ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 8 వ సిరీస్ మూవీలో వినియోగించిన కార్లు

Written By:

దేశీయ ఆటోమొబైల్ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్ సినిమా ఇండియాలో ప్రదర్శించబడింది. ఈ చిత్రంలో వినియోగించిన కార్ల గురించి తెలుసుకుందాం రండి.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

హాలీవుడ్‌కు చెందిన ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్ ఇండియాలో ప్రదర్శించబడింది. ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ (విధి యొక్క ఉద్వేగం) అనే అనే పేరుతో విడుదలైన 8వ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ఫెలిక్స్ గ్యారీ గ్రే మలిచారు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

ఈ చిత్రంలో చోటు చేసుకునే ఉత్కంఠభరితమైన కారు స్టంట్లను వీక్షించేందుకు ప్రపంచ వ్యాప్తంగ ఆటోమొబైల్ ప్రేమికులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తికగా ఎదురుచూసారు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ మునుపటి సిరీస్‌లలోని నటీనటులు చేసిన నమ్మశక్యం గాని కార్ల స్టంట్లు అందరినీ నివ్వెరపరిచాయి. అయితే ఈ ఎనిమిదవ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లోని స్టంట్లు మునుపటి వాటితో పోల్చుకుంటే పెద్ద తేడా ఏమీలేదు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

వేగం మరియు ఉద్వేగం ఎనిమిదివ సిరీస్ మూవీలోని తారాగణం భారీ ఖరీదైన కార్లనే వినియోగించారు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

అమెరికాకు చెందిన కండలు తిరిగిన కార్ల నుండి ఇటలీలోని సూపర్ కార్లతో పాటు కొన్ని భయంకరమైన మిలిటరీ వాహనాల వరకు అనేక విభిన్నమైన వాహనాలను ఇందులో వినియోగించారు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

వేగం మరియు ఉద్వేగం సినిమాలోని ప్రధాన పాత్ర డామినిక్ టోరెట్టో గా విన్ డీజల్ నటించారు. ఈయన సినిమా మొత్తం డోడ్జి ఛార్జర్ కారును నడిపారు. అయితే మనం సాధారణంగా చూసే ఛాలెంజర్ కన్నా చాలా విభిన్నమైనది.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

నిజానికి దీనికి భారీ చార్జింగ్ చేశారని చెప్పవచ్చు. సాధారణ డోడ్జి ఛార్జర్ ఎక్ట్సీరియర్‍‌లో భారీ మార్పులు చేసి అనేక మోడిఫికేషన్లు చేసారు. స్టీల్ రూఫ్ రెయిల్ మరియు ఏ-పిల్లర్ ఇందులో ప్రధానంగా గుర్తించవచ్చు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

మోడిఫికేషన్స్ అనంతరం ఈ డోడ్జి ఛార్జర్ భయంకరమైన భారీ యంత్రంగా కనిపిస్తుంది. దీనిని ఆల్ వీల్ డ్రైవ్ డ్రిఫ్టింగ్ మెషీన్(కారు) అని చెప్పవచ్చు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఓ వర్క్ షాపు ఈ ఎనిమిదవ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రం కోసం సుమారుగా 300 కార్లకు పైగా అసెంబుల్ చేసినట్లు సమాచారం.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

ఎనిమిదవ సిరీస్ వేగం మరియు ఉద్వేగం సినిమాలో ప్రధానంగా గుర్తించనదగిన ఇతర కార్లలో 1966 కార్వెట్టీ స్టింగ్‌రే మరియు సుబారు బిఆర్-జడ్ కార్లు ఉన్నాయి.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

ఈ సినిమా షూటింగ్ కోసం ఒక్కో మోడల్ కారును నాలుగు సంఖ్యలో సిద్దం చేసుకున్నారు. షూటింగ్ సమయంలో ఓ కారు పూర్తిగా ధ్వంసం అయితే మరో కారును షూటింగ్ పూర్తి చేయడానికి ఉపయోగించుకున్నారు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

అందులో భాగంగా నాలుగు సుబారు బిఆర్-జడ్ కార్లను నిర్మించుకుంటే అందులో ఒకటి పూర్తిగా ధ్వంసం కాగా మిగిలిన మూడింటిని చిత్రంలో వినియోగించుకున్నారు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

ఇవే కాకుండా ఇందులో ఈ చిత్రంలో మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్, షెవర్లే, లాంబోర్గినీ, డోడ్జి వంటి తయారీ సంస్థలకు చెందిన ప్రధాన కార్లను ఇందులో ఉపయోగించారు.

ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఎనిమిదవ సిరీస్‌లో ఉపయోగించిన కార్ల వివరాలు

చిత్రంలోని మంచు ప్రదేశంలో జరిగే సన్నివేశంలో ఓ భారీ ఫైటింగ్ ఉంటుంది. అందులో ప్రత్యర్థుల్ని ఎదుర్కునేందుకు మంచు గర్భంలో నుండి పైనున్న వారిని నాశనం చేసేందుకు సబ్‌మెరైన్ వినియోగించాడు దర్శకుడు.

English summary
Read In Telugu to know about Fast And Furious 8 Premiers In India And Here Are Some Cars To Look Forward

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark