ప్రతి దశాబ్దంలో ఉన్న వేగవంతమైన కార్లు: 1880 నుండి నేటి వరకు

By N Kumar

ప్రస్తుతం కాలంలో ఆటోమొబైల్స్ మానవులకు నిత్యావసర వస్తువులు మారిపోయాయి. ప్రపంచానికి ఆటో మొబైల్స్ పరిచయం అయిన తరువాత వీటిని వివిద రకాల అవసరాలకు వినియోగించడం మొదలు పెట్టారు. ఆటో మొబైల్స్ ప్రజా రవాణాలో కీలక పాత్రను పోషిస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ద్విచక్ర వాహనాల నుండి విమానాల వరకు అన్ని కూడా ప్రయాణాలకు ఉపయోగపడుతున్నాయి.

అవసరాన్ని బట్టి ద్విచక్రవాహనం, కారు, బస్సు, రైలు, విమానం ఇలా దూరాన్ని మరియు కాలాన్ని అంచనా వేసుకుని ప్రయాణ సాధనాలను ఎంచుకుంటున్నాం ఇది ఈ కాలంలోని మాట. మరి గత నాలుగైదు దశాబ్దాల పాటు రవాణాకోసం ఉపయోగించిన కార్లలో అత్యంత వేగవంతమైన వాటి గురించి క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

1880-1889

1880-1889

ఈ కాలంలో అత్యంత వేగవంతమైన కారు బెంజ్ మోటార్ వ్యాగన్. దీని గరిష్ట వేగం గంటకు 10 మైళ్లు. గుర్రపు బండి వేగం కన్నా ఇది ఎంతో తక్కువ. కాని ఆ కాలంలో ఉన్న ఏకైక కారు ఇదే. అందుకే ఆ దశాబ్దంలో ఉన్న అత్యంత వేగవంతమైన కారుగా ఇది ఎంపికైంది.

1890-1899

1890-1899

బెంజ్ మోటార్ వ్యాగన్ తరువాత ప్రపంచానికి పరిచయం అయిన రెండవ కారు ఇది. నీటి ఆవిరి ద్వారా నడిచే స్టేన్లీ రునాబౌట్ కారు 1890-1899 మధ్య కాలంలో గంటకు 30 మైళ్ల వేగంతో ప్రయాణించేది.

Picture credit: bonhams

 1900-1909

1900-1909

1900 సంవత్సరంలో వాహనాల మీద తీవ్రమైన పరిశోధనలు జరిగాయి. అయితే 1900 నుండి 1909 మధ్య కాలంలో మెర్సిడెస్ వారి సింప్లెక్స్ కారు అసలైన కారు రూపాన్ని పొందింది. అప్పట్లో ఇది గంటకు 73 మైళ్ల వేగంతో పరుగులు పెట్టేది. 110 సంవత్సరాల వయస్సున్న ఈ కారు ఇుప్పటికి కూడా హైవే రోడ్ల మీద నడవగలదని తెలిసింది.

1910-1919

1910-1919

ఆస్ట్రో డైమ్లర్ ప్లిన్స్ హెన్రీ పిలవబడే ఈ కారు 1910-1919 మధ్య కాలంలో గంటకు 85 మైళ్ల వేగంతో ప్రయాణించేది. దీని ఇంజన్‌ను ఫెర్డినాండ్ పోర్షే రూపాదించాడు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పోర్షే కార్లను ప్రేమిస్తున్నవారు ఎంతో మంది ఉన్నారు.

Picture credit: Brian Snelson/Wiki Commons

1920-1929

1920-1929

ఆబర్న్, భారత్‌కు చెందిన డ్యుసెన్‌బర్గ్ మోడల్ జె అను ఈ కారు గంటకు అత్యధికంగా 119 మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అమెరికాకు చెందిన ఇంజనీరింగ్ వ్యవస్థ ఎంతో గర్వంగా అనుభూతి చెందింది.

1930-1939

1930-1939

ఆబర్న్ వారు అప్ గ్రేడ్ చేసిన మోడల్ జె కారు ఇది. డ్యుసెన్‌బర్గ్ మోడల్ ఎస్‌జె అనే కారు 1932 లో అత్యధికంగా గంటకు 140 మైళ్ల వేగంతో పరుగులు పెట్టింది.

Picture credit: Dennis Elzinga/Wiki Commons

1940-1949

1940-1949

రెండవ ప్రపంచ యుద్దం తరువాత జాగ్వార్ సంస్థ తయారు చేసిన ఈ కారు ఎక్స్‌కె 120 ఇది అప్పట్లో గంటకు 120 మైళ్ల వేగంతో ప్రయాణించింది. ఆ తరువాత ఇది 135 మైళ్ల వేగాన్ని కూడా అందుకుంది.

