ఫాస్టెస్ట్ అమెరికన్ పోలీస్ కారు: 2014 డాడ్జ్ చార్జర్ పర్షూట్
అమెరికా పోలీసుల కోసం ఇప్పుడు అత్యంత వేగవంతమైన కారు అందుబాటులోకి వచ్చింది. 2014 డాడ్జ్ చార్జర్ పర్షూట్ (2014 Dodge Charger Pursuit) పేరుతో రూపుదిద్దుకున్న ఈ పోలీస్ కారు, అమెరికాలో కెల్లా అత్యంత వేగవంతమైన కారు. క్రైస్లర్ గ్రూపుకు చెందిన డాడ్జ్ బ్రాండ్ ఈ సూపర్ పోలీస్ కారును తయారు చేసింది.
ఈ కొత్త 2014 డాడ్జ్ చార్జర్ పర్షూట్ ఆల్-వీల్ డ్రైవ్ పోలీస్ కారును మిచిగాన్ రాష్ట్ర బలగాలు టెస్ట్ చేశాయి. ఈ కారులో 370 హార్స్ పవర్‌ల శక్తిని ఉత్పత్తి చేసే 5.7 లీటర్ హెమీ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది కేవలం 6.0 సెకండ్ల సమయంలో 0-100 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. ఇది 292 హార్స్ పవర్ 3.6 లీటర్ వి6 ఇంజన్ ఆప్షన్‌తో కూడా లభిస్తుంది.
లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు, డాడ్జ్ బ్రాండ్‌కు చెందిన పోలీస్ అడ్వైజర్ బోర్డ్‌ల నుంచి సేకరించిన ఇన్‌పుట్స్ ప్రకారం, 2014 చార్జర్ పర్షూట్ కారును, వారి అంచనాలకు అనుగుణంగా మెరుగుపరచామని క్రైస్లర్ పేర్కొంది. ఈ ఫాస్టెస్ట్ అమెరికన్ పోలీస్ కారుతో పాటుగా, వివిధ దేశాల్లోని పోలీసులు ఉపయోగించే ఫాస్టెస్ట్ కార్ల వివరాలను క్రింది ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి.

అమెరికా - 2014 డాడ్జ్ చార్జర్ పర్షూట్
ఈ ఫాస్టెస్ట్ అమెరికన్ పోలీస్ కారు 2014 డాడ్జ్ చార్జర్ పర్షూట్‌ను అత్యంత సురక్షితమైన సేఫ్టీ ఫీచర్లతో రూపొందించారు. వేగంగా వెళ్లేటప్పుడు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే, లోపల ఉండే పోలీసులకు అన్ని వైపుల నుంచి రక్షణ కల్పించేలా ఈ కారును డిజైన్ చేశారు. ఈ కారును కెనడాలోని బ్రాంప్టన్ ప్లాంట్‌లో ఉత్పత్తి చేశారు.

జర్మనీ - బార్బస్ సిఎల్ఎస్ రాకెట్
కార్ల కంపెనీలకు పుట్టినిల్లు అయిన జర్మనీలో అక్కడి పోలీసులు ఉపయోగించే కారు పేరు 'బార్బస్ సిఎల్ఎస్ రాకెట్'. పేరుకు తగ్గట్లుగానే ఇది రాకెట్ వేగంతో పరుగులు తీస్తూ, పరారీలో ఉన్న వారిని పట్టుకునేందుకు వారికి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది. మెర్సిడెస్ బెంజ్ అందిస్తున్న సిఎల్ఎస్ కారుకు పెర్ఫామెన్స్ ఎడిషనే ఈ బార్బస్ సిఎల్ఎస్ రాకెట్.

మిచిగాన్ (అమెరికా) - కాడిలాక్ సిటిఎస్-వి
అమెరికన్ ఆటో దిగ్గజం జనరల్ మోటార్స్ అందిస్తున్న కార్ బ్రాండ్ కాడిలాక్ (ఆ దేశ అధ్యక్షుడి అధికారిక వాహనం కూడా ఇదే బ్రాండ్). మిచిగాన్ పోలీసులు పెట్రోలింగ్ కోసం కాడిలాక్ సిటిఎస్-వి కారును ఉపయోగిస్తారు. చూడటానికి ఇది ఎంతో అందంగా ఉంది కదూ..!

