ఇక నో టోల్ టెన్షన్.. యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ ఎలా తీసుకోవాలి.. ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలివే
ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల కోసం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఒక అదిరిపోయే కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. అదే.. ఫాస్టాగ్ బేస్డ్ యాన్యువల్ హైవే టోల్ పాస్. ఇది కారు, జీప్, వ్యాన్ వంటి నాన్ కమర్షియల్ వెహికల్స్‌కు మాత్రమే వర్తిస్తుంది. ఈ పాస్‌తో ఇకపై టోల్ ఫీజులు చెల్లించడానికి FASTag కార్డును మళ్ళీ మళ్ళీ రీఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఇది మీ ప్రయాణాన్ని చాలా సులభతరం చేస్తుంది. అంతేకాదు, మీ జేబుకు భారీగా డబ్బును ఆదా చేస్తుంది. మరి ఈ కొత్త వార్షిక FASTag పాస్ గురించి, దానిని ఎలా పొందాలి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ యాన్యువల్ FASTag పాస్ అన్ని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద ఉపయోగించవచ్చు. అయితే, ఇది రాష్ట్ర లేదా ప్రైవేట్ హైవేలపై వర్తించదు. ఈ కొత్త పాస్ పొందడానికి మీరు రూ.3,000 చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఒక సంవత్సర కాలానికి లేదా 200 ట్రిప్పులకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
అంటే, సంవత్సర కాలం లేదా 200 ట్రిప్పులు పూర్తయిన తర్వాత మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. దీని ద్వారా సంవత్సరానికి రూ.5,000 నుండి రూ.7,000 వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చని అంచనా. ఈ యాన్యువల్ FASTag పాస్ మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌తో లింక్ చేయబడి ఉండాలి.

మీరు ఈ పాస్‌ను కారు, జీప్ లేదా వ్యాన్ విండ్‌షీల్డ్‌పై అతికించాలి. అంతేకాకుండా, ఇది ఒక వాహనం నుండి మరొక వాహనానికి మార్చడానికి వీలు లేదు. ఒకవేళ అలా చేస్తే, అది ఆటోమేటిక్‌గా నిలిచిపోతుంది. అంటే ఈ పాస్ కేవలం మీరు రిజిస్టర్ చేసిన వాహనానికి మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ఈ యాన్యువల్ FASTag పాస్ తీసుకోవడం తప్పనిసరి కాదు, కేవలం ఒక ఐచ్ఛికం మాత్రమే. రహదారి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (Ministry of Road Transport & Highways) దీనిని వాహన యజమాని కోరుకుంటేనే తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఒకవేళ ఈ పాస్ లేకపోతే, యథావిధిగా సాధారణ ఫాస్టాగ్ ఉపయోగించి టోల్ ఫీజు చెల్లించవచ్చు. కాబట్టి, ఎప్పటిలాగే టోల్ ప్లాజా వద్ద లైన్‌లో నిలబడకుండా మీ ప్రయాణాన్ని సులభతరం చేయాలనుకునేవారికి ఇది ఒక మంచి ఆప్షన్.

వార్షిక FASTag పాస్ ఎలా పొందాలి?
ఈ పాస్ పొందడం చాలా సులభం. మీరు ఆన్‌లైన్‌లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
స్టెప్ 1: మొదట, రాజ్‌మార్గయాత్ర యాప్ (Android/iOS) లేదా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వెబ్‌సైట్‌లోకి వెళ్ళండి.
స్టెప్ 2: మీ మొబైల్ నంబర్‌తో లాగిన్ అవ్వండి. ఆ తర్వాత, యాప్‌లో కావలసిన భాషను ఎంచుకోండి. ఇది కన్నడ, హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగు, మరాఠీ, మలయాళంతో సహా వివిధ భాషలలో అందుబాటులో ఉంది. వాహనం రిజిస్ట్రేషన్‌తో సహా ఇతర వివరాలను నమోదు చేయండి.
స్టెప్ 3: మీరు అందించిన సమాచారం అంతా సరైనదేనా అని ఒకటికి రెండుసార్లు సరిచూసుకోండి.
స్టెప్ 4: యాప్ లేదా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న చెల్లింపు ఆప్షన్‌ను ఉపయోగించి రూ.3,000 రుసుమును చెల్లించండి.
స్టెప్ 5: చెల్లింపు విజయవంతమైన తర్వాత, మీ వార్షిక పాస్ మీ FASTag ఖాతాతో 2 గంటల్లో లింక్ అవుతుంది. ఈ విషయం మీకు ఎస్ఎంఎస్ ద్వారా నిర్ధారణ సందేశం అందుతుంది.
మొత్తంగా, ఈ యాన్యువల్ ఫాస్టాగ్ పాస్ సిస్టమ్ ప్రైవేట్ వాహన యజమానులకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. దీనివల్ల చాలా డబ్బు ఆదా అవుతుంది. అంతేకాకుండా, టోల్ ప్లాజాల వద్ద వెయిటింగ్ పిరియడ్ తగ్గుతుంది. ఈ సిస్టమ్ మీ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తుంది అనడంలో సందేహం లేదు.


Click it and Unblock the Notifications








