అవమానించాడు. అంతటితో ఆగకుండా ఆ సేల్స్‌మేన్‌ ఈ షోరూంలో రూ.10 లక్షలు ఖరీదు చేసే కార్లు ఉంటాయని, కనీసం మీ జేబులో 10 రూపాయలు కూడా ఉండవని ఎగతాళి చేసాడు.

అవమానించిన సేల్స్​మ్యాన్​కి చుక్కలు చూపించిన రైతు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

సేల్స్‌మేన్‌ వారికి బలవంతంగా ఆ షోరూమ్ నుంచి బయటకు పంపించేశాడు. ఆ సేల్స్‌మేన్‌ మతాలకు బాధపడిన ఆ రైతు కేవలం ఒక గంట వ్యవధిలోనే రూ. 10 లక్షలు తీసుకువచ్చి, మహీంద్రా బొలెరో (Mahindra Bolero) డెలివరీ చేయమని చెప్పాడు. ఇది చూసి అక్కడివారంతా ఆశ్చర్యపోయారు.

అవమానించిన సేల్స్​మ్యాన్​కి చుక్కలు చూపించిన రైతు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

అయితే అక్కడ మహీంద్రా బొలెరో ప్రస్తుతానికి లేదని కనీసం నాలుగురోజులు వ్యవధి కావాలని అక్కడి వారు చెప్పారు. ఆ మాటలకూ చిర్రెత్తిన ఆ రైతు ఒక్కసారిగా వారిపైన మండిపడ్డాడు. ఆ సేల్స్‌మేన్‌ మీదికి గొడవకు దిగాడు. ఈ సంఘటనతో అక్కడ మొత్తం గొడవ వాతావరణం ఏర్పడింది. అందరూ ఆ రైతుని సర్ది చెప్పడానికి చూసారు.

అవమానించిన సేల్స్​మ్యాన్​కి చుక్కలు చూపించిన రైతు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

రైతు కెంపెగౌడ ఆ సేల్స్‌మేన్‌ పై మండిపడటమే కాకుండా అతని స్నేహితులు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు రైతు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. దీంతో సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఇతర సిబ్బంది కెంపెగౌడకి క్షమాపణలు చెప్పటమే కాక రాత పూర్వకంగా క్షమపణ చెప్పడం కూడా జరిగింది.

అవమానించిన సేల్స్​మ్యాన్​కి చుక్కలు చూపించిన రైతు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

దీనికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో 'ఆనంద్ మహీంద్రా' ను ట్యాగ్ చేస్తూ అప్లోడ్ చేసారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తగ వైరల్ అవుతోంది. అయితే చివరకు ఆ రైతు ఇంతగా అవమానించిన ఈ కంపెనీలో కారు కొనడం ఇష్టం లేదని చెప్పి ఆ రైతు రూ.10 లక్షలు తీసుకుని వెళ్లిపోయాడు. ఇక ఈ ఘటనకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, కార్ షోరూమ్ సిబ్బంది తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అవమానించిన సేల్స్​మ్యాన్​కి చుక్కలు చూపించిన రైతు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఇక రైతు కెంపెగౌడ విషయానికి వస్తే, యితడు కర్ణాటకలోని తుమకూరు జిల్లాకు చెందిన వ్యక్తి. ఇక్కడ ఎక్కువ మంది వ్యవసాయం చేస్తూనే ఉన్నారు. తుమకూరు జిల్లాలో కావాల్సిన నీరు అందుబాటులో ఉండటంతో అక్కడి రైతులు సంవత్సరం మొత్తం వ్యవసాయం చేస్తుంటారు. కావున ఇక్కడ రైతులు బాగా అభివృద్ధి చెంది ఉన్నారు.

అవమానించిన సేల్స్​మ్యాన్​కి చుక్కలు చూపించిన రైతు.. ఇంతకీ ఏం జరిగిందంటే?

ఏది ఏమైనా షోరూమ్ కి వచ్చిన కస్టమర్లను అవమానించడం చాలా తప్పు, అంతే కాకూండా ఈ మనిషిని తన ఆహార్యాన్ని బట్టి అంచనావేయకూడదు. సాధారణంగా భారతదేశంలో చాలామంది రైతులు చాలా సాధారణంగా ఉంటారు. ఈ విషయం అందరికి తెలుసు. దీనిపైన మన ఆనంద్ మహీంద్రా గారు ఎలా స్పందిస్తారనేది త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
Farmers mass reply to mahindra salesman who insulted him
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X