ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమా పూర్తి, ఏప్రిల్ 3న విడుదల

By Ravi

మీకు 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్' సినిమా ఇష్టమా..? మీరు పౌల్ వాకర్‌కు వీరాభిమానా..? అయితే, మీ అభిమాన హీరో నటించిన చివరి సినిమాను చూసేందుకు మరో ఆరు నెలల వేచి ఉండండి. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7వ సిరీస్ సీక్వెల్ చిత్ర నిర్మాణం పూర్తయిందని, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆ చిత్ర బృందం ప్రకటించింది.

పవర్‌ఫుల్ కార్లతో ప్రమాదకరమైన అడ్వెంచర్‌లు చేస్తూ సాగిపోయే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సినిమాలకు ప్రపవంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ చిత్రంలోని కీలకన నటుడు పౌల్ వాకర్ ఇటీవల ఓ కారు ప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఇది పౌల్ వాకర్ నటించిన ఆఖరి చిత్రం కావటంతో దీనిని వీక్షించేందుకు ప్రవంచ వ్యాప్తంగా ఆయన అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

గడచిన సంవత్సరం నవంబర్ నెలలో పాల్‌ వాకర్‌ (Paul Walker) ఫిలీప్పిన్స్ తుపాను బాధితులకు సాయం చేయటం కోసం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన స్నేహితుడి పోర్షే కరెరా జిటి స్పోర్ట్స్ కారులో వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పౌల్ వాకర్ మరియు అతని స్నేహితుడు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసినదే.

Fast And Furious

యూనివర్సల్ స్టూడియో తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఫాస్ట్ అండ్ ఫ్యూయిరియస్ 7వ ఇన్‌స్టాల్‌మెంట్ నిర్మాణం పూర్తయిందని, ఈ సినిమాని ఏప్రిల్ 3, 2015న థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించింది. ఇందులో పౌల్ వాకర్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉండగానే ఆయన మృతి చెందడంతో, కంప్యూటర్ గ్రాఫిక్స్ మరియు అతని సోదరుడు కోబీ సాయంతో ఈ సినిమాలో తిరిగి పౌల్ వాకర్‌కు జీవం పోశారు.

ఈ చిత్రంలో బ్రియాన్ ఓ కార్నర్ (పౌల్ వాకర్ పోషిస్తున్న పాత్ర పేరు)ను ఇక ఈ సిరీస్ చిత్రాల నుంచి తొలగించేందుకు గాను ఈ సినిమా స్క్రిప్టులో మార్పులు చేశారు. అంటే, ఇకపై రానున్న రోజుల్లో బ్రియాన్ ఓ కార్నర్ పాత్ర లేకుండానే మరిన్ని సీక్వెల్స్‌ను తీయవచ్చన్నమాట. మరి మీరు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా..?

More from DriveSpark

Article Published On: Friday, July 11, 2014, 15:19 [IST]
English summary
Universal Pictures has confirmed that, they completed the last shot in the production of Fast & Furious. The 7th installment of Fast & Furious will hit theaters worldwide next year on April 3rd.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+