Picture credit: dave_7/Wiki Commons

1950-1959

1950-1959

ఆంగ్ల ఇంజనీరింగ్ పరిజ్ఞానం మరియు ఇటాలియన్ వారి బాడీతో రూపొందించబడిన ఈ కారు పేరు ఆస్టన్ మార్టిన్ డిబి4 జిటి. 1950-1959 మద్య కాలంలో అత్యంత వేగంగా నడిచే కార్లలో ఇది మొదటి స్థానంలో నిలిచింది. అప్పట్లో ఇది గంటకు 153 మైళ్ల వేగంతో ప్రయాణించేది. అసలైన కారును రూపాన్ని కలిగిన ఈ డిజి4 కారు ఆస్టన్ మార్టిన్ సంస్థకు ఎనలేని పేరును సంపాదించి పెట్టింది.

 1960-1969

1960-1969

ఫెరారి 365 జిటి/4 డేటొనా కారు లో గల వి12 ఇంజన్ దీనిని గంటకు 174 మైళ్ల వేగంతో నడిపిచింది. అయిత అప్పట్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా పరుగులు పెట్టే కారుగా ల్యాంబోర్గిని మియురా స్థానం సంపాదించుకుంది. దీని వేగం గంటకు 171 మైళ్లు.

1970-1979

1970-1979

ఈ దశాబ్దంలో ల్యాంబోర్గిని మరియు ఫెరారి మధ్య తీవ్రమైన పోటి ఉండేది. ల్యాంబోర్గిని వారి కౌంటాక్ మరియు ఫెరారి వారి జిటి4 బెర్లినెట్టా బాక్సర్ల మద్య తీవ్ర పోటి నెలకొంది. ఇందులో ల్యాంబోర్గిని వారి కౌంటాక్ కారు గంటకు 200 మరియు బెర్లినెట్టా బాక్సర్ కారు గంటకు 188 మైళ్ల వేగాన్ని కలిగి ఉన్నాయి.

Picture credit: Thesupermat/Wiki Commons

1980-1989

1980-1989

1986 లో తయారు అయిన పోర్షే 959 కారు ఈ దశాబ్ధంలో అత్యంత వేగంవంతమైన కారుగా రికార్డులకు ఎక్కింది. ఇది అప్పట్లో గంటకు 200 మైళ్ల వేగంతో పరుగులు పెట్టింది. అయితే ఆ తరువాత ఫెరారి వారు విడుదల చేసిన ఎఫ్ 40 కారు 202 మైళ్ల వేగంతో వచ్చి 200 పోర్షే 959 మీద ఉన్న రికార్డును చెరిపేసింది.

1990-1999

1990-1999

ఆటోమొబైల్ చరిత్రలో ఇది ఒక అత్భుతమైన ఆవిష్కరణ అని చెప్పవచ్చు. మెక్‌లారెన్ ఎఫ్1 కారు అత్యధికంగా గంటకు 240 మైళ్ల వేగంతో పరుగులు పెట్టింది.

Picture credit: Wiki Commons

2000-2009

2000-2009

2007 సంవత్సరంలో ష్లీబె ఎస్ఎస్‌సి ఎరో కారు గంటకు 268 మైళ్ల వేగాన్ని నమోదు చేసింది. అప్పట్లో ఇది అత్యంత వేగంవంతమైన కారుగా ప్రపంచ రికార్డులను నమోదు చేసుకున్ గిన్నిస్ బుక్ తన పేజీలలో దీనికి స్థానం కల్పించింది.

Picture credit: Nate Hawbaker/Wiki Commons

 2010-ప్రస్తుతం వరకు

2010-ప్రస్తుతం వరకు

ప్రస్తుతం దశాబ్దంలో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగవంతమైన కారుగా హెనెస్సే వెనోమ్ జిటి కారు నిలిచింది. దీని గిరష్ట వేగం గంటకు 270 మైళ్లు( దాదాపుగా 434 కిలోమీటర్లు). అయితే కోయినింగ్‌సెంగ్ వారి కారు దీనికన్నా మూడు మైళ్ల అధిక వేగంతో పరుగులు పెడుతుందని తెలిపారు. అయితే ఇంకా రుజువుచేయలేదు.

ప్రతి దశాబ్దంలో ఉన్న వేగవంతమైన కార్లు: 1880 నుండి నేటి వరకు
  • గత 50 ఏళ్ల నుండి ప్రపంచ వ్యాప్తంగా గల ఉత్తమ కారు
  • అతిపెద్ద క్రూయిజ్ షిప్స్: ఫొటోలు

Article Published On: Saturday, January 30, 2016, 12:09 [IST]
English summary
Fastes Car Of Every Decade 1880 To Present
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+