ఇండోనేషియా పోలీసుల కోసం లాంబోర్గినీ సూపర్‌కార్లు
పోలీసులు సూపర్‌కార్లను ఉపయోగించే దేశం ఏది అంటే మనకు టక్కున దుబాయ్ గుర్తుకు వస్తుంది. దుబాయ్ పోలీసుల గ్యారేజ్‌లు అనేక రకాల సూపర్‌కార్లు కొలువుదీరున్నాయి. అయితే, తాజాగా ఇండోనేషియా కూడా దుబాయ్‌తో పోటీపడేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇండోనేషియన్ పోలీసులుకు కూడా తమ కలెక్షన్‌లో లాంబోర్గినీ అవెంటేడర్, లాంబోర్గినీ గల్లార్డో కార్లను చేర్చుకున్నారు. ఇండోనేషియన్ అధికారిక పోలీసు వాహనాలపై ఉండే డిజైన్‌తో ఈ రెండు కార్లను డిజైన్ చేసి, ఓ షాపింగ్ మాల్‌లో ప్రదర్శనకు ఉంచారు.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో ఇండోనేషియన్ పోలీస్ లేటెస్ట్ సూపర్ కార్ కలెక్షన్ గురించి తెలుసుకోండి.

లాంబోర్గినీ అవెంటేడర్ కారును వైట్, బ్లూ, రెడ్ కలర్ కాంబినేషన్లతో పెయింట్ చేసి దానిపై ఇండోనేషియన్ పోలీస్ బ్యాడ్జింగ్‌ను డిజైన్ చేశారు.

అలాగే, లాంబోర్గినీ గల్లార్డో కారును మ్యాట్ బ్లాక్, యల్లో కలర్ కాంబినేషన్లతో పెయింట్ చేసి దానిపై ఇండోనేషియన్ పోలీస్ బ్యాడ్జింగ్‌ను డిజైన్ చేశారు.

ఇండోనేషియన్ పోలీసులు ఈ సూపర్‌కార్లను కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉపయోగిస్తారా లేక వీటిని నిత్యం పెట్రోలింగ్ కోసం ఉపయోగిస్తారా అనేది తెలియాల్సి ఉంది.

లాంబోర్గినీ అవెంటేడర్‌లో 6.5 లీటర్ వి12 ఇంజన్‌ను ఉపయోగించారు. దీని గరిష్ట పవర్ 691 బిహెచ్‌పిలు. ఇది కేవలం 2.9 సెకండ్లలోనే 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది గరిష్టంగా గంటకు 351 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీస్తుంది.

ఇటాలియన్ సూపర్‌కార్ కంపెనీ లాంబోర్గినీ తొలిసారిగా 2003లో తమ గల్లార్డో కారును ప్రపంచానికి పరిచయం చేసింది. లాంబోర్గినీ 1963 నుంచి ఇప్పటి వరకు సుమారు 30,000 కార్లకు పైగా విక్రయిస్తే, అందులో 14,022 కార్లు గల్లార్డో మోడళ్లే ఉన్నాయంటేనే, ఈ మోడల్ ఎంతటి గొప్ప సక్సెస్‌ను సాధించిందో ఇట్టే అర్థమైపోతుంది.

లాంబోర్గినీ గడచిన సంవత్సరంలో గల్లార్డో ఉత్పత్తిని నిలిపి వేసింది. లాంబోర్గినీ గల్లార్డో కారులో 5.2 లీటర్ వి10 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇకపై లాంబోర్గినీ గల్లార్డో కార్లను ఉత్పత్తి చేయబోదు. అయితే, గల్లార్డో స్థానాన్ని రీప్లేస్ చేసేందుకు లాంబోర్గినీ ఓ సరికొత్త సూపర్‌కారును పరిచయం చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








