నవంబర్ 1న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7 ట్రైలర్ విడుదల

By Ravi

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆద్యంతం ఉఠ్కంతతో సాగిపోయే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రంలో వస్తున్న 7వ సిరీస్ సీక్వెల్ నిర్మాణం పూర్తయింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది (2015) ఏప్రిల్ 3వ తేదీన విడుదల చేయనున్నారు.

అయితే, అంత కన్నా ముందుగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ట్రైలర్ వీడియోని నవంబర్ 1, 20147వ తేదీన విడుదల చేయనున్నట్లు యూనివర్సల్ స్టూడియోస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో, ఓ పోస్టర్‌ను టీజర్ వీడియోని కూడా ఈ స్టూడియో విడుదల చేసింది.

ఈ 7వ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాన్ని 'ఫ్యూరియస్ 7' అని పిలువనున్నారు. ఈ టీజర్ ఫొటోలో కనిపిస్తున్న పౌల్ వాకర్ చిత్రాన్ని కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా డిజైన్ చేశారు. లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్సల్ స్టూడియోల్‌లో ఈ ట్రైలర్ లాంచ్ జరుగుతుంది.

Fast And Furious 7 Trailer

గడచిన సంవత్సరం (2013) నవంబర్ నెలలో ఫిలీప్పిన్స్ తుపాను బాధితులకు సాయం చేయటం కోసం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన స్నేహితుడితో పాటుగా పోర్షే కరెరా జిటి స్పోర్ట్స్ కారులో వెళ్లిన పౌల్ వాకర్, ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని స్నేహితుడుతో పాటుగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసినదే.

ఫ్యూరియస్ చిత్రంలో పౌల్ వాకర్‌పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు మిగిలి ఉండగానే, అతను ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో, పౌల్ వాకర్ పాత్రను తొలగించాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఈ చిత్రాన్ని అతడికి అంకితమివ్వాలనే ఉద్దేశ్యంతో, పౌల్ వాకర్ పాత్రను అలానే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే, కంప్యూటర్ గ్రాఫిక్స్ సాయంతో పౌల్ వాకర్‌ను తిరిగి సృష్టించారు.

ఇందుకోసం పౌల్ వాకర్ బాడీ డబుల్స్ (పౌల్ వాకర్‌కు డూప్లికేట్స్)ను కూడా ఉపయోగించారు. అంతేకాకుండా.. పౌల్ వాకర్ గొంతును అనుకరించేందుకు కూడా సన్నాహాలు చేశారు. ఈ చిత్రంలో పౌల్ వాకర్ క్యారెక్టర్ బ్రియాన్ ఓ కార్నర్. ఇది పౌల్ వాకర్ నటించిన ఆఖరి చిత్రం కావటంతో దీనిని వీక్షించేందుకు ప్రవంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/9LVBV0exH5A?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Tuesday, October 28, 2014, 14:08 [IST]
English summary
The Fast and The Furious street-racing franchise has recently announced the official release date of the movie’s trailer. Set for the 1st of November, it will be posted on the movie’s Facebook page. &#13;
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+