Fastag అలర్ట్.. టోల్‌గేట్ల వద్ద నయా మోసం.. ఫాస్టాగ్ లోంచి అధిక డబ్బు కట్.. పోరాడి కేసు గెలిచిన ఓ వ్యక్తి!!
దేశంలో ఫాస్టాగ్ సౌకర్యం వచ్చినప్పటి నుంచి టోల్‌గేట్ల వద్ద గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం తప్పింది. ఫాస్ట్ టాగ్ అందులో అందుబాటులోకి రాకముందు గతంలో వివిధ రాష్ట్రాల్లో పలు రద్దీ టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు భారీగా ఉండేవి. మరి ముఖ్యంగా పండగలు, ఎక్కువ రోజులు సెలవులు వచ్చినప్పుడు టోల్ గేట్ ల వద్ద రద్దీ ఎక్కువ కనిపిస్తుంది.
ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ద్వారా ప్రయాణికులు క్షణాల్లో టోల్ గేట్ వద్ద ఎలాంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళవచ్చు. అంతకు ముందు టోల్ గేట్ల వద్ద డబ్బులు వసూలు చేసే క్రమంలో వివిధ టోల్ గేట్ల నిర్వాహకులు తమకు నచ్చిన విధంగా ఛార్జీలు వసూలు చేసేవారు.

ఇదే విషయంలో ప్రయాణికుల నుంచి పలు ఫిర్యాదులు అందాయి. టోల్ బూత్ ల వద్ద అవకతవకలను నివారించడానికి, టోల్ చెల్లించడానికి పట్టే సమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఫాస్టాగ్ ను ప్రవేశపెట్టింది. దేశంలో ప్రస్తుతం టోల్ గేట్ ల వద్ద ఫాస్టాగ్ విధానం వాడుకలో ఉంది. ఇది ప్రయాణీకులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. కేవలం ఒక్క ఆటోమేటిక్ స్కాన్ ద్వారా నిర్దిష్ట చెల్లింపు చేయవచ్చు.
మధ్యవర్తులు (టోల్ కలెక్టర్లు) అవసరం లేని ఈ విధానంలో నిర్ణీత అమౌంట్. ఒక్కసారి ఫాస్టాగ్ అమల్లోకి వస్తే టోల్ గేట్ ల వద్ద ఎలాంటి అవకతవకలకు తావు ఉండదని ప్రభుత్వం తెలిపింది. అయితే తాజాగా ఫాస్ట్ టాగ్ లోను గోల్ మాల్ జరిగింది. చాలామందికి తెలియకుండానే గోల్ మాల్ జరుగుతున్నట్లు ఇటీవల ఓ వ్యక్తి ద్వారా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ అంశం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

బెంగళూరులోని గాంధీనగర్ కు చెందిన సంతోష్ కుమార్ 2020లో చిత్రదుర్గలోని జాతీయ రహదారిపై రెండుసార్లు ప్రయాణించాడు. ఒక్కో టోల్ పాయింట్ నుంచి రూ.35 ఫీజుకు బదులు రూ.40 నగదు కట్ అయ్యింది. ఈ లెక్క ప్రకారం సంతోష్ కుమార్ రెండుసార్లు టోల్ ప్లాజాను దాటితే రూ.70 తగ్గింపు జరగాలి. దానికి భిన్నంగా సింగిల్ ప్రయాణానికి రూ.5 చొప్పున మొత్తం రూ.10 అధికంగా వసూలు చేశారు.
మీలో చాలామందికి రూపాయలు 10 అనేది చాలా చిన్న అంశమే అయి ఉండవచ్చు. అయితే నిత్యం లక్షల్లో వాహనాలు టోల్ గేట్ లను దాటి వెళ్ళవలసి వస్తుంది. అంటే ఈ గోల్ ఎంత పెద్దదో మీరే అర్థంచేసుకోండి. ఈ విషయంపై ఫాస్టాగ్ ఖాతాను తనిఖీ చేసినప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో షాక్ కు గురైన అతడు టోల్ ప్లాజాకు అదనంగా రూ.5 వసూలు చేస్తున్నట్లు గుర్తించాడు. అధిక అమౌంట్ వసూలుపై నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు.

అతని ఫిర్యాదును స్థానిక టోల్ గేట్ ప్రాజెక్టు మేనేజర్, కమిషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయంపై వివరణ ఇవ్వలేదు. దీనికి తోడు అధిక చార్జీలను తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నాగ్ పూర్ లోని జాస్ టోల్ రోడ్డు కంపెనీ ప్రాజెక్టు డైరెక్టర్, చిత్రదుర్గ హైవేస్ అథారిటీపై సంతోష్ కుమార్ జిల్లా వినియోగదారుల కోర్టులో ఫిర్యాదు చేశారు. సంతోష్ కుమార్ స్వయంగా తన కేసును స్వీకరించి ఈ కేసుపై వాదించి విజయం సాధించారని సమాచారం.
అదనంగా వసూలు చేసిన రూ.10 తిరిగి ఇవ్వాలని జిల్లా వినియోగదారుల కోర్టు ఆదేశించింది. సంతోష్ కుమార్ కి రూ.8 వేలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కేంద్ర తెలిపిన రుసుము మాత్రమే వసూలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇకపై ఇలాంటి చర్యలకు ఉపక్రమిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించింది.


Click it and Unblock the Notifications