టెక్సాస్ (అమెరికా) - చెవర్లే కమారో
చెవర్లే కూడా అమెరికన్ ఆటోమొబైల్ బ్రాండ్ జనరల్ మోటార్స్‌కు చెందనదే. టెక్సాస్ పోలీసులు ఈ ఖరీదైన మరియు శక్తివంతమైన కారును తమ అధికారిక వాహనంగా వినియోగిస్తారు.

ఫ్లోరిడా (అమెరికా) - డాడ్జ్ ఛాలెంజర్
డాడ్జ్ ఛాలెంజర్ క్లాసిక్ కార్ అయినప్పటికీ, ఇది ఇంకా పోలీసులకు సేవలందిస్తూనే ఉంది. ఫ్లోరిడా పోలీసులు డాడ్జ్ ఛాలెంజర్ కారును తమ పెట్రోలింగ్ ప్రయోజనం కోసం ఉపయోగిస్తారు.

జపాన్ - హోండా ఎన్ఎక్స్
మరి జపాన్ పోలీసులు ఏ కారును ఉపయోగిస్తారో తెలుసా..? హోండా అందిస్తున్న పాపులర్ ఎన్ఎస్ఎక్స్ కారుని. వేగాని, వేగవంతమైన రోడ్లకు నిలయమైన జపాన్‌లో క్రిమినల్స్‌ను క్యాచ్ చేయాలంటే వారికి హోండా ఎన్ఎస్ఎక్స్ కారు కావాల్సిందే.

అబుదాబి - నిస్సాన్ జిటిఆర్
ఆయిల్ రిచ్ దేశమైన అబుదాబి పోలీసులు ఉపయోగించే నిస్సాన్ జిటిఆర్ స్పోర్ట్స్ కారు. వేగానికి, పికప్‌కు, పెర్ఫామెన్స్‌కు మారు పేరు నిస్సాన్ జిటిఆర్. అందుకే సచిన్ కూడా తన ఫెరారీ కారును అమ్మేసి ఓ నిస్సాన్ జిటిఆర్ కారును కొనుగోలు చేసాడు.

ఫ్రాన్స్ - ప్యూజో స్పోర్ట్స్ జిటి
ఫ్రెంచ్ పోలీసులు ఉపయోగించే ఈ అందమైన కారు పేరు ప్యూజో స్పోర్ట్స్ జిటి. హైవే పెట్రోలింగ్ కోసం ఫ్రాన్స్ పోలీసులు ఈ కారును తమ అధికారిక వాహనంగా ఉపయోగిస్తారు.

జర్మనీ - పోర్షే 911
జర్మనీలో పోలీసు ఉన్నతాధికారుల కోసం ఆ దేశ ప్రభుత్వం పాపులర్ పోర్షే 911 కారును అధికారిక వాహనంగా కేటాయించింది. ప్రపంచ వ్యాప్తంగా పోర్షే 911 పెద్ద క్రేజ్ ఉంది. పవర్‌ఫుల్ ఇంజన్, సాటిలేని పెర్ఫామెన్స్, గరిష్ట వేగాలకు పోర్షే 911 పెట్టింది పేరు.

నెథర్లాండ్స్ - స్పైకర్ సి8
నెథర్లాండ్స్ పోలీసులు స్పైకర్ సి8 అనే కన్వర్టిబల్ స్పోర్ట్స్ కారును తమ అధికారిక వాహనంగా ఉపయోగిస్తారు. పెట్రోలింగ్ సమయాల్లో దొంగలను సులువుగా క్యాచ్ చేసేందుకు ఈ కన్వర్టిబల్ కారు ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది.

భారతదేశం - మహీంద్రా జీప్
ఇక చివరిగా మన దేశ పోలీసులకు ప్రభుత్వం అధికారిక వాహనంగా కేటాయించింది మహీంద్రా జీప్ (అధికారి హోదాను బట్టి వాహనం మారుతుంది). ఎన్నో సంవత్సరాలుగా భారతీయుల రవాణా అవసరాలను తీరుస్తున్న జీప్ ఇప్పటికీ పోలీసులకు అధికారిక వాహనంగా ఉండటం చెప్పుకోదగిన విషయం.



Click it and Unblock the Notifications








