విస్తరించబడిన పనామా కెనాల్... దీని చరిత్ర గురించి కూలంకశంగా...!!

By Anil

20వ శతాబ్దాన్ని ఇంజనీరింగ్ యొక్క శక్తి సామర్థ్యాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. షిప్పింగ్ పరిశ్రమలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిన పనామా కెనాల్ దాదాపుగా రూపుదిద్దుకుంది 20 వ శతాబ్దంలోనే. ప్రపంచంలో అతి పెద్ద నౌకల కోసం గత శతాబ్దంలోనే ఈ పనామా కెనాల్ ప్రాణం పోసుకుంది. అయితే మరింత విస్తరించబడిన కెనాల్ మరింత పెద్ద నౌకల రాకపోకలకు సుగమం అయ్యింది. గత ఆదివారం నాడు దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ కృత్రిమ కాలువ నిర్మాణ, సాంకేతిక ప్రయోజనాలు మరియు విస్తరించబడిన కాలువ ద్వారా కలిగే లాభాల గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం....

1. నైసర్గిక స్వరూపం

1. నైసర్గిక స్వరూపం

అమెరికా ఖండానికి ఇరువైపులా ఉన్న అట్లాంటిక్ సముద్రం మరియు పసిఫిక్ సముద్రాలను వేరు చేస్తూ అమెరికాకు చెందిన సన్నని భూ భాగం కలదు. దీని మీద కృత్రిమంగా కాలువను తవ్వి రెండు సముద్రాలను కలిపేశారు. ఈ కృత్రిమ కాలువనే పనామా కాలువ అంటారు.

2. ప్రారంభం

2. ప్రారంభం

1881 లోనే ఫ్రాన్స్‌ దీని నిర్మాణాన్ని చేపట్టింది. ఇంజనీరింగ్ పరిజ్ఞానం సమస్యలు మరియు పని చేసేే వారి కొరత వలన ఫ్రాన్స్‌ దీని నిర్మాణం చేపట్టలేక చేతులెత్తేసింది. ఆ తరువాత అమెరికా దీని నిర్మాణ భాద్యతలను తీసుకుని, నిర్మాణాన్ని పూర్తి చేసి 1914 ఆగష్టులో ఈ కాలువను ప్రారంభించారు.

3. పనామాకాలువ నిర్మాణానికి మొదటి భీజం

3. పనామాకాలువ నిర్మాణానికి మొదటి భీజం

కాలువను అనుకున్నట్లుగానే పూర్తి చేసారు. కాని 16 వ శతాబ్దంలోనే ఉత్తర మరియు దక్షిణ అమెరికాలను కలిపేటటువంటి అతి సన్నని భూబాగాన్ని తొలిచి అట్లాంటిక్ మరియు పసిఫిక్ సముద్రాలను కలపాలని భావించారు. అయితే ఆ ప్రాంతాన్ని కృత్రిమంగా కెనాల్‌గా తీర్చిదిద్దడానికి కావాల్సిన సాంకేతికత లేమి వలన అప్పట్లో దీని నిర్మాణం ఆచరణలోకి రాలేకపోయింది

4. తెరపైకి సూయజ్ కాలువ

4. తెరపైకి సూయజ్ కాలువ

అసియా మరియు యూరప్ రెండు కూడా సంయుక్తంగా సూయజ్ కృత్రిమ కాలువ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాయి. 1869 లో సూయజ్ కాలువను లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ సూయజ్ కాలువ నిర్మాణాన్ని మరియు దాని నిర్మాణానికి వినియోగించిన సాంకేతికతలతో ఈ పనామా కాలువను నిర్మించడానికి ఫ్రెంచ్ సంస్థ ముందుకు వచ్చింది.

5. ఫ్రాన్స్‌కు అప్పగింత

5. ఫ్రాన్స్‌కు అప్పగింత

పనామా కాలువ ప్రాజెక్టును ఫ్రాన్స్‌‌కు అప్పగించారు. సూయజ్ కాలువ నిర్మాణంలో ముఖ్య ఇంజనీరుగా పనిచేసిన ఫెర్నాండెండ్ డి లెస్సిప్స్ ఈ పనామా కాలువకు కూడా ఇంజనీరుగా వ్యవహరించాడు. ఆ భూబాగం మొత్తం గరుకుగా ఉండే అతి పెద్ద వర్షారణ్యం. నిరతరం కాలువ పనులు జరుగుతూ, వర్షాలు పడుతూ అక్కడ విపరీతమైన వ్యాధులు ప్రబళాయి, ఈ కారణంగా కొన్ని వందల మంది ఈ నిర్మాణంలో చనిపోయారు.

