పౌల్ వాకర్ చివరి చిత్రం 'ఫ్యూరియస్ 7' ట్రైలర్ విడుదల
ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్ర అభిమానులకు వీనుల విందు కలిగించేందుకు ఆ చిత్ర నిర్మాతలు ట్రైలర్ వీడియోని నవంబర్ 1, 2014న విడుదల చేశారు. యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ విడుదలైన రెండు రోజుల్లోనే కోటి మందికి పైగా అభిమానులు దీనిని వీక్షించారు. అద్భుతమైన స్టంట్స్, వళ్లు గగుర్పొడిచే కార్ రేస్‌లతో ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచనుంది.
ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు, త్వరపడండి!
ఈ చిత్రాన్ని ఏప్రిల్ 3, 2015వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ 7వ సిరీస్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చిత్రాన్ని 'ఫ్యూరియస్ 7' అని పిలువనున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరో వైపు ఇది పౌల్ వాకర్ నటించిన చివరి చిత్రం కావటం కూడా ఈ సినిమా సక్సెస్ కావటానికి మరో కారణం కావచ్చు. మరి ఆ ఫ్యూరియస్ 7 ట్రైలర్ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Skpu5HaVkOc?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>
గడచిన సంవత్సరం (2013) నవంబర్ నెలలో ఫిలీప్పిన్స్ తుపాను బాధితులకు సాయం చేయటం కోసం నిధుల సేకరణకు శాంతా క్లారిటాలో ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు తన స్నేహితుడితో పాటుగా పోర్షే కరెరా జిటి స్పోర్ట్స్ కారులో వెళ్లిన పౌల్ వాకర్, ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని స్నేహితుడుతో పాటుగా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసినదే.


Click it and Unblock the Notifications








