మద్యం మత్తులో పోలీసులతోనే గొడవకు దిగిన ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ కొడుకు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

రహదారులు, రద్దీ రోడ్లపై రోడ్‌ రేజ్‌ ఘటనలు సర్వసాధారణమైపోతున్నాయి. ఈ గొడవలు వాహనదారుల మధ్యే కాదు.. వాహనదారులు, పోలీసులకు మధ్య కూడా జరుగుతున్నాయి. సోషల్‌ మీడియా పుణ్యమా అని ఇలాంటి సంఘటనలు బయటకు వస్తున్నాయి. ఇటీవల బెంగళూరులో జరిగిన ఓ రోడ్‌ రోజ్‌ ఘటన తెగ వైరల్‌ అవుతోంది.

బెంగళూరులో చదువుతున్న రాహుల్ ఉన్ని కృష్ణన్ అనే విద్యార్థి.. ఇటీవల తన కారులో హెప్పాల అనే ప్రాంతం నుంచి తన ఇంటికి వెళ్తున్నాడు. ఎలహంగా వద్దకు రాగానే తన కారు వెనుక టాటా నెక్సాన్‌ కారు వస్తోంది. టాటా నెక్సాన్‌ కారును ఆడమ్ బిడపా అనే వ్యక్తి నడుపుతున్నాడు. అయితే అతను మద్యం సేవించి కారు నడపుతున్నాడు.

Road-Rage-In-Bengaluru

అంతే కాకుండా మద్యం మత్తులో ఆడమ్‌ బిడపా.. రోడ్డుపై టాటా నెక్సాన్‌ కారును ఇష్టమొచ్చినట్లుగా నిర్లక్ష్యంగా నడుపుతున్నాడు. ఇంకా అదే పనిగా హారన్‌ కొడుతూనే ఉన్నాడు. దీంతో విసుగు చెందిన రాహుల్‌ ఉన్ని కృష్ణన్‌ కారు ఆపడంతో వారిమధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ గొడవ పెద్దది కాగా.. రాహుల్‌ కారు ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాడు.

దీంతో రాహుల్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడి పరిస్థితిని రాహుల్‌.. పోలీసులకు వివరిస్తూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆడమ్ బిడపా తన కారు వెనుకే వస్తూ.. హారన్‌ కొడుతూ విసిగించాడని ఫిర్యాదులో తెలిపారు. అంతే కాకుండా అతనికి ప్రముఖ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయని చెప్పినట్లు వెల్లడించారు. వాగ్వాదంలో తన కారును ఆడమ్‌ ఢీకొట్టినట్లు వివరించారు.

Road-Rage-In-Bengaluru

రాహుల్‌ ఫిర్యాదులో పోలీసులు సంఘటనా స్థలం దగ్గరే విచారణ చేపట్టారు. దీంతో ఆడమ్‌ బిడపా చిక్కుల్లో పడగా.. అసభ్యకరమైన పదజాలంతో పోలీసు అధికారులతో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఆడమ్ బిడపా పోలీసు అధికారులతో వివాదంలో చిక్కుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

కాగా పోలీసులు ఆడమ్‌కు డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించగా.. అతను అతిగా మద్యం సేవించినట్లు తేలింది. దీంతో పోలీసు అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. కానీ ఆ తర్వాత బెయిల్‌పై, విడుదలైనట్లు సమాచారం. అయితే ఇక్కడ అతని గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Road-Rage-In-Bengaluru

ఆడమ్‌ బిడపా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రసాద్ బిడపా కొడుకుగా సమాచారం. ఇతను కొరియోగ్రాఫర్‌గా కూడా సుపరిచితుడు. దీంతో ఈ న్యూస్‌ వైరల్‌ అవుతోంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు మాత్రమే కాకుండా ఇతర సమస్యలు కూడా వస్తాయని గుర్తుంచుకోవాలి.

డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు వీలైనంత వరకు మద్యం సేవించకుండా ఉండటం ఉత్తమం. లేదంటే మద్యం సేవించినప్పుడు వాహనం నడపకుండా.. డ్రైవర్‌ లేదా ట్యాక్సీ సాయంతో ఇంటికి వెళ్లాలి. ఇది వారితో ఇతర ప్రయాణికులకు మేలు చేస్తుంది. దేశంలో మద్యం సేవించి వాహనం నడపడం, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరం.

Road-Rage-In-Bengaluru

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, October 28, 2023, 17:56 [IST]
English summary
Fashion designers son abusing police and arrested for drunk and drive video gone viral
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+