6. చేతులెత్తేసి ఫ్రాన్స్

6. చేతులెత్తేసి ఫ్రాన్స్

పనామా కాలువ ప్రాజెక్ట్ అత్యధిక సవాళ్లతో కూడుకుని ఉండటం మరియు కొన్ని వందల మంది అక్కడ ప్రాణాలు విడవడం వంటి కారణాల వలన ఫ్రాన్స్‌ ఈ పనామా కాలువ నిర్మాణాన్ని చేపట్టలేక వెనుతిరిగింది. ఈ ప్రాజెక్ట్‌ను వదిలేయడం ద్వారా ఫ్రాన్స్‌ ప్రభుత్వాన్నికి ధన నష్టం వాటిళ్లింది. ఆ తరువాత సుమారుగా ఏడు సంవత్సరాల వరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.

7. అమెరికా చేతికి పనామా కాలువ ప్రాజెక్ట్...

7. అమెరికా చేతికి పనామా కాలువ ప్రాజెక్ట్...

ఫ్రాన్స్‌ పనామా కాలువ నిర్మాణ పనులను వదిలినవెళ్లిన తరువాత అమెరికా 1904 లో దీని నిర్మాణ భాద్యతలను తీసుకుంది. ప్రత్యేకమైన ఇంజనీరింగ్ నిపుణులతో, మట్టిని తొలిగించే అధునాతన యంత్రాలు మరియు వాహనాలతో పనులను ప్రారంభించింది.

8. కొత్త ఇంజనీర్

8. కొత్త ఇంజనీర్

1904 సంవత్సరం మే 6 న అప్పటి అమెరికా అధ్యక్షుడు ఈ పనామా కాలువ నిర్మాణ ప్రాజెక్ట్‌కు ముఖ్య ఇంజనీర్‌గా జాన్ ఫిండ్లే వాల్లేస్‌ను నియమించాడు.

9. పనామా కాలువ

9. పనామా కాలువ

అమెరికా దీని భాద్యతలు తీసుకున్న తరువాత దీని అభివృద్ది పనులను ఎంతో వేగవంతం చేసింది. అధునాతన పరిజ్ఞానాలతో ప్రేళుల్లు, డ్రిల్లింగ్, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని తొలగించడం వంటి కఠోర శ్రమ చేశారు.

10. పూర్తి స్థాయిలో సిద్దం

10. పూర్తి స్థాయిలో సిద్దం

సుమారుగా పదేళ్ల సుదీర్ఘ సమయం తరువాత పనామా కాలువ నిర్మాణం పూర్తయింది. కొన్ని వేల మంది వర్కర్లు మరియు ఇంజనీర్ల కఠోర శ్రమ తరువాత పనామా కృత్రిమ కాలువ నిర్మాణం పూర్తయింది. నౌకల కోసం ప్రత్యేకంగా కాలువను 1914 లో ప్రారంభించారు. సుమారుగా 80 కిలోమీటర్ల పొడవు మేర ఉన్న ఈ కాలువలో నౌకలు నిలవడానికి రెండు పాత్ వే లను నిర్మించారు.

11. కృత్రిమ నదులు

11. కృత్రిమ నదులు

పనామా కాలువ నిర్మాణం ద్వారా మూడు కృత్రిమ నదులు ప్రాణం పోసుకున్నాయి. మరి కొన్ని ఆనకట్టల నిర్మాణ కూడా జరిగింది. పనామా జలసంధిలో అతి ముఖ్యమైన భాగం గాటన్ నది, సుమారుగా 33 కిలోమీటర్లు పొడవు మేర ఉన్న ఈ నది గుండా నౌకలు ప్రయాణిస్తుంటాయి.

