FASTAG KYC అప్‌డేట్‌ చేసేందుకు ఇవాళే లాస్ట్‌ ఛాన్స్‌... లేదంటే ఖాతాలు డియాక్టివేట్‌ అవుతాయి..!

గతంలో టోల్‌ ప్లాజాల వద్ద వందలాది వాహనాలు గంటల కొద్ది నిరీక్షించాల్సి వచ్చేది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు 2016లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని కొన్ని టోల్‌ ప్లాజాల వద్ద FASTAG వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. 2021లో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకొంది.

ఈ విధానం ద్వారా రేడియా ఫ్రీక్వేన్సీ ఐడెంటిఫికేషన్‌ టెక్నాలజీ ఆధారంగా టోల్‌ ప్లాజాల వద్ద ఆటోమేటెక్‌గా పేమెంట్ జరిగిపోతుంది. ఈ విధానం అమల్లోకి వచ్చాక సుమారు అన్ని టోల్‌ ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ భారీగా తగ్గింది. ప్రయాణికుల వాహనాల్లో సుమారు 97 శాతం వాటికి ఫాస్టాగ్‌ ఉన్నట్లు సంబంధిత మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

update fastag KYC 31 january 2024

నేషనల్‌ హైవేస్‌ ఆథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) ఇటీవల 'వన్‌ వెహికల్‌ - వన్‌ ఫాస్ట్‌ట్యాగ్‌' కార్యక్రమాన్ని ప్రారంభించింది. టోల్ వసూలు సామర్థ్యం పెంపు సహా ఫాస్ట్‌ట్యాగ్‌ దుర్వినియోగం కాకుండా చూడడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. అయితే RBI ( రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) మార్గదర్శకాలకు ప్రకారం అనుగుణంగా KYC పూర్తిచేయని ఖాతాలు జనవరి 31 తర్వాత డియాక్టివేట్‌ చేయబడతాయని NHAI వెల్లడించింది.

వాహనదారులు ఇవాళే తమ ఫాస్ట్‌ట్యాగ్‌ KYC సమాచారాన్ని అప్‌డేట్‌ చేయాలని లేకుంటే.. ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్‌ ఉన్నాగానీ అకౌంట్‌ డియాక్టివేట్‌ కానుందని హెచ్చరించింది. ఇవాళే ఆఖరు తేదీ కనుక.. వాహనదారులు వెంటనే తమ ఫాస్ట్‌ట్యా్గ్‌ KYC అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. కేవైసీని ఎలా అప్‌డేట్‌ చేయాలి, ఏయే పత్రాలు కావాలని తెలుసుకొనేందుకు ఈ కథనాన్ని చదవండి.

FASTAG become invalid

ఫాస్ట్‌ట్యాగ్‌ KYC అప్‌డేట్‌ చేసే విధానం..
Step 1 : FASTAG అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లండి.
Step 2 : వెబ్‌సైట్‌లోకి వెళ్లిన తర్వాత రిజిస్టర్డ్‌ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ద్వారా లాగిన్‌ అవ్వండి.
Step 3 : అక్కడ కనిపించే డ్యాష్‌బోర్డు మెనుపైన క్లిక్‌ చేయండి. అనంతరం KYC ట్యా్బ్‌ను ఎంచుకోండి.
Step 4 : KYC ట్యాబ్‌లో అవసరం అయిన సమాచారాన్ని నమోదు చేయండి. అనంతరం సమాచారాన్ని తనిఖీ చేసి, ద్రువీకరించండి. చివరగా సమర్పించు (Submit) పైన క్లిక్‌ చేయండి.
Step 5 : అప్పుడు మీ ఫాస్ట్‌ట్యాగ్‌ KYC అప్‌డేట్‌ పూర్తయినట్లు చూపిస్తుంది.

ఫాస్ట్‌ట్యాగ్‌ KYC కోసం ఏయే పత్రాలు అవసరం అంటే..
ఫాస్ట్‌ట్యాగ్‌ KYCను అప్‌డేట్‌ చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం అవుతాయి. వాటిలోని వివరాలను అప్‌డేట్‌ సమయంలో నమోదు చేయాల్సి ఉంటుంది.
- వాహనదారుడి గుర్తింపు కార్డు
- వాహన రిజిస్ట్రేషన్‌ సర్టిఫికేట్‌ (RC)
- చిరునామాకు సంబంధించిన పత్రాలు
- పాస్‌పోర్ట్‌ సైజు ఫోటో

ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాలెన్స్‌ను ఎలా తనిఖీ చేయాలి :
వాహనదారులు తమ ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాలెన్స్‌ను ఆన్‌లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా యాప్‌, వివిధ పేమెంట్ యాప్‌ల ద్వారా కూడా మీ ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాలెన్స్‌ను తెలుసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో My Fastag యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయాలి. అందులో లాగిన్‌ చేయండి. ఆ యాప్ ద్వారా ఫాస్ట్‌ట్యాగ్‌ బ్యాలెన్స్‌ను తనిఖీ చేయవచ్చు.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, Threads, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from DriveSpark

Article Published On: Wednesday, January 31, 2024, 15:35 [IST]
English summary
Fastag kyc must be done before 31 january 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+