ఇకపై ఫాస్టాగ్‌ రీఛార్జ్‌ చేయాల్సిన పనిలేదు.. ఎలాంటి ఆందోళన లేకుండా ముందుకు సాగండి!

భారతదేశంలో ఫాస్టాగ్ వినియోగదారులు ఇకపై ఆటో పేమెంట్ ఆప్షన్‌ని ఎంచుకోవచ్చు. ఇప్పటి వరకు చేస్తున్న మాన్యువల్ రీఛార్జ్‌ని కూడా కొనసాగించవచ్చు. అయితే కొన్ని అత్యవసర సమయాల్లో రీఛార్జ్‌ చేయడం మర్చిపోవడం వల్ల రెట్టింపు అమౌంట్‌ని చెల్లించాల్సి చేయాల్సి వస్తుంది. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఈ చర్యలు తీసుకుంది. ఫాస్టాగ్ కార్డులోని మీ బ్యాలెన్స్‌ తగినంత బ్యాలెన్స్ లేని సందర్భాల్లో మీరు రీఛార్జ్‌ చేసుకోకున్న అవసరం లేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం ఫాస్టాగ్‌ వినియోగదారులు ఇ-మాండేట్‌ (e-Mandate) ఆప్షన్‌ని ఎనేబుల్‌ చేసుకోవడం ద్వారా లింక్ చేసిన బ్యాంక్ ఖాతా నుంచి అమౌంట్‌ ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది. దీనికి సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

ప్రస్తుతం, భారతదేశం అంతటా జాతీయ రహదారులపై టోల్ ప్లాజాల వద్ద చెల్లించడానికి వాహనదారులు ఫాస్టాగ్ కార్డులను ఉపయోగిస్తున్నారు. ఫాస్టాగ్ కార్డు లేకుండా వాహనం టోల్ ప్లాజా దాటాలంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారతదేశంలో 99 శాతం వాహనదారులకు ఫాస్టాగ్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. అయితే కొందరు వాహనదారులు రెట్టింపు ఛార్జీలు చెల్లించి టోల్ ప్లాజాలను దాటుతున్నారు.

Fastag Auto Recharge

దీనికి గల కారణాలపై ఆరా తీయగా ఫాస్టాగ్ కార్డులో బ్యాలెన్స్ లేకపోవడంతో వాహనదారులు ఈ ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించారు. ఎమర్జెన్సీ సందర్భాల్లో ఫాస్టాగ్ రీఛార్జ్‌ చేయకపోవడం వల్ల టోల్ ప్లాజా దగ్గరకు రాగానే డబ్బులు లేక తప్పనిసరి పరిస్థితుల్లో రెండు రెట్లు అధిక ఫీజు చెల్లిస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో సమయం వృధా కావడమే కాకుండా ప్రయాణికులకు చికాకు చెందుతున్నారు.

ఈ సమస్యను లోతుగా పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు దానికి పరిష్కారం చూపే దిశగా సరికొత్త మార్గాన్ని కనుగొనింది. దీని ప్రకారం ఇప్పుడు ఫాస్టాగ్ కార్డులు జారీ చేసిన కంపెనీలు ఫాస్టాగ్ కార్డులోని డబ్బు తక్కువగా ఉంటే వాహనదారుల బ్యాంకు ఖాతా నుంచి కొంత మొత్తాన్ని ఆటోమేటిక్‌గా రీఛార్జ్ చేసే విధంగా ఇ-మాండేట్‌ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా ఆటోమేటిక్‌గా మనీ డెబిట్‌ అవుతుంది.

Fastag Auto Recharge Enabled

ఇందుకోసం ఈ-మాండేట్ రూపంలో ఫాస్టాగ్ కార్డును రీఛార్జ్ చేసుకునే టెక్నాలజీని ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఈ ప్రక్రియను అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అయితే వినియోగదారులు తప్పనిసరిగా ఇ-మాండేట్‌ని సబ్ స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పటిలాగానే మాన్యువల్‌గా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. మాన్యువల్‌గా రీఛార్జ్ చేసుకోవడానికి ఇష్టపడని వారు ఇ-మాండేట్ ద్వారా ఆటోమేటిక్ రీఛార్జ్ టెక్నాలజీని యాక్టివేట్ చేసుకోవచ్చు.

మీ ఫాస్టాగ్ బ్యాలెన్స్ రీఛార్జ్ చేయడానికి అవసరమైన మొత్తాన్ని కలిగి ఉండి అప్పటికే మీరు ఇ-మాండేట్‌ని యాక్టివేట్ చేసి ఉంటే ఆ మొత్తం నేరుగా మీ బ్యాంక్ ఖాతా నుంచి కట్‌ అవుతుంది. ఇది ఆటోమేటిక్‌గా ఫాస్టాగ్ కార్డ్ బ్యాలెన్‌లో యాడ్‌ అవుతుంది. ఇది వినియోగదారులకు ఆప్షనల్‌గానే ఉంటుంది. కాబట్టి దీనిపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన పనిలేదు.

Fastag Auto Recharge Enabled

ఉదాహరణకు మీకు రూ .200 కంటే తక్కువ ఫాస్టాగ్ కార్డ్ బ్యాలెన్స్ ఉన్న సందర్భాల్లో రూ .1000 రీఛార్జ్ చేయాలని ఆటోపేమెంట్‌గా సెట్‌ చేసినట్లైతే మీ బ్యాలెన్స్ రూ .200 కంటే తగ్గినప్పుడు మీ బ్యాంక్ ఖాతా నుంచి రూ .1000 ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది. ఆ తర్వాత ఫాస్టాగ్ బ్యాలెన్స్‌లో ఆ అమౌంట్‌ రిఫ్లెక్ట్‌ అవుతుంది.

నేడు భారతదేశంలో చాలా మంది వాహనదారులు టోల్ ప్లాజాల వద్ద టోల్ చెల్లించడంలో వివిధ రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడం స్వాగతించదగ్గ విషయం. దీంతో భారత్‌లో టోల్‌ప్లాజాల వద్ద అధిక రుసుము చెల్లించే వారి సంఖ్య తగ్గుతుందని ఆశించవచ్చు. అతి త్వరలోనే భారత్‌లో జీపీఎస్‌ సిస్టమ్‌ ద్వారా మీరు రోడ్డుపై ప్రయాణించిన దూరానికే టోల్‌ అమౌంట్‌ కట్ అవ్వనుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, August 27, 2024, 13:07 [IST]
English summary
Fastag auto recharge e mandate enabled check details in telugu
Read more on: #auto news #off beat #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+