12. భయంకరమైన సాంకేతికత

12. భయంకరమైన సాంకేతికత

పనామా కాలువ వెంబడి షిప్పింగ్ ఇండస్ట్రీకు చెందిన ఆధునాతమైన సాంకేతికతలు ఎప్పటికప్పుడు రూపుదిద్దుకుంటూనే ఉన్నాయి. షిప్పింగ్ ఇండస్ట్రీని విస్తరించే వ్యవస్థలు, అతి పెద్ద షిప్ లాంచింగ్ పోర్టులు, వివిధ రకాల ఆకారాలలో రూపొందించి పనామా కెనాల్ ద్వారా ఎంతటి పెద్ద నౌకలైనా కెనాల్ నుండి ఉప నదులలోకి కూడా ప్రయాణించే వీలును కల్పించారు.

13. భారీ ట్యాంకులు

13. భారీ ట్యాంకులు

పనామా కాలువలో నౌకలు నిలబడే ప్రదేశంలో నీటి ఎత్తు యొక్క అసమతుల్యత వలన నౌకలు మరియు నౌకాశ్రయంలోని ఫ్లాట్ ఫామ్ మధ్య ఎత్తు సమానంగా ఉండదు. దీనిని సమతుల్యం చేయడాని అతి పెద్ద ట్యాకుల ద్వారా కొన్ని లక్షల గ్యాలన్ల నీటిని నౌకలు నిలబడే ప్రదేశంలోకి నింపుతూ ఉండాలి. అలా మూడు అతి పెద్ద ట్యాంకులు నిరంతరం నీటిని నింపితే అపుడు నౌక సుమారుగా 90 అడుగుల ఎత్తుకు చేరుకుంటుంది.

14. ప్రత్యేక యంత్రాలు

14. ప్రత్యేక యంత్రాలు

నౌకలు ఈ పనామా కాలువలోని నిర్ణీత ప్రదేశాలలోకి వచ్చినప్పటికి సరైన క్రమంలో అవి నిలబడవు, వాటి లోని సరుకును దించాలన్నా లేదా నింపాలన్నా నౌకలు వివిధ రకాల కోణాలలో మళ్లాల్సి ఉంటుంది. ఇది సాధ్య కాదు కాబట్టి, కేబుల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉండే వెసెల్స్‌ను, హై కెపాసిటి ట్రాక్షన్ యంత్రలను ఇందుకు వినియోగిస్తారు.

15. డబ్బులు కుమ్మరించే ఇండస్ట్రీ

15. డబ్బులు కుమ్మరించే ఇండస్ట్రీ

పనామా కాలువ నిర్మాణం పూర్తి అయిన తరువాత 1999 వరకు మెయింటెనెన్స్ మరియు రుసుము వసూలును అమెరికా చేసేది. ఆ తరువాత పనామా దేశానికి అప్పగించింది అమెరికా. పూర్తిగా షిప్పింగ్ ఇండస్ట్రీ మీద ఆధారపడిన దేశంగా పనామా నిలిచింది. పనామా కాలువ గుండా ప్రయాణించే అన్ని నౌకల ద్వారా సుమారుగా కొన్ని మిలియన్ డాలర్ల ఆదాయం లభిస్తోంది.

16. ఉపాధి

16. ఉపాధి

ఈ పనామా కాలువ ద్వారా సుమారుగా 14,000 మందికి పైగా ఉపాధి లభించింది. అందులో 5,000 మంది వరకు పనామా దేశానికి చెందిన వారే ఉన్నారు.

17. అద్భుతం వెనుక దాగిన విషాదం

17. అద్భుతం వెనుక దాగిన విషాదం

సమాచార వర్గాల ప్రకారం, దీని నిర్మాణ సమయంలో ప్రతి కూల వాతావరణ పరిస్థితుల కారణంగా భయంకరమైన దోమలు కుట్టి జ్వరాలు ప్రబలి సుమారుగా 25,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అంతే కాకుండా వ్యాధుల బారిన పడ్డ వారిని కూడా ఆ సమయంలో చంపేశారని సమాచారం.

18. విస్తరణ

18. విస్తరణ

ప్రస్తుతం షిప్పింగ్ రవాణా ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది, ఈ కారణంగా షిప్పుల రూపం కూడా మారిపోతోంది. అందు కోసం పనామా దేశం పనామా కాలువను ప్రస్తుతం ఆధునిక నౌకల అవసరార్థం విస్తరించే దిశగా ప్రణాళికలు వేసింది. అందుకోసం 2007 లో పనామా దేశం దీని విస్తరణను చేపట్టింది. అయితే గత ఆదివారం నాడు ఈ విస్తరించిన కాలువను ప్రారంభించారు.

 19. ఉపయోగం

19. ఉపయోగం

ఈ కాలువ ద్వారా 4,500 కంటైనర్లకు పైగా మోసుకెళ్లే నౌకల ఈ విస్తరించిన కాలువ గుండా ప్రయాణించవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పెద్ద కంటైనర్ నౌకలు అన్ని కూడా ఈ కాలువ గుండా ఎంతో సులభంగా ప్రయాణించగలవు. ఈ విస్తరించిన కాలువ సుమారుగా 110 అడుగుల వెడల్పు, 1,000 అడుగుల పొడవు ఉంది.

20. రవాణా వివరాలు

20. రవాణా వివరాలు

పనామా కాలువలో ఈ ఏడాదిలో సుమారుగా 13,000 నుండి 14,000 వరకు నౌకలు ప్రయాణించాయి. అదే విధంగా 1914 నుండి కొన్ని కోట్ల నౌకలు ఈ పనామా కాలువ గుండా ప్రయాణించాయి. ఒక్క 2010 లోనే 10 లక్షల నౌకలు ఈ కాలువ గుండా ప్రయాణించాయి.

21. ప్రయాణ సమయం

21. ప్రయాణ సమయం

ఈ కాలువ రెండు ఖండాలైన ఉత్తర అమెరికా మరియు దక్షిణ అమెరికాలను విడదీస్తోంది. న్యూయార్క్ నుండి శాన్‌ ఫ్రాన్సిస్కో కు వెళ్ళాలంటే, దక్షిణ అమెరికా దక్షిణాగ్రం "కేప్ హార్న్" దగ్గర నుండి 22,500 కి.మీ. ప్రయాణించవలసి ఉంటుంది. కానీ ఈ పనామా కాలువ నిర్మాణం వలన ఈ ప్రయాణ దూరం 9,500 కి.మీ. దూరం వరకు అంటే దాదాపు సగం దూరం తగ్గిపోయింది.

22. మరొక ప్రాజెక్ట్

22. మరొక ప్రాజెక్ట్

పోటీ అనేది ఎలాంటి వాటికైనా సర్వసాధారణమేస, అలాగే పనామా కాలువకు కూడా పోటీ తయారవనుంది. పనామా దేశానికి ఉత్తర భాగంలో ఉన్న నికరగాన్ అనే దేశంలో పనామా కెనాల్ తరహాలో నిర్మించడానికి 2013 లో చైనాకు చెందిన సంస్థ ముందుకు వచ్చినట్లు నికరగావ్ దేశం ప్రకటించింది. అయితే ఇది అందుబాటులోకి వస్తే పనామా కాలువలో నౌకల రద్దీ తగ్గే అవకాశం ఉంది.

23. 365 రోజులు, రోజుకు 24 గంటలు

23. 365 రోజులు, రోజుకు 24 గంటలు

అప్పుడప్పుడు కాలువకు ఇరువైపులా ఉన్న మట్టి జారి కాలువలో పడటం, నిర్వహణ పనులు మరియు ప్రమాదాలు మినహాస్తే పనామా కాలువ 24 గంటలు తెరిచే ఉంటుంది. ఏడాదిలో అన్ని రోజులు కూడా నిరంతరం నౌకలకు ఎంట్రీ ఉంటుంది.

 24. షిప్పింగ్ ఇండస్ట్రీ కేంద్రబిందువు పనామా కెనాల్

24. షిప్పింగ్ ఇండస్ట్రీ కేంద్రబిందువు పనామా కెనాల్

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 160 దేశాలకు సంభందించి ఈ పనామా కాలువతో సంభందాలున్నాయి. దీని ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సుమారుగా 17,000 నౌకాశ్రయాలతో రవాణా సంభందాలున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షిప్పింగ్ ఇండిస్ట్రీకి పనామా కాలువ కేంద్ర బిందువుగా ఉంది.

మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం....

షిప్పింగ్ ఇండస్ట్రీ గురించి ఆసక్తికరమైన విషయాలు

ఇది సింగపూర్ ఎయిర్ పోర్ట్ కాదు : Ap లోని ఒక APSRTC బస్టాండు

టైటానిక్ సినిమా మరియు టైటానిక్ షిప్ మధ్య గల తేడాలు

Most Read Articles

Read more on: #నౌకలు #ships
English summary
Fascinating Facts About The Panama Canal
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X